Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(10-02-2019)

Published

on

 1. పేదోడి సొంతింటి కల నిజం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 4 లక్షల గృహప్రవేశాలు జరిగాయి. నెల్లూరులోని జనార్థన్‌రెడ్డి కాలనీలో పేదలకు నిర్మించిన ఎన్టీఆర్‌ నగర్‌లో 30 వేల ఇళ్లల్లో చంద్రబాబు గృహప్ర వేశాలు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం జరగగా ఆయన నెల్లూరు జిల్లాలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
 2. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ‘ఆస్కీ’ అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సిఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, శాసనసభ్యులు రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శాసనమండలి సభ్యుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 3. మేయర్‌ జర సమయాన్ని పాటించండి లేదా మీకు వీలైన సమయాన్ని చెప్పితే దానికి అనుగుణంగా కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతామని బిజేపి కార్పొ రటర్‌ శంకర్‌ యాదవ్‌ మేయర్‌ బొంతు రామ్మో హన్‌ను కోరారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం ఉదయం పదిన్నర గంటల కని చెప్పితే వచ్చి కూర్చున్నా తమ రాకపోవడంతో సమావేశం ఆలస్యంగా ప్రారం భం కావడం బాధాకరంగా ఉందన్నారు.
 4. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోమోరిన్ ప్రాంతం నుంచి కోస్తా ఆంధ్ర వరకు ఇంటీరియర్ తమిళనాడు, రాయలసీమ మీదుగా 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఉత్తర ఛత్తీస్‌ఘడ్ దానిని ఆనుకొని ఉన్న జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తా, ఆంధ్రా, రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
 5. తెలంగాణలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలపై హైకోర్టులో కేసు నడుస్తుండగా, వాటిని తెరినందుకు కలెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది.
 6. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, జగదేవిపేటలోని వడ్డిపాళెంలో మామ చేతిలో అల్లుడు హతమయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తన కూతురు భవిష్యత్తు కోసమేనని నిందితుడు పేర్కొన్నాడు.
 7. ‘అనంతపురం నగరంలో కార్పొరేటరుగా పోటీ చేసి.మేయరు అయి అనంతను అభివృద్ధి చేస్తా’ అని అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి.దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
 8. దైవదర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు చేరిన సంఘటన జహీరాబాద్ పట్టనంలోని పాత ఆర్టీ చెక్‌పోస్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసులు,మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండలంలోని చిరాగ్‌పల్లి గ్రామానికి చెందిన రాజోలా శ్రీనివాస్, శ్రీనివాస్ భార్య సంధ్య, శ్రీనివాస్ తల్లి లక్ష్మిలతో కలిసి ద్విచక్ర వాహనం పై నియోజకవర్గలోని న్యాల్‌కల్ మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులోని పంచవటి క్షేత్రంలోని శ్రీ సరస్వతి మాతను దర్శించుకునేందుకు ద్విచక్రవాహనం పై ప్రయాణం అయ్యారు. పట్టణంలోని ఆర్‌టిఓ చెక్‌పోస్టు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో శ్రీనివాస్ భార్య సంధ్య అక్కడికి అక్కడే మృతి చెందింది. శ్రీనివాస్, శ్రీనివాస్ తల్లిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతురాలు సంధ్యకు పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వివరించారు.
 9. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ‌నివారం రాత్రి పాతభవనంలోని ఓ మెడికల్ షాపులో మంటలు వ్యాపించాయి.
 10. పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగబోదని ప్రధాని నరేంద్రమోడీ అసోం, ఈశాన్య ప్రాంత ప్రజలకు శనివారం భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు పౌరసత్వ బిల్లు ఇబ్బంది కలిగించబోదని చెప్పారు. అసోం ఆరోగ్యశాఖమంత్రి, నెడా కన్వీనర్‌ హిమత బిశ్వ శర్మ నియోజకవర్గం చాంగ్‌సరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఈశాన్య ప్రాంత ప్రజలకు హాని కలిగించబోమని గట్టి హామీ ఇస్తున్నాం.
 11. సిద్దిపేట పట్టణంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పట్టణంలోని మెదక్ రోడ్డులో గల రైతు బజార్ ముందు ఉన్న ఓ వెదురు కర్రల దుకాణంలో ఒకేసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు పక్కపక్కనే ఉన్న 8 దుకాణాలకు వ్యాపించాయి. ఇదే క్రమంలో అక్కడే ఉన్న ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి 8 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా, సుమారు రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిన్నట్టు సమాచారం. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారంతో అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయిన మంటలు అదుపులోకి రాకపోవడంతో హుస్నాబాద్, రామాయంపేటల నుండి సైతం రెండు ఫైర్ ఇంజన్లను రప్పించి సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. అలాగే మునిసిపల్ శాఖ నుండి వచ్చిన రెండు వాటర్ ట్యాంకర్ల సహయంతో స్థానికులు సైతం మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చి ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వందలాది సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అడిషనల్ డిసిపి గోవిందు నర్సింహారెడ్డి, ఏసిపి రామేశ్వర్, టూటౌన్ సీఐ ఆంజనేయులు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి వరకు సహయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
