Connect with us

INTERNATIONAL

స్పెయిన్ లో విజృంభిస్తున్న కోవిడ్-19 వైరస్.

Published

on

 

స్పెయిన్ , మార్చి 25, VSB NEWS :
:

స్పెయిన్ లో విజృంభిస్తున్న
కోవిడ్-19 వైరస్.

మరణాల సంఖ్యలో చైనా ను మించిన స్పెయిన్.

ఇప్పటి వరకు కొరోన వైరస్ సోకి స్పెయిన్ లో 3,434 మంది మృతి.

ఇవాళ ఒక్కరోజే 443 మరణాలు.

తాజాగా 5,552 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INTERNATIONAL

రెండోసారి కరోనా పరీక్షలు

Published

on

 

అమెరికా , ఏప్రిల్ 03, VSB NEWS :

ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు.. ఈసారి ఇన్వాసిస్ పద్ధతిలో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్టు కోసం పది గంటలు వేచి చూశారు. దీంతో ఈసారి ఇన్వాసిస్ పద్ధతిలో చేయించుకుని పావుగంటలోనే రిపోర్టు అందుకున్నారు.

Continue Reading

INTERNATIONAL

తబ్లిగీ జమాత్ కలవరం!

Published

on

 

పాకిస్థాన్‌ , ఏప్రిల్ 03, VSB NEWS :

పాకిస్థాన్‌లోనూ తబ్లిగీ జమాత్ కలవరం!

మన దేశంలో కరోనా విజృంభణను కేంద్ర స్థావరంగా మారిన తబ్లిగీ జమాత్ సంస్థ వల్ల పాకిస్థాన్‌లో కూడా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ సంస్థకు చెందిన 40 మత బోధకులకు కరోనా పాజిటివ్ తేలడం కలకలం సృష్టించింది. దాంతో పాకిస్థాన్‌లో తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఉన్న రైవిండ్ నగరంలో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించింది. మెడికల్ స్టోర్లు సహా అన్ని దుకాణాలను మూసి వేయడంతో పాటు ప్రజలెవరూ బయటికి రాకుండా ఆంక్షలు విధించింది.

జమాత్‌కు చెందిన మరో 50 మందిలో కూడా వైరస్ అన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో ఐదుగురు నైజీరియా మహిళలు కూడా ఉన్నారు. వారందరినీ లాహోర్ కు 50 కి.మీ. దూరంలో ఉన్న కసూర్ లోని క్వారంటైన్ సెంటర్లో చేర్చారు. అలాగే, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ సిటీలో తబ్లిగీ జమాత్‌ కు చెందిన 38 మందికి లోకల్ ట్రాన్ మిషన్ ద్వారా కరోనా సోకినట్టు గుర్తించారు.

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పలువురు జమాత్ మతబోధకులను సింధ్, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలెవరూ గుమికూడదని హెచ్చరించినప్పటికీ గత నెలలో తబ్లిగీ జమాత్ రైవిండ్‌లో తమ వార్షిక సదస్సు నిర్వహించింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రైవిండ్‌లోని మర్కాజ్‌లో ప్రస్తుతం 600 మంది మతబోధకులు ఉన్నారు. కాగా, పాకిస్థాన్‌లో గురువారం వరకు 2250 మందికి వైరస్‌ సోకింది. 32 మంది మరణించారు.

Continue Reading

INTERNATIONAL

కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కోబోతున్నాం’

Published

on

ఐరాస, ఏప్రిల్ 01, VSB NEWS

కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కోబోతున్నాం’

కరోనా ప్రభావంపై ఐక్యరాజ్య సమతి

రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్‌తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.

రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండి ఉండమని అంచనా వేశారు.

ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19, ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని చెప్పుకొచ్చారు.

‘సామాజికార్థిక పరిస్థితులపై కొవిడ్‌-19 ప్రభావం’పై నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్‌-19పై పోరును ప్రపంచ దేశాలు మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని గుటెరస్‌ అభిప్రాయపడ్డారు.

రాజకీయ పంతాలకు పక్కనబెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వస్తేనే ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని గుర్తుచేశారు.

ఐరాస 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదిక అభిప్రాయపడింది.

ఇది కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తుందని పేర్కొంది
కొవిడ్‌-19ని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని గుటెరస్‌ స్పష్టంచేశారు.

ఎవరికి వారు సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల్ని ఖాతరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.*

ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు సమూకూర్చుకోలేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు

Continue Reading

Trending

www.vsbnews.in