Connect with us

DEVOTIONAL

ఈ రోజు పంచాంగం…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 04 , VSB NEWS :

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేదీ … 04 – 04 – 2020,
వారం … స్థిరవాసరే 【 శనివారం 】
శ్రీ శార్వరి నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : ఏకాదశి సా5.55
తదుపరి ద్వాదశి,
నక్షత్రం : ఆశ్లేష మ12.50
తదుపరి మఖ,
యోగం : ధృతి ఉ6.12
తదుపరి శూలం తె3.34,
కరణం : వణిజ ఉ6.47
తదుపరి భద్ర/విష్ఠి సా5.55
ఆ తదుపరి బవ తె4.55,

వర్జ్యం : రా12.13 – 1.44,
దుర్ముహూర్తం : ఉ5.57 – 7.34,
అమృతకాలం : ఉ11.17 – 12.50,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం. : మ1.30 – 3.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.58,
సూర్యాస్తమయం : 6.09,

DEVOTIONAL

లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రం

Published

on

కర్ణాటక , మే 27 , VSB NEWS :

 

 

లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రం

లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తోంది. కర్ణాటకలో జూన్‌ 1వ తేదీ నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. నిర్థిష్ట మార్గదర్శకాలను అనుసరించి ఆలయాల్లోకి భక్తులకు అనుమతిస్తారు. కోవిడ్‌-19 కారణంగా దేవాలయాల్లోకి భక్తులను రెండు నెలలకు పైగా అనుమతించని విషయం తెలిసిందే. ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు

Continue Reading

DEVOTIONAL

రేపు తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుపతి , మే 27 , VSB NEWS :

 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం రేపు జరుగనుంది.

లాక్‌డౌన్ ఉన్నప్పటికీ టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క సారి సమావేశం నిర్వహించాల్సి ఉండడంతో పాలకమండలి రేపు సమావేశంకానుంది.

టీటీడీ పాలకమండలి చరిత్రలో మొదటి సారిగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహిస్తోంది.

తిరుమల నుంచి సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి హాజరుకానుండగా… మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హాజరవుతారు.

Continue Reading

DEVOTIONAL

టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు.

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుపతి, మే 23 , VSB NEWS :

 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్ సేవల అఫీషియల్ వెబ్‌సైట్‌ పేరు మారుస్తూ టీటీడీ బోర్డు కీలక ప్రకటనను జారీ చేసింది. ఇప్పటివరకు స్వతంత్ర వెబ్‌సైట్‌గా ఉన్న దీన్ని ఇక నుంచి ప్రభుత్వంతో అనుసంధానం చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కళ్యాణ మండపాలు తదితర ఆన్లైన్ సేవలతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కూడా కొత్త సైట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటివరకు https:/ttdsevaonline.com ఉన్న వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వెబ్‌సైట్‌ ఇవాళ్టి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దైవ దర్శనాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. మే 31తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో అప్పుడైనా ఆలయాలు తెరుచుకుంటాయో లేదో అన్నది వేచి చూడాలి.

Continue Reading

Trending

www.vsbnews.in