Connect with us

DEVOTIONAL

టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు.

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుపతి, మే 23 , VSB NEWS :

 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్ సేవల అఫీషియల్ వెబ్‌సైట్‌ పేరు మారుస్తూ టీటీడీ బోర్డు కీలక ప్రకటనను జారీ చేసింది. ఇప్పటివరకు స్వతంత్ర వెబ్‌సైట్‌గా ఉన్న దీన్ని ఇక నుంచి ప్రభుత్వంతో అనుసంధానం చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కళ్యాణ మండపాలు తదితర ఆన్లైన్ సేవలతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కూడా కొత్త సైట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటివరకు https:/ttdsevaonline.com ఉన్న వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వెబ్‌సైట్‌ ఇవాళ్టి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దైవ దర్శనాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. మే 31తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో అప్పుడైనా ఆలయాలు తెరుచుకుంటాయో లేదో అన్నది వేచి చూడాలి.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

జిల్లా లో శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్ముటకు ఏర్పాట్లు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విజయనగరం , మే 23 , VSB NEWS :

13 జిల్లా కేంద్రాలకు శ్రీవారి లడ్డూ ప్రసాదం

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని లారీల్లో ఏపీలోని జిల్లా కేంద్రాలకు చేరుస్తున్న టీటీడీ

విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు బయలుదేరిన లారీలు

25వ తేదీ నుండి సగం ధరకే లడ్డూలను భక్తులకు విక్రయించనున్న టీటీడీ

లాక్ డౌన్ అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే వరకు 50 లడ్డూను 25కే విక్రయించనున్న టీటీడీ

Continue Reading

DEVOTIONAL

శ్రీవారి దర్శనాల రద్దు

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుమల  , మే 18 , VSB NEWS :

 

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో తిరుమల శ్రీవారి దర్శనాల రద్దును కూడా ఈనెల 31వరకు టీటీడీ కొనసాగించనుంది.

దీనిపై ఒకటి, రెండ్రోజుల్లో అధికార ప్రకటన వెలువడనుంది.

దర్శనాలను కొనసాగిస్తే భక్తులు భౌతికదూరం పాటించేలా రెండ్రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్‌ చేయించిన విషయం తెలిసిందే.

Continue Reading

DEVOTIONAL

శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  తిరుమల , మే 17 , VSB NEWS :

శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

క్యూలైన్లలో భక్తులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ చేస్తున్న టీటీడీ

క్యూలైన్లలో భక్తుల మధ్య ఐదు అడుగుల దూరం పాటించేలా ఎరుపు రంగు స్టిక్కర్లతో సూచీలు ఏర్పాటు చేస్తున్న టీటీడీ

ఇప్పటికే లడ్డూ కౌంటర్ వద్ద పూర్తైన మార్కింగ్

ప్రభుత్వ నుండి ఆదేశాలు రాగానే భక్తులను దర్శనాలకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

Continue Reading

Trending

www.vsbnews.in