Connect with us

Education

ఉత్తర్వులు జారీ…

Published

on

అమరావతి

రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య పై ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు

ఒకటి నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు

ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయం

తెలుగు మీడియం చడవాలనుకునే పిల్లల కోసం తెలుగు మీడియం స్కూళ్లు మండలానికి ఒకటి ఏర్పాటు

ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం పాఠశాలలు యథాతథంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు

ప్రతి మీడియం స్కూల్ లోను తెలుగును కంపల్సరీ సబ్జెక్ట్ చెయ్యాలని ఆదేశాలు

స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

కరెంట్ అఫైర్స్…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, ఏప్రిల్ 02, VSB NEWS

కరెంట్ అఫైర్స్ మార్చి 2020

1.కరోనా వల్ల దా పరుస్తున్న సామాజిక ఆర్థిక నష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేసేందుకు ఎన్ని లక్షల కోట్ల డాలర్ల నిధుల ప్రవాహంతో ప్రపంచ ఆర్థిక నికి కొత్త సతుని కల్పిస్తామని జి-20 దేశాల్లో ఇటీవల ?ఐదు

2.ఏ సెక్షను ప్రజల స్వేచ్ఛను హరించే జాతీయ శిక్షాస్మృతిలోని రాజకీయ సెక్షన్లకు రారాజు వంటిది అని తన మీద రాజద్రోహం కేసు నమోదు విచారించినపుడు న్యాయస్థానంలో మహాత్మా గాంధీ వ్యాఖ్యానించాడు?సెక్షన్ 124 ఎ

3.ఉద్దేశపూర్వకంగా సమాజంలో అశాంతిని రేపడానికి ప్రయత్నించడం హింసకు పాల్పడటం ద్వారా ప్రభుత్వానికూలదోయాల అనుకోవడం లాంటి సందర్భాల్లోనే రాజద్రోహం నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు 1962 లో ఎవరి కేసులో తీర్పునిచ్చింది?కేదార్ నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం

4.ప్రజల ప్రాథమిక హక్కు అయినా భావప్రకటన స్వేచ్ఛ గురించి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తుంది? 19వ అధికరణం

5.ఈరోజు నువ్వేం చేస్తున్నావ్ అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని నినదించిన వారిని ప్రముఖులలో ఎవరు? మహాత్మా గాంధీ

6.దేశంలోనే అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? సంజీవ్ సింగ్

7.ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరంలో ఉన్న రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీమ్డ్ విశ్వవిద్యాలయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మార్చి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది? తిరుపతి .అజారుద్దీన్ జి కే గ్రూప్స్

8.కృష్ణా జిల్లాకు చెందిన దుగ్గిరాల పూర్ణయ్య అనే ప్రముఖ వ్యక్తి ఇటీవల మరణించారు అయితే ఆయన దశాబ్దాలపాటు ఈ అంశంలో తెలుగువారిని అలరించారు ?ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతగా

9.ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల కాలానికి ఎన్ని కోట్లు పెట్టుబడి వ్యయం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ?రూ.14,725.90కోట్లు

10.స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణంగా బాగా చేస్తున్నాని,అద్భుతంగా చేస్తున్నది ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ నివేదికను విడుదల చేసింది .అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరం ఈ అంశంలో మొదటి ర్యాంకు దక్కించుకున్నది? తిరుపతి

Continue Reading

Education

చరిత్రలో ఈ రోజు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయవాడ , ఏప్రిల్ 02, VSB NEWS :

సంఘటనలు

1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు.

2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

జననాలు

1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)

1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)

1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)

1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.

1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు

1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్

మరణాలు

1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)

1933: మహారాజా రంజిత్‌ సింహ్‌జీ ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)

జాతీయ దినాలు/అంతర్జాతీయ దినోత్సవాలు🇮🇳

పోలీస్ పతాక దినం.

అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.

ప్రపంచ ఆటిజం అవగాహన డే.

Continue Reading

Education

పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి, ఏప్రిల్ 01, VSB NEWS

రాష్ట్రంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ దరఖాస్తు సమయాన్ని ఏప్రిల్‌ 17వరకు పొడిగించింది. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 24 వరకు పొడిగించింది. దరఖాస్తుల తప్పుల సవరణ, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తదితర వివరాలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది.

Continue Reading

Trending

www.vsbnews.in