Connect with us

News

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ మండలాలు

Published

on

 

విజయవాడ‌ , మే 17 , VSB NEWS :

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ మండలాలు

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది.

రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలుచేస్తామంటోంది.

కృష్ణా జిల్లా…… జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.

కర్నూలు జిల్లా. ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.

కడప జిల్లా.. మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.

నెల్లూరు జిల్లా. నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.

ప్రకాశం జిల్లా. కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.

అనంతపురం జిల్లా.. హిందూపూర్, కల్యాణదుర్గం, అనతపురం టౌన్

చిత్తూరు జిల్లా.. శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.

తూర్పుగోదావరి జిల్లా. సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.

గుంటూరు జిల్లా. మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.

విశాఖపట్నం జిల్లా. పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.

విజయనగరం జిల్లా. బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.

పశ్చిమ గోదావరి జిల్లా. పోలవరం, గోపాలపురం, టి, నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

Continue Reading

News

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు. నెల రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు పూర్తీ చేసుకుని రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ఇళ్ళల్లోనే భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అభిలషించారు.

పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకూడదని సాటివారికి దానధర్మాలు చేసే ఉన్నత ఆశయంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయం.,

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

Continue Reading

News

అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం , మే 24 , VSB NEWS :

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఏకకాలంలో దాడులు

నాటుసారా, అక్రమ మద్యం పట్టివేత… భారీగా సారా ఊట ధ్వంసం

66 మంది అరెస్టు…11 వాహనాలు సీజ్

50 మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా పట్టివేత

14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం…
20 టన్నుల ఇసుక స్వాధీనం

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారధ్యంలో ఈరోజు కూడా దాడులు కొనసాగించారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏ.ఆర్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ లు జిల్లా వ్యాప్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు కొనసాగే వీలున్న గ్రామాలు, తండాలు, పరిసర అటవీ ప్రాంతాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు వీలున్న జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు రహదారులు, గ్రామాల్లో జిల్లా అంతటా ఏకకాలంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.

రెండు ట్రాక్టర్లు, 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 51మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహన్ రావు స్వయా కనగానపల్లి మండలం పరిధిలో ఈరోజు జరిగిన నాటు సారా స్థావరాల దాడుల్లో పాల్గొన్నారు

. వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు సీజ్ చేసి 20 టన్నుల ఇసుక పట్టుకుని ఆరుగుర్ని అరెస్టు చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in