 12. ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన వడ్డెర జగన్ ఆయన కుటుంబంతో గత 5 నెలల క్రితం కూలి పనుల కోసం చందానగర్‌కు వచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు పెద్ద కుమారుడైన వడ్డెర ఎల్లప్ప (7) ఫిబ్రవరి 7వ తేదిన వారు నివసించే గుడిసె నుంచి తల్లి వడ్డెర నాగమ్మతో పాటు హుడా కాలనీలో కూలీ పనులు కోసం వచ్చాడు. దీంతో అక్కడే ఉన్న పార్కులో ఆడుకోవడానికి వెళ్ళిన బాలుడు వడ్డెర ఎల్లప్ప సాయంత్రమైన తిరిగి రాలేదు. ఎంత మేరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట, స్నేహితుల వద్ద బాలుడి ఆచూకి కోసం గాలించిన లభ్యంకాకపోవడంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన్నట్టు వెల్లడించారు.
 13. మధ్యప్రదేశ్‌లో గోవధ చేస్తున్న వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలన్న అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీ సీని యర్‌ నేత చిదంబరం తప్పుబట్టారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో మాట్లాడి తప్పు దిద్దుకోవాలని సూచించారని తెలిపారు. తను రాసిన ఓ పుస్తక ఆవిష్క రణ కార్యక్రమంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.
 14. రాఫెల్‌ ఒప్పందంపై శివసేన ప్రధాని నరేంద్రమోడీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘రాఫెల్‌ ఒప్పందం భారత వైమానిక దళాన్ని పటిష్టవంతం చేయడానికా? లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడానికా?. దీనికి మోడీ సమాధానం చెప్పి తీరాల్సిందే’నని శివసేన డిమాండు చేసింది. హిందూ వార్తపత్రికలో శుక్రవారం వచ్చిన కథనంపై శివసేన స్పందించింది. సామ్నా పత్రిక సంపాదకీయం మోడీ, ప్రధానమంత్రి కార్యాలయంపై దుమ్మెత్తిపోసింది. మోడీ గురువారమే దేశభక్తి గురించి పార్లమెంటులో పెద్దపెద్ద మాటలు మాట్లాడారు.
 15. సంగిరెడ్డి హనుమంతరెడ్డి ఎన్‌.డి.ఎ. బుద్ధిహీన జనా కర్షణకు వ్యతిరేకమని 2014 లో బడ్జెట్‌ సమర్పిస్తూ జైట్లీ గొప్పలు చెప్పారు. ఐదేళ్ళ విఫల పాలనతో మోడీకి జనాకర్షణ అవసర మైంది. 2014 వాగ్దానాలు అమలు కాలేదు. గణాంకాల మోసం, అవకతవకల నివేది కలు, ప్రభుత్వ సంస్థల అణచి వేత, విమర్శకుల నోళ్ళ మూత, హింస, హత్యలు నిజాలను దాయలేకపోయాయి. ఉపాధి, ఉద్యోగ కల్పన జరగలేదు. రైతుల బాధలు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలయింది.
 16. మద్యం మత్తులో భార్యను చితకబదాడంతో మృతి చెందిన సంఘటన కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట్‌పల్లి గ్రామానికి చెందిన హౌజీ రాధ(22) వీరు నేపాల్‌కు చెందినవారు. అయితే దీలిప్‌సింగ్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా కోట్‌పల్లి గ్రామంలో గురుకగా విధులు నిర్వహిస్తు జీవనం సాగిస్తు గ్రామంలో మంచిపేరు పొందారు. ఇతనికి పుట్టిన కూమారుడు క్రిష్ణ (26) గత ఆరు నెలల క్రితం నెపాల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా కుటుంబం మంచిగా సాగింది. గత కొన్ని రోజుల నుంచి అమ్యాయిని చిత్రహింసాలు పెట్టి మద్యం తగుతూ చితకబదేవారు. దీంతో పాలు మార్లు గమనించిన క్రిష్ణ తండ్రి కోట్‌పల్లి వదిలి సంగారెడ్డికి వెళ్లి కూలి చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. తన కొడుకు, కోడలు కోట్‌పల్లిల్లోనే ఉంటున్నారు. శుక్రవారం ఆర్దరాత్రి మద్యం సేవించి రాత్రి భార్యతో చిన్నపాటి గొడవకు దిగారు. దీంతో ఇద్దరి మద్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో కర్రతో తలపై, వీపుపై , కాలపై బలంగా కొట్టడంతో సృహ తప్పి పడిపోయింది. బయపడిన క్రిష్ణ శనివారం ఉదయం ప్రాంతల్లో ఇంటి పక్కల ఉన్న ప్రజలకు చెప్పడంతో వారు 108కు సమాచారం అందిచారు. 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు వచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో భర్త క్రిష్ణ ఇంటి వద్దనే ఉండగా గ్రామస్థులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఏడకొండలు, మృతికి కారణమైన వివరాలు సేకరించి భర్తను అదుపులోకి తీసుకొన్నారు. కోట్‌పల్లి వీఆర్వో నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మర్పల్లి ప్రభుత్వ అసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వికారాబాద్ ప్రభుత్వ అసుపత్రి కోల్డ్‌స్టోరేజిలో మృతిరాలు తల్లిదండ్రులు వచ్చేంతవరకు అక్కడే శవాన్ని భద్రపరిచినట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. ఈ సంఘటన స్థలాన్ని వికారాబాద్ డిఎస్పి శిరీష, ధారూర్ సిఐ దాసులు పరిశీలించారు.
 17. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నగరాన్ని గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సిఎం కెసిఆర్‌ అధికారులకు సూచించారు. ప్రగతిభవన్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కరించాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. బృహత్‌ ప్రణాళికలో మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం చేస్తామని స్పష్టం చేశారు. నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్‌ఎండిఎపై మాత్రమే పెట్టకుండా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరాభివృద్ధికి జీహెచ్‌ఎంసి నిధులపైనే ఆధారపడకుండా ఇతరత్రా నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు. నగరాన్ని 3 యూనిట్లుగా విభజించి 3 నెలల్లో బృహత్‌ ప్రణాళిక రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
