Connect with us

Hi, what are you looking for?

News

మైనారిటీలు అంటే ఎందుకంత చులకన..?

– వారి అభివృద్ధి మీకు ఇష్టం లేదా… ?
– తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు కోసం చిత్తశుద్ధితో పని చేసింది
– మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మైనారిటీ నాయకులు డిమాండ్
రాజమహేంద్రవరం సిటీ :
మైనారిటీలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని, వారికి ఇచ్చిన ఏ ఒక్క హమీని నెరవేర్చడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. మైనారిటీల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను ఆచరణలోకి తీసుకురాకుండా తాత్సారం చేస్తోందని, అలాగే కొన్నింటికి టెండర్లు పిలిచి మధ్యలోనే నిలిపివేశారని వివరించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రెహ్మత్ నగర్ మసీదులో ముస్లిం నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడం కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి మీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకూ బీసీ నాయకులపై లేనిపోని కేసులు వేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. తరువాత దేవాలయాలు, విగ్రహాలపై దాడులు చేశారని విమర్శించారు. ప్రస్తుతం మైనారిటీల పై దాడలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలి సాక్షిగా మండలి ఛైర్మన్ షరీఫ్ పై మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కులంతో దూషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం ఇలా వరుస సంఘటనలతో మైనారిటీలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి మైనారిటీలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. ఇటీవల కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాం, అతని కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి సెల్ఫీ వీడియో తీసి వేధింపులు భరించలేకపోతున్నామని చెప్పడం చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. అటు తరువాత అదే కర్నూలులో ఒక ముస్లిం కాంట్రాక్టర్‌కు టెండర్ వస్తే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అతన్ని బెదిరించారని ఆరోపించారు. మిమ్మల్ని నమ్మి కర్నూలులో పది మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకా మైనారిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం ముఖ్యమంత్రి అసమర్ధతత వల్లే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన తోఫాలను నిలిపివేశారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మైనారిటీ కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు పెళ్లి కానుకగా ఇచ్చిన 50 వేలను కట్ చేశారని వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారు ఇస్తామన్న లక్ష రూపాయల కానుక కేవలం ప్రకటనగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఇమామ్ లకు ఇస్తామన్న గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించి కొన్ని మసీదులు, షాదీ ఖానాల అభివృద్ధికి మైనారిటీ వెల్ఫేర్ శాఖ నుంచి నిధులు మంజూరు కాగా వాటిని నిలిపివేశారని విమర్శించారు. వీటికి సంబంధించి జీవోలు తీసుకురావడంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాలా కృషి చేశారని వివరించారు. రౌతు తాతాలు కల్యాణ మండపం వద్ద ముస్లింల బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి నిధులు మంజూరై చేపట్టిన పనులు మధ్యలోనే నిలిపివేశారని దుయ్యబట్టారు. రెహ్మత్ నగర్ షాళీ ఖానాకు 63 లక్షలు మైనార్టీ వెల్ఫేర్ నిధులు, 25 లక్షలు ఆనాటి ఎంపీ మాగంటి మురళీమోహన్ నిధులు విడుదల చేసి మున్సిపల్ కమిషనర్ వారి ఖాతాకు జమ చేయగా, దాని నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందని, అయితే దాని నిర్మాణ పనులు ముందుకు సాగకుండా ఆపేశారని తెలిపారు. షరీఫ్ తో శంకుస్థాపన చేయించామన్నారు. ఆవ రోడ్డులోని మున్సిపాలిటీ రెండు ఎకరాలు కేటాయించి, 4 కోట్ల నిధులతో మోడరన్ స్లాటర్ హౌస్ ( ఆధునిక కబేలా ) నిర్మించారని , త్వరలోనే అది ప్రారంభం కానుందని, దీనికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు కాగా ఇప్పటికి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. 200 మంది ముస్లిం మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కుట్టు శిక్షణలో శిక్షణ ఇవ్వగా వారందరికీ కుట్టు మిషన్లు మంజూరు చేయగా ఆ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ కార్యక్రమం నిలిచిపోయిందన్నారు. అయితే తరువాతి కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తరపున ప్రజా ప్రతినిధులు ఆ 200 మందికి తామే మిషన్లు మంజూరు చేయించి పంపిణీ చేసినట్టు ఆర్భాటం చేశారని, ఆ మిషన్లపై నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటో ఉంటే దానిపై జగన్ ఫొటో అటించారని ఆరోపించారు. 2017 లో లాలా చెరువులోని మసీదులో మౌజాన్ హత్య జరిగితే ఆ కేసును అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, మౌజాన్ కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా మౌజాన్ మృత దేహాన్ని వారి స్వగ్రామం చేర్చిందని వివరించారు. ప్రభుత్వాలు మారితే మంజూరైన పనులు మధ్యలోనే ఆపేస్తారా అంటూ ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. 25 శాతం పనులు ప్రారంభించనవి ఏమైనా ఉంటే మధ్యలోనే ఆపేయపని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం హేయమైన చర్యన్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని రెహ్మత్ నగర్ మసీదు కమిటీ సభ్యులు షాదీ ఖానా పనులు ప్రారంభించాలని జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకరరావును కలిసి వినతి పత్రం అందచేశారని వివరించారు. ఆయన స్పెషల్ కమిషనర్ కు కూడా వివరించారని తెలిపారు. మంజూరై నిలిపివేసిన పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ నాయకులు షేక్ సుభాన్, చాన్ భాషా, మహబూబ్ జానీ, సయ్యద్ అప్సరీ, అజీజ్, నాసిర్, మసీదు కమిటీ అధ్యక్షులు నజీరుద్దిన్, సయ్యద్ అఫ్సర్, షాహీద్, సయ్యద్ ఫయ్యాజ్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, మస్తాన్ చౌదరి, కర్రి రమణమ్మ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...

Devotional

ఏడవ అధ్యాయం ‘ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం...

Politics

– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....