Connect with us

News

సైన్యం కూడా రంగంలోకి దిగాలంటూ పిలుపునిచ్చారు

Published

on

 

న్యూఢిల్లీ , మార్చి 25, VSB NEWS :
:

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై యుద్ధంలో సైన్యం కూడా రంగంలోకి దిగాలంటూ భద్రతా దళాల అధిపతి (సీడీఎస్) పిలుపునిచ్చారు.

ఈ విపత్కర సమయంలో క్వారంటైన్ మౌలిక సదుపాయాలు సమకూర్చడం మొదలు స్పెషలిస్ట్ కేర్ అందించడం వరకు అన్ని రకాలుగా భద్రతా దళాలు తమవంతు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

నోవెల్ కరోనా వైరస్‌‌పై పోరాడే క్రమంలో అవసరమైతే తమ ఆదేశాలకు మించి పనిచేయాల్సి ఉంటుందని… ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని సీడీఎస్ అన్నారు.

కాగా ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంస్థల సూచనలను పాటించినప్పుడే కోవిడ్-19ను జయించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం అవుతుందని సీడీఎస్ స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలన్నీ పాటించాలంటూ అన్ని ర్యాంకుల అధికారులు, వారి కుటుంబ సభ్యులకు భద్రతా దళాలు ఆదేశాలు జారీ చేశాయన్నారు.

కాగా విదేశాల నుంచి భారత్ తీసుకొచ్చి వారిని క్వారంటైన్ చేసేందుకు త్రివిధ దళాల సహకారం తీసుకోవడంపై నిన్న కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీడీఎస్ కూడా హాజరయ్యారు.

ఇటలీ, ఇరాన్, చైనా సహా ఆగ్నేయ దేశాల నుంచి తీసుకొచ్చిన సుమారు 1500 మందిని గురుగ్రామ్, జైసల్మేర్, ముంబై, హిండాన్‌ తదితర ప్రాంతాల్లో భద్రతా దళాలు క్వారంటైన్ చేశాయి.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

యువ నాయకుని జన్మదిన సందర్భంగా వృద్దాశ్రమం లో భోజన వితరణ

Published

on

By

జక్కంపూడి గణేష్ బాబు జన్మదినం సందర్భంగా గౌతమీ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో యువజన విభాగం ప్రెసిడెంట్ మరుకుర్తి నరేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి కొల్లి కృష్ణ దీప్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరుకుర్తి దుర్గా యాదవ్ , కొప్పి నీడి ప్రసాద్ (రాజమౌళి), రాజేష్, జోసెఫ్, కోటి, శివ కిరణ్, మహేష్ పాల్గొన్నారు..

Continue Reading

News

ఇంటి ఇంటికి పంపిణీ…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కరోనా సహాయం ₹1000లను గ్రామ వాలంటీరిలా సహాయంతో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వైస్సార్ సీపీ నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వలేంటరీ లు పాల్గొన్నారు…

Continue Reading

News

ప్రజల సౌకర్యార్థం మొబైల్ ఎటిఎమ్…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, యూ.కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

నాగులాపల్లి గ్రామంలో ప్రజలు సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పిఠాపురం బ్రాంచ్, నాగులాపల్లి సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఎటిఎమ్ ఏర్పర్చటం జరిగింది… ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇలా ఏర్పర్చటం ప్రజలకు చాలా ఉపయోగరంగా ఉంది అని కొనియాడారు..ఈ కార్యక్రమంలో నాగులాపల్లి సొసైటీ అధ్యక్షులు అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు…

Continue Reading

Trending

www.vsbnews.in