 18. ఆస్థిపన్నుల మదింపు చేసేందుకు లంచం అడిగిన జిహెచ్‌ఎంసి రెవిన్యూ సిబ్బందిని అవినీతి నిరోదక శాఖ అధికారులు శనివారం రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. రెవిన్యూ అధికారి అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటలో నివాసముండే మంజూర్ ఆహ్మద్ కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో రెవిన్యూ విభాగంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి అసిస్టెంట్‌గా యాకుబ్‌ను నియమించుకున్నాడు. ఇదే సర్కిల్ పరిధిలోని సూర్యానగర్‌లో నివాసముండే దంత వైద్యుడు బాలాజీ గుప్తకు దత్తాత్రేయనగర్‌లో ఇళ్లు ఉంది. ఇప్పటి వరకు సదరు ఇంటికి పాత ఇంటి పన్ను అమలులో ఉంది. కాగా ఈ మధ్యకాలంలో ఇంటి పన్నులను సవరిస్తామని దీంతో ఎక్కువ మొత్తంలో ఇంటి పన్ను చెల్లించాల్సి వస్తుందని ఆర్‌ఐ మంజూర్ ఆహ్మద్ ఇంటి యజమానికి తెలిపాడు. తక్కువ ఇంటి పన్ను రావాలంటే తనకు రూ.25000లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకరించిన సదరు ఇంటి యజమాని ముందస్తుగా రూ.15 వేల రూపాయాలను ఇచ్చాడు. మిగిలిన రూ.10 వేలు ఇవ్వడానికి ముందు అవినీతి నిరోదక శాఖ అధికారులను ఆశ్రయించి వివరాలను తెలిపాడు. ఎసిబి డిఎస్పి సూర్య నారాయణ సూచన మేరకు అనుకున్నట్లుగా ఆర్‌ఐకి డబ్బులు ఇస్తున్నట్టుగా సమాచారం ఇచ్చాడు. ముందుగా ఎసిబి అధికారులు ఇచ్చిన డబ్బులను తీసుకొని అప్పటికే చింతల్‌లో డబ్బుల కోసం వేచి చూస్తున్న ఆర్‌ఐ అసిస్టెంట్ యాకుబ్‌కు అందించాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్‌గా యాకుబ్‌ను అదుపులోకి తీసుకొని, వెంటనే మరో బృందం రంగంలోకి దిగిన మలక్‌పేటలో నివాసముండే మంజర్ ఆహ్మద్‌ను కూడా అరెస్టు చేశారు. అనంతరం సర్కిల్ కార్యాలయంలో ఆస్తి పన్ను మదింపు తదితర విషయాలపై రెవిన్యూ విభాగంలో ఆరా తీశారు. ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్న ఆర్‌ఐతో పాటు అసిస్టెంట్‌ను విచారించి రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు.
 19. రెండు రోజుల క్రితం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో దారుణ హత్యకు గురైన మహిళను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు వివాహేతర సంబందమే కారణమని ఎసిపి శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఎసిపి అందె శ్రీనివాస్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం… జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌కు చెందిన దోనబోయిన దుర్గా(28) ఫిబ్రవరి 7వ తేదీన హత్యకు గురైంది. హత్య జరిగిన ప్రదేశంలో మొపెడ్ ద్విచక్రవాహనం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి 48 గంటల్లోనే మృతిరాలితో వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తే హత్య చేసినట్లుగా నిర్ధారించి అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. దుర్గకు మొదట్లో శ్రీనివాస్‌ రావు అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. మూడు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న దుర్గా లెనిన్‌నగర్‌లోని తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో అల్వాల్ మచ్చ బొల్లారంకు చెందిన శివగౌడ్‌తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబందానికి దారి తీసింది. శివగౌడ్ కూడా తన కుటుంబంతో లెనిన్‌నగర్‌కు మకాం మార్చాడు. దుర్గా తరుచుగా శివగౌడ్‌ను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యాదగిరిగుట్టలో దండలు మార్చుకున్నారు. అనంతరం వారి వివాహనికి శివగౌడ్ భార్య అనుష పిల్లలు అడ్డువస్తున్నారని తిరిగి దుర్గా ఒత్తిడి తేవడంతో నాలుగు నెల క్రితం తన తొమ్మిది నెలల కుమారుడిని ఆటోకు, నేలకు వేసి కొట్టడంతో కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి శివగౌడ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా మరోవైపు దుర్గా తన మీద పెళ్లి ఒత్తిడి పెంచుతుండటంతో ఎలాగైన తనను పోలీసులకు పట్టిస్తుందని అనుమానించాడు. దీంతో ముందస్తు ప్రణాళికతో తన బామర్థి వెంకటేశ్‌తో కలిసి దుర్గను పిలిపించుకున్నాడు. ఈ నెల 7వ తేదీన దుర్గ తన మొపెడ్ టిఎస్ 07 ఈజె 9566 ద్విచక్రవాహనంపై కొంపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని దేవరయాంజాల్ వ్యవసాయన క్షేత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడే ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మాటామాటా పెరగడంతో శివగౌడ్ తన బామ్మర్థి సహాయంతో కత్తితో రెండు సార్లు పొడిచి, బండరాళ్లతో తలపై మోది హత్యకు పాల్పడ్డారు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. నగరం నుంచి బయటకు పారిపోయేందుకు శనివారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి రిమాండ్‌కు తరలించారు. వీరు గతంలో పోలీసుల రికార్డులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 20. ప్రతి సంవత్సరం చింతకాయ పచ్చడి సీజన్ వచ్చే సరికి ప్రతి గ్రామంలో మహిళలు ముందుగా చింతకాయ కన్నా ముందు మిరుప పండ్ల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఈ ఏడాది సైతం ప్రస్తుతం చింతకాయ పచ్చడి సీజన్ ప్రారంభమైంది. గ్రామాలలో ప్రస్తుత రోజుల్లో చింత చెట్లు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. దాంతో ఈ సారీ చింతకాయ కిలో ధర రూ.40ల నుండి రూ. 50ల వరకు చేరింది. ముందుగా చింతకాయ సమకూర్చుకున్న మహిళలు మిరప పండ్లకోసం దృష్టి సారించారు. గత నాలుగు ఐదు రోజులుగా గ్రామాలలోనికి మిరప పండ్లు అమ్మకానికి వస్తున్నాయి. ప్రస్తుతం మిరప పండ్ల ధర రూ.50లకు కిలో అమ్ముతున్నారు. మండలం లోని చాలా గ్రామాలు గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామాలు కావడంతో ఇక్కడ వరి పంట పోలాలు ఎక్కువ గా సాగుచేస్తారు. దీంతో మండలంలో మిరప పండ్లుకు భలే గిరాకీ ఉంటుంది. మండలం ప్రక్క మండలం ధర్మపురి లోని సిరికోండ, రాయపట్నం, తమ్మనాల గ్రామాల నుండి ఇక్కడికి మిరప పండ్ల అమ్మకోవడానికి రైతులు వస్తుంటారు. మంచి మిరప పండ్ల తో చింతకాయ పచ్చడి ని తయారు చేసుకుంటే ఏడాది పాటు మన్నుతుందని ఇక్కడి మహిళల నమ్మకం.చింతకాయ, ఉప్పును కలిపి ఊరబెడుతారు. తరువాత మిరప పండ్లను దంచి ఊరబెడుతారు. ఎప్పుడు అవసరం మనుకుంటే అప్పుడు ఊరబెట్టిన చింతకాయ, మిరప పండ్లను దంచి, తరువాత నూనెతో పోపు పెట్టి వాడుకుంటారు.
