Connect with us

Business

ఎయిరిండియా శుభవార్త

Published

on

, ఏప్రిల్ 19, VSB NEWS :

లాక్‌డౌన్‌తో అనూహ్య స్థితిలో ఒక్కసారిగా విమానాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. విమానాల రాకపోకలతో కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తుందనే కారణంతో వాటిని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తున్నట్టు ఎయిరిండియా సంస్థ వెల్లడించింది. దేశీయ విమానాల టికెట్ బుకింగ్ ప్రక్రియను మే 4 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.  మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని.. జూన్‌ 1 నుంచి అంతర్జాతీయ బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగుస్తున్నందున ఎయిర్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి ఎయిరిండియా తమ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు పొందు పరిచింది. ‘ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ప్రతి అప్‌డేట్‌ను అందిస్తుంటాం’ అని తెలిపింది. ప్రస్తుతం ఎయిరిండియా సంస్థ దేశవ్యాప్తంగా అలాగే చైనా వంటి అంతర్జాతీయ మార్గాలకు వైద్య సామాగ్రి తరలింపు కోసం విమానాలను నడుపుతోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్‌ ఉడాన్’ విమానాలు నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ రోజు(శనివారం) ఉదయం ఎయిర్ ఇండియా బి –787 విమానం ఢిల్లీ నుంచి వైద్య సామాగ్రిని తీసుకుని చైనాకు వెళ్లినట్లు ఏఎన్‌ఐ చెప్పింది

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

Published

on

, మే 1 , VSB NEWS :

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కంటే తక్కువున్న వారికి కోతలు ఉండవని, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత విధించింది. కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని పూర్తిగా వదులుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది

Continue Reading

Business

అమెజాన్ కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు

Published

on

 

ముంబై , ఏప్రిల్ 29, VSB NEWS :

కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారతదేశంలో ‘అమెజాన్ పే లేటర్’ క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తోంది.

అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. డబ్బులు లేకపోయినా ‘అమెజాన్ పే లేటర్’ ద్వారా వస్తువులు కొని గడువు లోగా వడ్డీ లేకుండా చెల్లించొచ్చు. లేదా 12 నెలల వరకు ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డబ్బులు లేకపోయినా అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించొచ్చు. నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు.

అమెజాన్ పే లేటర్ సర్వీస్ కోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్.

మీరు కూడా అమెజాన్ పే లేటర్ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే అమెజాన్ ఇండియా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ పే లేటర్ సర్వీస్ కేవలం యాప్‌లోనే ఉంది. డెస్క్‌టాప్‌లో పనిచేయట్లేదు.

మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్, ఇతర వివరాలతో కేవైసీ పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అమెజాన్ పే లేటర్ సర్వీస్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.60,000 వరకు అప్పు ఇవ్వాలని నిర్ణయించింది అమెజాన్. ఈ లిమిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటుంది.

Continue Reading

Business

‘హోండా ఫ్రం హోం’

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 28, VSB NEWS :

కరోనా కట్టడికి ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్ కొనసాగుతోంది.

ఈ కారణంగా ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

అయితే లాక్​డౌన్ ఉన్నా విక్రయాలు జరిపేందుకు ఆన్​లైన్​ వేదికను ఎంచుకుంటున్నాయి పలు సంస్థలు.

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్​ బెంజ్, హోండా వంటి సంస్థలు ఆన్​లైన్​లో అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇంటి నుంచి బయటకు రాకుండా.. సురక్షితంగా ఇంట్లో నుంచే నచ్చిన మోడల్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతున్నాయి ఈ సంస్థలు.

ఆన్​లైన్​లో ‘హోండా ఫ్రం హోం’ పేరుతో కార్ల విక్రయాలు ప్రారంభించినట్లు హోండా ఇండియా తెలిపింది.

వినియోగదారులు సులభంగా నచ్చిన కారును, తమకు అనువైన డీలర్​షిప్​ నుంచి కోనుగోలు చేసే విధంగా ప్లాట్​ఫాంను రూపొందించినట్లు పేర్కొంది.

ఆన్​లైన్​లో కారు కొనుగోలు చేసిన తర్వాత సురక్షితంగా వినియోగదారుడికి డెలివరీ అయ్యే వరకు సేల్స్​ కన్సల్టెంట్​లు వీడియో సంభాషణలో అందుబాటులో ఉంటారని ఫోక్స్ వ్యాగన్ ఇండియా తెలిపింది.

దేశవ్యాప్తంగా 137 సేల్స్, 116 సర్వీస్ టచ్​పాయింట్లను ఇంటిగ్రేట్ చేసినట్లు తెలిపింది.

ఇందులో వినియోగదారులకు అనుకూలమైన డీలర్​షిప్ ద్వారా ఆన్​లైన్​లో నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చని పేర్కొంది ఫోక్స్ వ్యాగన్​.

ఆన్​లైన్ ద్వారానే కొత్త కార్లు, సెకండ్​ హ్యాండ్​ వాహనాలను ఆన్​లైన్​లో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.

మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా ‘మెర్స్ ఫ్రం హోం’ పేరుతో ఆన్​లైన్​ విక్రయాలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Continue Reading

Trending

www.vsbnews.in