Connect with us

News

రేషన్ దుకాణాల్లో నాసిరకం సరుకుల పంపిణీ

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మే 18 , VSB NEWS

 

రేషన్ దుకాణాల్లో నాసిరకం సరకులను పంపిణీ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.

దీనిపై సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు

దేవినేని ఉమా ట్వీట్

75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 9 రకాల నిత్యావసరాలను ప్రజల ఇళ్లకు పంపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ దుకాణాల్లో నాసిరకం బియ్యం, శనగలు ఇస్తోందని తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు.

తినేలా లేని ఈ సరకులను ప్రజాప్రతినిధుల ఇళ్లలో వండించగలరా అంటూ నిలదీశారు.

నాసిరకం సరకులపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉన్నత న్యాయస్థానం తీర్పును లెక్కపెట్టకుండా వలస కార్మికులను మళ్లీ కొట్టారని ఆరోపించారు.

సొంతూళ్లకు పంపించమంటున్న వలస కూలీలపై ప్రతాపం చూపటంపై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

Continue Reading

News

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు. నెల రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు పూర్తీ చేసుకుని రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ఇళ్ళల్లోనే భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అభిలషించారు.

పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకూడదని సాటివారికి దానధర్మాలు చేసే ఉన్నత ఆశయంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయం.,

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

Continue Reading

News

అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం , మే 24 , VSB NEWS :

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఏకకాలంలో దాడులు

నాటుసారా, అక్రమ మద్యం పట్టివేత… భారీగా సారా ఊట ధ్వంసం

66 మంది అరెస్టు…11 వాహనాలు సీజ్

50 మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా పట్టివేత

14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం…
20 టన్నుల ఇసుక స్వాధీనం

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారధ్యంలో ఈరోజు కూడా దాడులు కొనసాగించారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏ.ఆర్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ లు జిల్లా వ్యాప్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు కొనసాగే వీలున్న గ్రామాలు, తండాలు, పరిసర అటవీ ప్రాంతాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు వీలున్న జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు రహదారులు, గ్రామాల్లో జిల్లా అంతటా ఏకకాలంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.

రెండు ట్రాక్టర్లు, 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 51మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహన్ రావు స్వయా కనగానపల్లి మండలం పరిధిలో ఈరోజు జరిగిన నాటు సారా స్థావరాల దాడుల్లో పాల్గొన్నారు

. వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు సీజ్ చేసి 20 టన్నుల ఇసుక పట్టుకుని ఆరుగుర్ని అరెస్టు చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in