 21. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ చిత్రంపై పలు రకరకాల రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు 1940 బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుందని.. ఇందులో ఎన్టీఆర్ బందిపోటుగా, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా లీక్ అయిన షూటింగ్ ఫొటోలు ఈ రూమర్స్‌కి బలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. తాజాగా లీకైన పిక్స్‌ని బట్టి చూస్తే ఇది రూమర్ కాదని, అక్షరాలా నిజమేనని తెలుస్తోంది. పిక్స్‌ని బట్టి చూస్తే.. ఇది పిరియాడికల్ మూవీ అని, స్వాతంత్ర్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతోంది. లీకైన ఫోటోల్లో పోలీస్ స్టేషన్ సెట్‌ ఒకటి కనిపిస్తోంది. ఆ పోలీస్ స్టేషన్ ఎదుట బ్రిటీష్ వాళ్ల ఫ్లాగ్ కనిపిస్తోంది. సినిమాలో నటించే వారి వేషధారణ నాటి పరిస్థితులకు అద్దం పడుతోంది. సెట్‌లో చెర్రీ పిక్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
 22. భర్తతో గొడవ పడి తన 14 నెలల కొడుకును వదిలి ఇంటి నుండి ఓ వివాహిత వెళ్లి పోయిన సంఘటన శుక్రవారం మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం… ఓర్సు రాములు, విజయ(26) దంపతులు మీర్‌పేట్ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో 14 నెలల బాబుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ తమ ఏటిఎం కార్డు తీసిందని పక్కింటివారు రాములుకు చెప్పడంతో భార్యను మందలించాడు. దీంతో భర్తతో గొడవ పడిన విజయ భర్తతో పాటు, కొడుకును సైతం వదిలి అదే రోజు రాత్రి ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎంత వెతికినా విజయ ఆచూకీ లభించకపోవడంతో భర్త శుక్రవారం మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 23. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని కార్యాలయం ఢిల్లీ నుండి వచ్చిన పిలుపు మేరకు కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామ సర్పంచ్ ఇనుగాల కిరణ్మయి శుక్రవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఫిబ్రవరి 12న హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్ అర్బన్ జిల్లా నుండి ముగ్గురు సర్పంచ్‌లకు ఆహ్వానం రాగా మండలంలోని మర్రిపెల్లిగూడెం సర్పంచ్ ఇనుగాల కిరణ్మయి రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. 12న జరిగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డును అందుకోనుంది. కాగా సర్పంచ్ ఇనుగాల కిరణ్మయి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఎంపికపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఇనుగాల రత్నాకర్, ఇనుగాల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
 24. నివాస గృహాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్‌ఒటి పొలీసులు దాడి చేసి నిర్వహకురాలితో పాటు మరో యువతి, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మీర్‌పేట్ మున్సిపాలిటి పరిధిలోని నందిహిల్స్ కాలనీలో వీరమల్ల బాల కనక మహాలక్ష్మి గత కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎల్‌బినగర్ ఎస్‌ఒటి పొలీసులు సదరు గృహంపై దాడి చేసి నిర్వహకురాలతోపాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాబిన్ ఖాతూన్(25) అనే యువతిని, ధన్‌రాజ్‌గౌడ్(48), వర్ధేశ్వర్‌గౌడ్(41)అనే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1160 నగదు, మూడు కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఒటి పొలీసులు వీరిని మీర్‌పేట్ పొలీసులకు అప్పగించారు.
 25. మిల్కీబ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ఎఫ్‌2 చిత్రం సక్సెస్‌తో చాలా హుషారుగా కన్పిస్తోంది. బాహుబలి ఎంత పెద్ద సక్సెస్‌ అయినా అందులో క్రెడిట్‌ మొత్తం ప్రభాస్‌, అనుష్కలు తీసుకోవడంతో తమన్నాకు పెద్ద సంతృప్తినివ్వలేదనే చెప్పవచ్చు. దానికి తోడు కాస్త ట్రాక్‌ మార్చి ఇప్పటిదాకా నటించని హీరోల సరసన ఓకే చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకే ఎఫ్‌2 కిక్కుని తను మాములుగా ఫీలవ్వడం లేదు.
 26. డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన ‘సాహో’ విడుదల తేదీ ఇంతకుముందే ఆగస్ట్‌ 15 అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు దానికి పోటీ లేకుండా దరిదాపుల్లోకి వెళ్లకుండా ఇతర నిర్మాతలు తమ సినిమాల ప్లానింగ్‌ను చేసుకుంటున్నారు. అయితే ఏ పోటీ లేదనుకుంటున్న తరుణంలో సూర్య రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు కోలీవుడ్‌ టాక్‌. రంగం సినిమాతో మనకూ బాగా దగ్గరైన దర్శకుడు కెవి ఆనంద్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘కాప్పన్‌’. తెలుగు టైటిల్‌ ఇంకా డిసైడ్‌ చేయలేదు.
 27. కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్లూ జీ310 ఆర్ స్పోర్ట్స్ మోడళ్లకు దీటుగా దీన్ని రూపొందించారు. కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్లూ జీ310 ఆర్ స్పోర్ట్స్ మోడళ్లకు దీటుగా దీన్ని రూపొందించారు.
 28. నారా బ్రాహ్మణి, వైఎస్ భారతి… నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తులు. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్. వివిఐపి పర్సన్స్. ఒకరు ప్రతిపక్ష నేత భార్య, మాజీ సిఎం కోడలు అయితే.. మరొకరు ప్రస్తుత సీఎం కోడలు, ఓ మంత్రి భార్య. వారే భారతి, బ్రాహ్మణి. వీళ్ల ఆస్తుల సంగతి మనందరికీ తెలిసిందే.
 29. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అయితే ఇది గ్యాంబ్లింగ్ అని కొందరు, జూదం అని మరికొందరు అనకుంటారు కానీ.. ఇదో సైన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెట్టుబడి పెట్టేందుకు ఓ అద్భుతమైన పెట్టుబడి సాధనంగా మనం స్టాక్ మార్కెట్లను చూడొచ్చు.
