Connect with us

News

రాష్ట్రంలో అన్ని వర్గాలను నట్టేట ముంచారు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం జిల్లా , మే 17 , VSB NEWS :

రాష్ట్రంలో అన్ని వర్గాలను నట్టేట ముంచారు

దళిత వైద్యుడు సుధాకర్ పై దాడి హేయమైన చర్య

ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే మానసిక రోగిగా పరిగణిస్తారా

దళితుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది

నిరసన కార్యక్రమంలో కందికుంట

కదిరి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను వైకాపా ప్రభుత్వం నట్టేట ముంచినదని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు.

ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ పై దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చరిత్రలో ఏనాడు లేని విధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిందని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న ఈ సంవత్సరపు కాలం పాటు రాష్ట్రంలో ప్రజలకు మేధావులకు ఒకే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది ఈ రాష్ట్రానికి ఏమైనది కరోన వచ్చి మానవాళి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే,కరోన కంటే రాష్ట్రప్రభుత్వం చేష్టలు ముఖ్యమంత్రి చేష్టలు ఈ ప్రభుత్వం యొక్క చేష్టలు పైనే రాష్ట్రంలో ప్రజలు చర్చించుకునే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి.

కారణం ఏమిటి అంటే వీళ్లు చేస్తున్న అనాగరిక చర్యలు అప్రజాస్వామికంగా చర్యలు. గతంలో ఒక డాక్టర్ తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు.

ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత నిన్నటి రోజున దళిత డాక్టర్ అనే ఆలోచన కూడా లేకుండా, ఒకవేళ పోలీసులు తెలియకుండా చేశారంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది

ఎందుకంటే ఆయన్ను గతంలో ఆ వ్యక్తిని వార్తల్లో చూసే ఉంటారు ప్రత్యేకించి వైజాగ్ లో అయితే బాగా గుర్తు పట్టే వ్యక్తి.

ఉద్దేశపూర్వకంగా అనాగరికంగా దళితుడు,దళిత డాక్టర్ అనే ఆలోచన లేకుండా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.

డాక్టర్ ఏమైనా రోడ్డుపైకి వచ్చి ఎవరికైనా ఇబ్బందులు గురి చేసే విధంగా చేసి ఉంటే పోలీస్ లు గౌరవంగా స్టేషన్ కు తీసుకు వెళ్లి కూర్చోబెట్టాలి.

అంతేగాని నడిరోడ్డు పైన ఇష్టం వచ్చిన రీతిలో దళితుడు అనే కనికరం లేకుండా దాడి చేయడం అన్యాయమన్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ను కలిసినాడు అనే అపవాది వేసి అది నిజం చేయాలని దాని నుంచి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనతో ఆయన్ను చేతులు వెనక్కి నెట్టేసి ఈయన మానసిక రోగి ముద్ర వేయడం దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు

. డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూన్నామని డాక్టర్ సుధాకర్ కు న్యాయం జరగాలని దళితుల చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెంట ఉండి మద్దతు ఇస్తామన్నారు.

ఆయనకు న్యాయం జరిగే విధంగా ఆయన హక్కులను కాపాడే విధంగా పోరాటాలు చేస్తున్న దళితులకు నియోజకవర్గంలో కూడా పూర్తిగా సహకారం అందిస్తామన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో బి.సి ఎస్.టి మైనార్టీ అన్ని వర్గాలను వినియోగించుకున్న వైకాపా పార్టీ ప్రస్తుతం వారిని విస్మరించడం తగదన్నారు.

భవిష్యత్తులో ప్రజలే వైకాపా పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయిఅన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

Continue Reading

News

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ , మే 24 , VSB NEWS :

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు తెలిపిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాక్షలు. నెల రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు పూర్తీ చేసుకుని రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ఇళ్ళల్లోనే భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అభిలషించారు.

పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకూడదని సాటివారికి దానధర్మాలు చేసే ఉన్నత ఆశయంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయం.,

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్.
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

Continue Reading

News

అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అనంతపురం , మే 24 , VSB NEWS :

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణకు విస్తృత దాడులు

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఏకకాలంలో దాడులు

నాటుసారా, అక్రమ మద్యం పట్టివేత… భారీగా సారా ఊట ధ్వంసం

66 మంది అరెస్టు…11 వాహనాలు సీజ్

50 మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా పట్టివేత

14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం…
20 టన్నుల ఇసుక స్వాధీనం

అనంతపురం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం నియంత్రణను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో సారధ్యంలో ఈరోజు కూడా దాడులు కొనసాగించారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో బృందాలు, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ, ఏ.ఆర్ బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ లు జిల్లా వ్యాప్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటు సారా తయారీ స్థావరాలు, విక్రయాలు కొనసాగే వీలున్న గ్రామాలు, తండాలు, పరిసర అటవీ ప్రాంతాలు… అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు వీలున్న జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు రహదారులు, గ్రామాల్లో జిల్లా అంతటా ఏకకాలంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహనరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నాటు సారా తయారీదారులు, విక్రేతలు మరియు మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.

రెండు ట్రాక్టర్లు, 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 51మద్యం సీసాలు, 395 టెట్రా పాకెట్లు…445 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 14,730 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ జె.రామమోహన్ రావు స్వయా కనగానపల్లి మండలం పరిధిలో ఈరోజు జరిగిన నాటు సారా స్థావరాల దాడుల్లో పాల్గొన్నారు

. వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు సీజ్ చేసి 20 టన్నుల ఇసుక పట్టుకుని ఆరుగుర్ని అరెస్టు చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in