Connect with us

News

కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: సీఎం జగన్‌

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  తాడేపల్లి , మే 19 , VSB NEWS :

కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: సీఎం జగన్‌

నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం.

పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. ..

కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు…

క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారు.

మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం.

ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు.

ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది.

కోవిడ్‌ –19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

( స్టీల్‌ప్లాంట్‌ స్థలాన్ని సిద్ధం చేయండి )

ఎకానమీ పూర్తిగా ఓపెన్‌కావాలి. కలెక్టర్లు, ఎస్పీలు అందులో భాగస్వామ్యం కావాలి.

షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంది.
చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలి.

రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది.

ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి.

తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి.

ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్‌ కావాలి. మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది.

కోవిడ్‌ –19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలి.

ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు.

రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో?. ..

అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి..

ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..

ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలి.
వారు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలి. దీన్ని మనం ప్రోత్సహించాలి…

పరీక్షలకోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది.

ఎడ్యుకేట్‌చేయాలి?. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి.

అనుమానం ఉన్నవారు అక్కడకువెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి.

ప్రజలకు అందుబాటులో టెస్టింగ్‌ సదుపాయాలను తీసుకు వెళ్లాలి. ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలి.
కంటైన్‌ మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలి’’ అని తెలిపారు…

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

Continue Reading

News

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు. నెల రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు పూర్తీ చేసుకుని రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ఇళ్ళల్లోనే భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అభిలషించారు.

పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకూడదని సాటివారికి దానధర్మాలు చేసే ఉన్నత ఆశయంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయం.,

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

Continue Reading

News

అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం , మే 24 , VSB NEWS :

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఏకకాలంలో దాడులు

నాటుసారా, అక్రమ మద్యం పట్టివేత… భారీగా సారా ఊట ధ్వంసం

66 మంది అరెస్టు…11 వాహనాలు సీజ్

50 మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా పట్టివేత

14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం…
20 టన్నుల ఇసుక స్వాధీనం

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారధ్యంలో ఈరోజు కూడా దాడులు కొనసాగించారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏ.ఆర్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ లు జిల్లా వ్యాప్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు కొనసాగే వీలున్న గ్రామాలు, తండాలు, పరిసర అటవీ ప్రాంతాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు వీలున్న జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు రహదారులు, గ్రామాల్లో జిల్లా అంతటా ఏకకాలంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.

రెండు ట్రాక్టర్లు, 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 51మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహన్ రావు స్వయా కనగానపల్లి మండలం పరిధిలో ఈరోజు జరిగిన నాటు సారా స్థావరాల దాడుల్లో పాల్గొన్నారు

. వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు సీజ్ చేసి 20 టన్నుల ఇసుక పట్టుకుని ఆరుగుర్ని అరెస్టు చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in