Connect with us

CRIME

ఎన్కౌంటర్ లో 17మంది జవాన్ల మృతి..!

Published

on

మృతదేహాలు లభ్యం అయినట్టు తెలిపిన బస్తర్​ రేంజ్​ ఐజీ

బుల్లెట్​ప్రూఫ్​ జాకెట్ల సాయంతో ఆకస్మిక దాడి చేసిన మావోలు..!

అర్ధరాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పులు

👉 ఛత్తీస్​గఢ్​ సుక్మా అడవుల్లో జిల్లా రిజర్వ్ గార్డులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన 17 మంది జవాన్ల మృతదేహాలు లభించాయి.

👉 బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​ రాజ్​ ఈ విషయం వెల్లడించారు. భౌతిక కాయాలను అడవి నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఆకస్మిక దాడి..
👉 సుక్మాలోని చింతాగుహ వద్ద ఉన్న మీన్పా అడవుల్లో నక్సల్​ కమాండర్ హీడ్మా, వినోద్​, దేవా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు చత్తీస్​గఢ్​ పోలీసులు సమాచారం అందుకున్నారు.

👉 వెంటనే ఆ ప్రాంతంలో 250 నుంచి 300 డీఆర్‌జీ(జిల్లా రిజర్వ్ గార్డులు), ఎస్‌టీఎఫ్(స్పెషల్​ టాస్క్​ఫోర్స్​) జవాన్లను మోహరించారు.

👉 శనివారం మధ్యాహ్నం ఆపరేషన్​ ముగించుకుని తిరిగి క్యాంపులకు బయల్దేరిన జవాన్లపై నక్సలైట్లు
ఆకస్మిక కాల్పులకు తెగబడ్డారు.

👉 శనివారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు మొదలై.. రాత్రి 9 గంటలవరకు ఎదురుకాల్పులు కొనసాగాయి.

👉 ఈ కాల్పుల్లో 14 మంది గాయపడగా… వీరిని హెలికాప్టర్లలో రాయ్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

👉 అయితే, ఘటన జరిగి 24 గంటలు దాటినా.. 17 మంది ఆచూకీ తెలియలేదు.

👉 చివరకు డ్రోన్ల సాయంతో వారి మృతదేహాలు గుర్తించారు.

బుల్లెట్​ప్రూఫ్​ జాకెట్లలో మావోలు…
👉 కాల్పుల సమయంలో నక్సలైట్లు పగడ్బందీగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. బులెట్​ప్రూఫ్​ జాకెట్లు, హెల్మెట్లు ధరించి దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.

👉 వారికి దీటుగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇందులో నలుగురు నక్సల్స్ మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.

మురళీధర్
పోలీస్ నిఘా స్టాఫర్

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRIME

రాజమండ్రి లో కలకలం..

Published

on

రాజమండ్రి :

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానస్పదంగా మృతి చెందారు. సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృతదేహాలు ఉండటంతో కలకలం రేగింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.

Continue Reading

CRIME

చెక్ పెట్టిన పోలీసులు…

Published

on

కృష్ణాజిల్లా

పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్:

నిన్న రాత్రి తనిఖీలలో భాగంగా తెలంగాణ,ఆంధ్ర బోర్డర్ గుమ్మడిదుర్రు చెక్ పోస్ట్ వద్ద

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న

ఖమ్మం జిల్లాకు చెందిన తిరుమల పాలెం కు చెందిన సంజయ్ S/O బాలయ్య

అనే వ్యక్తి వద్ద నుండి 10(సుమారు 27,00 రూపాయలు విలువగల) మద్యం బాటిళ్లను

పట్టుకుని సీజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది,

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న స్థానిక ఎస్ఐ G.రామకృష్ణ.

Continue Reading

CRIME

ఎసిబి కి పట్టుబడిన  అధికారి

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , కడప, మార్చి 13, VSB NEWS :

: లంచం తీసుకుంటూ.. రాయచోటి వెస్ట్‌ జోన్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆర్‌.జయప్రకాష్‌ నాయక్‌ ఎసిబి కి పట్టుబడ్డాడు

. రాయచోటి పట్టణంలో ఖంరూద్‌ జమాల్‌ భాషా వాటర్‌ ప్లాంట్‌ విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటుకుగాను రూ.15 వేలను ఇవ్వాల్సిందిగా, రాయచోటి వెస్ట్‌ జోన్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆర్‌.జయప్రకాష్‌ నాయక్‌ డిమాండ్‌ చేశాడు.

అధికారి వేధింపులు తాళలేక ఎసిబి అధికారులను బాధితుడు ఆశ్రయించాడు.

దీంతో రెడ్‌హ్యాండెడ్‌గా జయప్రకాష్‌ నాయక్‌ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

ఈ దాడుల్లో డిఎస్పీ జనార్థన్‌ నాయుడు, సిఐ శ్రీనివాసులు రెడ్డి, రెడ్డెప్ప, ఎస్‌ఐ నౌషాద్‌ బాష, సిబ్బంది పాల్గన్నారు

Continue Reading

Trending

www.vsbnews.in