 30. అరటి గెలల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాకలోని సత్తయ్యపాలెంలో జరిగింది. అరటి గెలల లోడుతో వెళ్తున్న లారీలో పోలీసులు తనిఖీలు చేశారు. అరటి గెలల కింద ఉన్న గంజాయి పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దాదాపుగా 900 కిలోల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
 31. సూర్య వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని టివి నటి ఝాన్సీ తల్లి సంపూర్ణ అలియాస్ అన్నపూర్ణ తెలిపింది. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కూతురిని ఎవరితో మాట్లాడొద్దంటూ వేధించేవాడని, ఝాన్నీ ఆత్మహత్య చేసుకునే పది రోజుల ముందు సూర్యతో కలిసి తమ ఊరికి వచ్చారని తెలిపింది. సూర్య పుట్టిన రోజుకు ఝాన్సీ గిఫ్ట్‌గా బైక్ కొనిచ్చిందని, ఝాన్నీ దగ్గర ఉన్న పది లక్షల రూపాయల విలువైన నగలను బ్యాంక్ లాకర్‌లో పెడతానని సూర్య తీసుకున్నాడని చెప్పింది. సూర్యను పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతోనే ఝాన్సీ అతనితో ఉందని, తమకు పోలీసులపై నమ్మకం ఉందని, ఝాన్సీ మృతికి కారణమైన సూర్యను కఠినంగా శిక్షించాలని అన్నపూర్ణ డిమాండ్ చేసింది.
 32. ప్రేమించలేదనే కోపంతో ఓ ఉన్మాది ఇంటర్ చదువుతున్న మధులిక అనే విద్యార్థినిపై కొబ్బరి బోండాల కత్తితో భరత్ అనే యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. కాచిగూడా పరిధిలోని సత్యానగర్‌లో నివాసముంటున్న మధులికపై అదే కాలనీలో ఉంటున్న భరత్ అలియాస్ సోనూ బుధవారం ఉదయం 8: 30 గంటలకు కాలేజీకి వెళుతున్న ఆమెపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం బాలిక మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ హత్యాయత్నం కేసులో కాచిగూడ పోలీసుల దర్యాప్తులో తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై దాడికి ముందు భరత్‌ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. మధులిక వెంటపడొద్దని పలుమార్లు అతడి తల్లిదండ్రులు హెచ్చరించారు. దీంతో దాడిని అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో భరత్ తన తల్లిదండ్రులను ఇంట్లోని గదిలో బంధించి బయట గడియ పెట్టాడు. అలాగే హత్యాయత్నానికి ముందు బాధితురాలి తండ్రితో కూడా అతడు గొడవపడ్డాడు. బాలిక తనను ప్రేమించక పోగా, భరోసా సెంటర్‌కు తన కుటుంబ సభ్యులను పిలిపించి అవమానించిందని కక్ష పెంచుకుని ఈఘాతుకానికి పాల్పడ్డాడు అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం మధులిక మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటుంది. శనివారం వెంటిలేటర్ పై నుంచి ఆమెను తొలగించిన వైద్యులు ఐసియులో చికిత్స అందిస్తున్నారు.
 33. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఆ దేశ ప్రధానమంత్రి పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా ఛున్ యింగ్ ప్రకటించారు.
 34. అకాడెమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆయన కూతురు కటీజాలు ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు గాను స్వరమాంత్రికుడు రెహ్మాన్ ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అవార్డు అందుకుని 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో రెహ్మాన్ కూతురు ఖటీజా భావోద్వేగంతో ప్రసంగించారు.
 35. స్టార్‌ హీరోగా కమల్‌హాసన్‌ నటనా రంగంలో ఆరు దశాబ్ధాల ప్రస్థానం సాగించారు. బాలచందర్‌ శిష్యుడిగా తమిళ, తెలుగు సినీరంగంలో ఎదురే లేని స్టార్‌గా ఎదిగారు. లోకనాయకుడిగా తనని తాను ఆవిష్కరించకున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత అంతటివాడిగా ప్రఖ్యాత టైమ్స్‌ జాబితాలోనూ అతడి పేరు నిలిచింది. అయితే ఇన్నేళ్లలో కమల్‌ సంపాదించిన ఆస్తుల విషయానికొస్తే, ఇప్పటికే రూ.200కోట్లు పైమాటేనన్న టాక్‌ కూడా కోలీవుడ్‌లో ఉంది. ఏడాదికి రూ. 8 కోట్లు పైగానే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.
 36. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరి తాండ సమీపంలో అదుపు తప్పి శుక్రవారం రాత్రి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న గోడం దినేష్(13) ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం…. కెస్లాపూర్ జాతర నుంచి ప్రయాణికులతో ఉట్నూర్‌ వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి ద్విచక్రవాహనంను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దినేష్ మృతి చెందగా ఆటోలో ఉన్న ఆడెపరిగన్, కవిత, దుర్వ కృష్ణా, రామారావు, ద్విచక్ర వాహనదారుడు బాజిరావ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దినేష్ తండ్రి సోనెరావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ తెలిపారు.
 37. అక్కినేని కోడలు సమంత రాజకీయారంగేట్రంపై చాలాకాలంగా ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో వేడి పెరుగుతున్న వేళ సమంత రాజకీయాల్లోకి వస్తోందంటూ కొత్తగా మళ్లీ ప్రచారం ఊపందుకుంది. అయితే సమంత నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదని మరోసారి క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. సామ్‌ రియాలిటీలో రాజకీయాల్లోకి రావడం లేదు. వెండితెరపై నాయకురాలిగా కనిపించబోతోందని తెలుస్తోంది. విజరు సేతుపతి హీరోగా నటిస్తున్న తుగ్లక్‌ దర్బార్‌ అనే చిత్రంలో సామ్‌ కథానాయికగా నటించనుంది.
 38. కేంద్రంలోని బిజెపి కూటమి ఓటమే లక్ష్యమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. లోక్‌సభలో సిపిఎం, వామపక్షాల బలం పెంచుకుంటామని, కేంద్రంలోని ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
 39. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన రాఫెల్‌ విమానాల కొను గోలు వ్యవహారానికి సంబంధించి మరో రెండు పత్రాలను హిందూ పత్రిక తాజాగా వెల్లడించడంతో మోడీ సర్కార్‌ దిక్కుతోచని స్థితిలో పడింది.
