Connect with us

News

స్వీపరూ నాగమణి మృతి అనుమానాస్పదం…

Published

on

రత్నగిరి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గల ఓ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలో పనిచేస్తున్న రాయుడు నాగమణి 32 ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. గురువారం ఉదయం గోపాలపట్నం లో ఓ ఆటో డ్రైవర్ ఇంటివద్ద అతనితో తగాదా పడి విశ్వ పురుగుల మందు త్రాగడంతో ఆమెను ఆ పరిసర ప్రాంత వాసులు వెంటనే తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో తుని వైద్యులు కాకినాడ జిజిహెచ్ కు పంపించారు. చికిత్స పొందుతూ మరణించింది. సెల్ ఫోన్ లో ఆమె వేరే వ్యక్తితో మాట్లాడటమేఅసలు వివాదానికి కారణమై విషపు మందు తాగినట్లు ఆ పరిసర ప్రాంత వాసులు తెలిపారు. నాగమణి లోవరాజు అని వ్యక్తితో 15 సంవత్సరాల క్రితం వివాహమై ఒక పాప పుట్టిన తర్వాత సజావుగాకాపురం సాగుతున్న టైం లో అతను మృతి చెందడంతో ఆమె అన్నవరంలో ఓ పూల వ్యాపార తో చనువుగా ఉంటూ రత్న గిరి పై పేపర్ గా పనిచేస్తూ ఉండేది. గత రెండు నెలల క్రితం పూల వ్యాపారిని కాదని 2 నెలల నుండి గోపాల్ పట్నం నకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తో చనువు పెంచుఉన్నట్లు సమాచారం. సెల్ ఫోన్ లో తరచూ నాగమణి మాట్లాడుతుండటంను డ్రైవర్ అభ్యంతర పెట్టడమే కాకుండా గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల క్రితం నుండి వారి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె మృతి చెందింది. మృతి విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితే మృతి కారకులు,మృతికి ప్రేరేపించే వ్యక్తులు ఎవరో అన్నది నిర్ధారణ అవుతుంది. ఇది ఇలా ఉండగా మృతురాలు తమ్ముడు పిల్లి సన్యాసిరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాయుడు నాగమణి ఉబ్బసం వ్యాధి తట్టుకోలేక సోప్ ఆయిల్ తీసుకుందని ఫిర్యాదు చేసినట్లు అన్నవరం పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Annavaram Reporter : N.Bramaraju

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

 

ఉల్లి కొరతను నివారించి ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ. . వినియోగదారులకు మద్దతుగా పటమట రైతు బజార్లో. .
ఉల్లి అమ్మకాల పరిస్థితిని సమీక్షి స్తున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ , ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ ఇతర టీడీపీ నాయకులు

Continue Reading

News

సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌…

Published

on

 

హైదరాబాద్‌ , డిసెంబర్ 7 , VSB NEWS :

సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందం చటాన్‌పల్లిలో ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక అందించనుంది.

Continue Reading

News

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం…

Published

on

 

విజయవాడ , డిసెంబర్ 7 , VSB NEWS :

డాక్టర్ వై యస్ ఆర్ మెమోరియల్ పదవ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంరియన్ షిప్ ను ప్రారంభించిన సినీ హీరో సుమన్ , డిప్యూటి సియం పుష్పశ్రీ వాణి , మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ

అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం

ధైర్యమే మనిషికి చాలా శక్తినిస్తుంది

మార్షల్ ఆర్ట్స్ , కరాటే వటి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

కోన్ని సార్లు ఎవరు అండగా ఉండక పోవచ్చు అప్పుడు మన శరీరమే మనకు ఆయుధం కావాలి

ప్రభుత్వంతో మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ను ఇచ్చేలా చర్యలు తీసుకుంటాము

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి

2020లో కరాటే ఒలంపిక్స్ లోకి వెళ్ళడం సంతోషకరం

దిశ ఘటన తరువాత ఆడపిల్లలు రోడ్డుపైకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది

వెంటనే శిక్ష పడినట్లు జరగడం కూడా మంచి పరిణామం

ప్రతి ఆడపిల్లకు సెల్ప్ డిఫెన్స్ చాలా అవసరం

కరాటే అనేది ప్రతి మహిళల నేర్చుకోవాలి

ప్రభుత్వం నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిచే ప్రయత్నం చేస్తాము

Continue Reading

Trending

www.vsbnews.in