Connect with us

News

స్వస్థలాలకు అంబులెన్స్ లో పంపిన జిల్లా అధికారులు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విజయనగరం , మే 19 , VSB NEWS :

కరోనా వ్యాధి నుండి కోలుకుని మిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నలుగురు బాధితులు

ఆసుపత్రి నుండి వారి స్వస్థలాలకు అంబులెన్స్ లో పంపిన జిల్లా అధికారులు

ఒక్కో బాధితుని కి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.2000 నగదు, పళ్లు, సానిటైజర్, మాస్క్ అందజేసిన శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా ఎం హరిజవహర్ లాల్ , ఎస్.పి. బి. రాజకుమారి

వీరికి చికిత్స అందించిన డా. సుబ్రహ్మణ్య హరికిషన్ నేతృత్వంలోని వైద్యులు, నర్సుల బృందాన్ని అభినందించిన అధికారులు, ఎమ్మెల్యే కోలగట్ల

జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఆరుగురిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు, మరో వ్యక్తి విశాఖలో రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి mims లో చికిత్స పొందుతున్నారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

Continue Reading

News

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు. నెల రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు పూర్తీ చేసుకుని రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ఇళ్ళల్లోనే భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అభిలషించారు.

పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకూడదని సాటివారికి దానధర్మాలు చేసే ఉన్నత ఆశయంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయం.,

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

Continue Reading

News

అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం , మే 24 , VSB NEWS :

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఏకకాలంలో దాడులు

నాటుసారా, అక్రమ మద్యం పట్టివేత… భారీగా సారా ఊట ధ్వంసం

66 మంది అరెస్టు…11 వాహనాలు సీజ్

50 మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా పట్టివేత

14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం…
20 టన్నుల ఇసుక స్వాధీనం

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారధ్యంలో ఈరోజు కూడా దాడులు కొనసాగించారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏ.ఆర్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ లు జిల్లా వ్యాప్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు కొనసాగే వీలున్న గ్రామాలు, తండాలు, పరిసర అటవీ ప్రాంతాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు వీలున్న జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు రహదారులు, గ్రామాల్లో జిల్లా అంతటా ఏకకాలంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.

రెండు ట్రాక్టర్లు, 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 51మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహన్ రావు స్వయా కనగానపల్లి మండలం పరిధిలో ఈరోజు జరిగిన నాటు సారా స్థావరాల దాడుల్లో పాల్గొన్నారు

. వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు సీజ్ చేసి 20 టన్నుల ఇసుక పట్టుకుని ఆరుగుర్ని అరెస్టు చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in