Connect with us

Weather

అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖపట్నం  , మే 6 , VSB NEWS :

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.
మరో నాలుగు రోజులపాటు అదే ప్రాంతంలో కొనసాగి తరువాత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా బిహార్‌ నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం కర్నూలు, తిరుపతి, అనంతపురంలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Weather

మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , VSB NEWS :

ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గురువారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గరిష్ఠంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.

ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం 47 నుంచి 47.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 75 మండలాల్లో వడగాలులు, 140 మండలాల్లో అధిక వేడి, 437 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది.

28 వరకు ఎండలు.. తర్వాత వానలు
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని, శుక్రవారం నుంచి రాయలసీమలోనూ ప్రభావం అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

ఈ నెల 28 వరకు వడగాలులు వీస్తాయని తెలిపారు. 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నాటికి కేరళను తాకి, కొన్నిరోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

Continue Reading

Weather

పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటిన ఆంఫన్‌ పెనుతుఫాన్‌

Published

on

ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం , మే 22 , VSB NEWS :

 

పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటిన ఆంఫన్‌ పెనుతుఫాన్‌ ప్రభావం.. కేరళకు నైరుతి రుతుపవనాల రాకపై ఉండబోదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముందుగా ప్రకటించినట్టు కేరళకు ఈ ఏడాది జూన్‌ 1న కాకుండా నాలుగైదు రోజుల ఆలస్యంగా  నైరుతి రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అరేబియా సముద్రంలో యాంటీ సైక్లోన్‌ కొనసాగుతున్నది. దీని వల్ల నైరుతి దిశ నుంచి గాలులు వీయడానికి కొంత ఆటంకం కలుగుతుంది.

ఇది పూర్తిగా బలహీనపడిన తర్వాతే అరేబియా సముద్రం మీదుగా నైరుతి గాలుల రాకకు వాతావరణం అనుకూలిస్తుందని నిపుణులు అంచనా వేశారు

Continue Reading

Weather

ఒడిశా తీరం వెంబడి తీవ్రమైన గాలులతో, భారీ వర్షాలు

Published

on

ఒడిశా , మే 18 , VSB NEWS

 

అంపన్ తుపాను సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్​గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్​డీ) హెచ్చరించింది.

మే 20 మధ్యాహ్నం లేదా సాయంత్రానికి బంగాల్​లోని దిఘా, బంగ్లాదేశ్​లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.

ఒడిశా పారదీప్​కు దక్షిణాన 790 కి.మీ, బంగాల్​లోని దిఘాకు నైరుతి దిశగా 940 కి.మీ, బంగ్లాదేశ్​ ఖేపుపారాకు 1060 కి.మీ దూరంలో అంపన్ కేంద్రీకృతమై ఉందని ఐఎమ్​డీ పేర్కొంది.

ప్రస్తుతం ఇది బంగాల్ తీరం వెంబడి దక్షిణ-నైరుతి దిశగా 13 కి.మీ వేగంతో పయనిస్తోందని తెలిపింది.

తుపాన్​ ధాటికి బంగాల్​, ఒడిశా తీరం వెంబడి తీవ్రమైన గాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఒడిశా ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించింది.

జాతీయ విపత్తు నిర్వహణ కమిటి (ఎన్​సీఎమ్​సీ) తుపాను ధాటికి దెబ్బతినే అవకాశమున్న ఒడిశా, బంగాల్​కు తక్షణ సాయం అందించడానికి సంసిద్ధమైంది.

Continue Reading

Trending

www.vsbnews.in