Connect with us

DEVOTIONAL

భక్తులు లేకపోయినా యధావిధిగా ఉగాది పూజలు…

Published

on

కర్నూల్ :

శ్రీశైలం ఆలయంలో నిశ్శబ్ద వాతావరణం నిలిచిన భక్తుల సంచారం జనత కర్ఫ్యూ పాటిస్తున్న స్థానికులు ఎక్కడ బస్సులు అక్కడ నిలిచిపోయిన ఆర్ టీ సి

శ్రీశైలం ఆలయం పరిధిలోని ప్రధాన పురవీధులు రహదారులు ఖాళీ

నేటి నుంచి ఉగాది మహోత్సవాలు మొదటిసారి భక్తులు లేకపోయినా యధావిధిగా ఉగాది పూజలు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

తిరుపతిలో అన్య మత ప్రచారంపై చర్యలు…

Published

on

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )పై రోజురోజుకీ కుట్రలు పెరిగిపోతున్నాయి. అడుగడుగునా అన్యమత ముద్ర వేసేందుకు కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అనేక సార్లు తిరుమల శ్రీవారు, ఆలయంపై అవాస్తవ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. వాటిని ఖండించిన టీటీడీ అసత్య కథనాలపై ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరోసారి తమకు సంబంధం లేకున్నా టీటీడీ మరోసారి వార్తల్లో నిలిచింది. గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం రావడం కలకలం రేపింది.దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ.. ఇది దురుద్దేశ చర్య అంటూ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు.

కాగా సప్తగిరి మాస పత్రిక ప్యాకింగ్, డెలివరీ భాధ్యత మొత్తం పోస్టల్ శాఖవారే చూస్తారన్న విషయం తెలిసిందే. పోస్టల్ శాఖకు పోస్టేజి చార్జీలతో పాటు ఒక్కో ప్రతికి అదనంగా రూ. 1.05 టీటీడీ అదనంగా చెల్లిస్తోంది. ఇక గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్‌ ప్రచారం చేశారని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Continue Reading

DEVOTIONAL

జీవకోటి ఆరోగ్యం కొరకు సూర్యగ్రహణ జపయజ్ఞం…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  తిరుమల, జూన్ 21 , VSB NEWS :

జీవకోటి ఆరోగ్యం కొరకు తిరుమలలో సూర్యగ్రహణ జపయజ్ఞం

కరోనా వైరస్ నశించి, ప్రపంచంలోని సమస్త జీవకోటి ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారికి విన్నవిస్తూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఆదివారం రాహుగ్రహ చూడామణి సూర్యగ్రహణ జపయజ్ఞం నిర్వహించారు.

టీటీడీ నిర్వహించిన ఈ జప యజ్ఞంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైధ్యనాథన్, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు

Continue Reading

DEVOTIONAL

కనకదుర్గ ఆలయంలో అన్ని సేవలు, దర్శనాలు రద్దు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విజయవాడ, జూన్ 21 , VSB NEWS :

సూర్యగ్రహణం కారణంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో అన్ని సేవలు, దర్శనాలు రద్దు అయ్యాయి.

మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆలయ వైదిక కమిటీ, అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు.

మరోవైపు.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధిస్తూ నగరపాలక సంస్థ ప్రకటన జారీ చేసింది. ఎవరూ నదికి స్నానాలకు రావద్దని కోరింది.

సోమవారం నుంచి జులై 20 వరకు దుర్గమ్మకు ఆషాడ సారె సమర్పణ కార్యక్రమం చేపట్టనున్నారు.

పరిమిత సంఖ్యలో మాస్కులు ధరించి సారెను అమ్మవారికి సమర్పించేందుకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.

రేపు ఉదయం 8.30 గం.కు తొలి సారె శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పిస్తారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తొలి సారెను అమ్మవారికి సమర్పించనున్నారు.

Continue Reading

Trending

www.vsbnews.in