 40. ప్రధాని నరేంద్ర మోడీి గుంటూరులో ఆదివారం జరిగే ప్రజా చైతన్య సభకు హాజరుకానున్నారు. స్థానిక బుడంపాడు నుంచి ఏటుకూరు జాతీయ రహదారి వద్దనున్న 18 ఎకరాల ప్రాంగణంలో సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి బయలుదేరి 10 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
 41. చాలా సినిమాల్లో రోగి పొట్టలో దూది మర్చిపోవడం విన్నాం కత్తులు మర్చిపోయి కుట్లు వేసెయ్యడం చూశాం. ఆఖరికి అదేదో సినిమాలో రోగి పొట్టలో వాచ్‌, సెల్‌ఫోన్లు మర్చిపోయిన సన్నివేశాలు.ఆ తర్వాత బాధితుడు ఇబ్బంది పడే దశ్యాలను చూసే ఉంటాం. అయితే తాజాగా భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందిన నిమ్స్‌ ఆసుపత్రిలోనూ అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళా రోగికి ఆపరేషన్‌ చేసిన నిమ్స్‌ వైద్యులు కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు.
 42. విలసిల్లిన ప్రాంతం అయినందుకు కాబోలు) బీహార్‌లు ఆదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. కానీ మొత్తంగా చూస్తే దక్షిణ భారతదేశంలో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మెరుగ్గా వున్నది. ”పారిశుద్ధ్యం మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి పది రూపాయలకు 9రూపాయలు లాభిస్తాయి. ఎందుకంటే పారిశుద్ధ్యం మీద ఖర్చు పెట్టడం అంటే ప్రజల ఆరోగ్యం వసతుల మీద ఖర్చు పెడుతున్నట్టే”. అనారోగ్యాలు, అం గ వైకల్యాలు తగ్గి, ఆరోగ్య కరమైన మానవులు రూపొందుతారు. అంటే నష్టం తక్కువగా వుందంటే లాభం జరిగిందన్నట్టే కాబ ట్టి పాలకులకు అతి ముఖ్యమైన విషయంగా మురుగునీటి నిర్వహణ అని చెప్పుకోవచ్చు.
 43. ఇంగ్లండ్ మహిళలతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌ను ఎంపిక చేశారు. సొంత గడ్డపై భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 22 సిరీస్ జరుగుతుంది. కాగా, ఇందులో పాల్గొనే టీమిండియాకు వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయితే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఎవరిని కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. ఇంతకుముందు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈసారి ఆ బాధ్యతలు అప్పగించలేదు. కొంతకాలంగా మిథాలీ, కౌర్‌ల మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో కూడా ఈ వివాదం మరోసారి రాజుకుంది. మిథాలీకి తొలి రెండు టి20లలో కూడా చోటు లభించలేదు. వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీకి టి20లలో మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మాత్రం మిథాలీకి కెప్టెన్సీ అప్పగించారు. మరోవైపు ఇంగ్లండ్‌తో తలపడే బోర్డు లెవన్ జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. భారత వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా, కల్పన, మోనా మెశ్రమ్, ఎక్తాబిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖాపాండే, మాన్సి జోషి, పూనమ్ రౌత్. బోరు ప్రెసిడెంట్ లెవన్ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, దేవిక వైద్య, మేఘన, భారతి, కోమల్, కల్పన, ప్రియా పునియా, హరిన్ డయోల్, రీమాలక్ష్మి, మనాలి, తనుజా కన్వర్, మిన్ను మాని.
 44. సందర్భంగా ప్రధాని మోడీకి తీవ్రస్థాయి నిరసనల సెగలు తగిలాయి. వివాదాస్పద పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకారులు కొందరు దిగంబర ప్రదర్శనలకు దిగారు. కొన్ని చోట్ల ప్రధాని దిష్టిబొమ్మలు తగులబెట్టారు. పలు చోట్ల ఉద్యమ కారులు నల్లజెండాలతో ప్రధానికి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ, పలు సభలలో పౌరసత్వ బిల్లుకు తిరుగు లేదని చెపుతూ వస్తున్న ప్రధానికి ప్రజల నిరసనలు ఎదురయ్యాయి. రాష్ట్ర రాజధానిలోని సచివాలయం జనతా భవన్ ఎదుట కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కెఎంఎస్‌ఎస్) వారు బట్టలు విప్పి నిరసనలకు దిగా రు. దీనితో ఆ ఆరుగురు దిగంబర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు పలువురు కార్లల్లో వచ్చి, పౌరసత్వ బిల్లుకు నిరసనలు తెలిపారు. ఉన్నట్లుండి అందులో కొందరు దిగంబరంగా మారారు. కేంద్రం చర్య దారుణంగా ఉందని, అందుకే తాము అంతే స్థాయిలో వ్యవహరించాల్సి వస్తోందని వీరు చెప్పారు. ప్రధాని రాకకు వ్యతిరేకంగా టాయ్ అహోం యుబ పరిషత్ 12 గంటల బంద్ పిలుపు ఇచ్చింది. దీనితో ఎగువ అసోంలో జనజీవితం స్తంభించింది. లకీంపూర్, దిబ్రూగర్, సిబ్‌సాగర్ ఇతర ప్రాంతాలలో బంద్ ప్రభావం ఎక్కువగా కన్పించింది. ఈ బంద్ పిలుపునకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. 70కి పైగా సంస్థలు బాసటగా నిలిచాయి. ఛాంగ్సారీలో మోడీ బహిరంగ సభ వేదికకు పది కిలోమీటర్ల దూరంలో నిరసనకారులు నల్లజెండాలతో నిలబడ్డారు. నల్ల బెలూన్లు ఎగురవేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసు జులుం చేశారని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) విమర్శించింది. నిరసనకారులు పలు చోట్ల దిష్టిబొమ్మల దగ్ధానికి యత్నించడం, ఇతరత్రా నిరసనలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనలకు దిగిన తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని స్థానిక గౌహతి యూనివర్శిటీ విద్యార్థులు ఆరోపించారు.
 45. బీకేఎంయూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈనెల 26న రాష్ట్రం లోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాల యాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌లు పిలుపునిచ్చారు. విజయవాడ దాసరిభవన్‌లో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
 46. మద్యానికి బానిసలయిన వారి కోసం త్వరలో జాగతి పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. మద్య నియంత్రణ తమ పరిధిలోని అంశమేనని, డీఎడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటులోనూ శాఖాపరంగా సహకారం అందిస్తామన్నారు. జాగతి కార్యక్రమంలో భాగంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.
 47. ఆదిలాబాద్ కేంద్రంగా సాగుతున్న అక్రమ గుట్కా వ్యాపారానికి చెక్ పెట్టేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యరించాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అనునిత్యం తనిఖీలు చేస్తూ విక్రేతలపై నాన్ బెయిలేబుల్ కే సులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు బడా వ్యాపారుల గోదాములపై దాడులు నిర్వహించి లక్షలాది రూపాయల విలువచేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసులు నమోదు చేస్తుండడం సత్ఫలితాలనిస్తుందని అంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి ప్రతి నెలా కోట్లాది రూపాయల గుట్కా, జర్దాలను జిల్లాలోని వి విధ ప్రాంతాల లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతని గోదాముల పై ఆరా తీసిన పోలీసులు ఆ తరువాత ఎక్కడి నుంచి గుట్కా తీసుకువస్తున్నారనే విషయంపై దృష్టి సారించారు. అక్రమ గుట్కా జిల్లా కేంద్రానికి రాకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. జిల్లాకు గుట్కా ఎగుమతి, దిగుమ తి కాకుండా ఎక్కడిక్కడ తనిఖీలు చేయడంతో ఈ వ్యాపారం చేసే వారు జంకుతున్నారు. ఈ తనిఖీలు ముందు నుంచే చేస్తున్నప్పటీకి ఈ మధ్య కాలంలో ఎన్నికలు రావడంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో ఇదే అదనుగా భావించి అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా ఎస్పీ పాన్‌షాప్, కిరాణ షాపుల యజమనులతో సమావేశం నిర్వహించి గుట్కాను విక్రయించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదటిసారి కేసు పెట్టి వదిలేస్తామని, రెండవ సారి రూ. 25వేల జరిమానాతో పాటు జైలు శిక్ష, మూడవ సారి పట్టుబడితే పీడీ యాక్టులు పెట్టేందుకు కూడా వెనకాడబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ హెచ్చరికలతో వారం రోజుల నుంచి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పాన్ షాప్, కిరాణ దుకాణం, గల్లి దుకాణాల్లో సైతం గుట్కాలను విక్రయించేందుకు భయపడుతున్నారు. సేల్స్‌మెన్‌లు సైతం గుట్కా, అంబర్, నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మేందుకు జంకుతున్నారు. గతంలో అయితే కేసు పెట్టగానే రూ.2 నుంచి 5 వేలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఈ వ్యాపారాన్ని మానేయాలని బడా వ్యాపారులు భావిస్తుండగా, పాన్‌టేలాలు, కిరాణా దుకాణం యజమానులు పోలీసుల తనిఖీలతో విక్రయాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అయితే జిల్లాకు గుట్కా అక్రమంగా రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, దీంతో గుట్కా విక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయని జిల్లా ప్రజలు అంటున్నారు.
 48. రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.70వేల కోట్లతో డేటా సెంటర్‌ పార్కు, రెన్యువబుల్‌ ఎనర్జీప్లాంట్‌ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో స్టేట్‌ ఇన్వెస్టుమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం శనివారం జరిగింది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రోత్సాహకాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని వలన 28వేల మందికి ప్రత్యేక్షంగా, ఐదువేలమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.
 49. ప్రతి ఒక్కరికీ నగరం పట్ల ప్రేమ ఉండాలి. అప్పుడే నగరం మరింత పరిశుభ్రంగా ఉంటుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్‌లు స్పష్టం చేశారు. శనివారం జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశానంతరం వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 800 ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి చెరువు వద్ద వినాయక నిమజ్జన కొలనులను నిర్మించామని తెలిపారు. పాదచారుల నడక కోసం ఫుట్‌పాత్‌లకు రేలింగ్‌లను ఏర్పాటు చేశామని, విడతల వా రీగా చెరువులను అభివృద్ధి చేస్తున్నామ ని వెల్లడించారు. రైట్ టు వాక్ అనేది కే టిఆర్ నినాదమని ఇందులో భాగంగా నే ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని వారు చెప్పారు. అతి తక్కువ సమయంలో ఆరు నెలల్లో నే నగర వ్యాప్తంగా ఎల్‌ఇడి లైట్లనుపె ట్టి విద్యుత్‌ను ఆదా చేశామని, అభివృ ద్ధి పనులు చేపట్టే సమయంలో నష్టపో యే లబ్ధ్దిదారులను అన్ని విధాలుగా అ దుకుంటామని వారు స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూంల పథకం వేగవంతం గా సాగుతుందని,అందరి కృషితో మన నగరానికి ఓడిఎఫ్++ వచ్చిందని మే యర్, కమిషనర్‌లు పేర్కొన్నారు. నగరంలో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని వారు చెప్పా రు. సిఎం, కేటిఆర్ సూచించిన మార్గం లో కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృ ష్టిసారించినట్టు తెలిపారు. నగర అభివృద్ధిలో భాగం గా వేల కోట్లుతో పథకాలను చేపట్టి అమలు పరుస్తున్నామని, జిహెచ్‌ఎం సి మరింత బలోపేతం చేసే విధంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. నగరం రియల్ ఎస్టేట్‌లో అన్ని నగరాలకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మరిన్న స్వీపింగ్ యంత్రాలను తీసుకుంటామ ని, పారిశుధ్య కార్మికుల్లో వయసుపైబడిన వారి స్థానంలో వారి రక్తసంబంధీకులను తీ సుకునే విషయమై ప్రభుత్వానికి విన్నవించినట్టు వారు తెలిపారు.
 50. సినీనటుడు శివాజీ ఆదివారం రోజు దుర్గాఘాట్‌లో జలదీక్ష చేయబోతున్నాడు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ శివాజీ జలదీక్షకు పూనుకున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మోదీ పర్యటన ముగిసేవరకు జలదీక్ష చేయాలని నటుడు నిర్ణయిచాడు. కాగా ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Agriculture

అన్నదాతలకు తీపి కబురు…

Published

on

జులై 11  2020,  VSB NEWS:

అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది.

ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్‌ ఆరో విడత నిధులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ.2,000 డబ్బులు రైతు ఖాతాలో జమకానున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు.

దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే పథకంలో చేరొచ్చు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 10 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది.

Continue Reading

ACCIDENT

రుద్రవరం పాఠశాలలో విషాదం

Published

on

ఆంధ్రప్రదేశ్,  కర్నూల్ జిల్లా,  జులై 11, 2020,  VSB NEWS: రుద్రవరం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. లెట్రిన్ గుంతలో పడి ఏడేళ్ల నాగ విష్ణు మృతి చెందాడు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు గుంతలు తవ్వి వదిలివేశారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ నాగ విష్ణు ప్రమాదవశాత్తు గుంతలో పడ్డాడు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాదంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Continue Reading

FAST NEWS

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ….

Published

on

ఆంధ్రప్రదేశ్,   అమరావతి,  జులై 10, 2020,  VSB NEWS:

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బదిలీకి సంబంధించి గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఎండీగా జి.శ్రీనివాసులు బదిలీ చేయగా.. ఏపీ షెడ్యూల్ కాస్ట్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఎం.రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం విదితమే.

Continue Reading

Trending

www.vsbnews.in