Connect with us

Politics

ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మార్చి 19, VSB NEWS :

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సొంత పార్టీ కార్యకర్తల ముందే.. బొ..లో నాయకత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానికంగా చిన్న వివాదం రేగింది. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరగా.. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎంపీనే కార్యకర్తలకు చెబుతుండగా.. కొందరు జై జగన్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

 

ఈ నినాదాలతో రఘురామకృష్ణం రాజు కాస్త నొచ్చుకున్నారు. అలాగే మరికొందరు కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయగా.. ఓ కార్యకర్త మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తన అసంతృప్తి వెంటనే బయటపెట్టారు. బొ..లో నాయకత్వం.. ఎవడి నాయకత్వం కావాలి.. నోరు మూసుకుని కూర్చో అంటూ ఘాటుగా ఫైరయ్యారు. ఎంపీ తిట్టడంతో కార్యకర్తలు ఒకింత షాకయ్యారు.. అంతా సైలెంట్ అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

డాక్టర్ల మాస్కులే కొట్టేశారు …..

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి, ఏప్రిల్ 04 , VSB NEWS :

 
ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం’ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు

కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందదని నారా లోకేష్ పెదవి విరిచారు. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు” అంటూ మండిపడ్డారు.

Continue Reading

Politics

నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది:

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 03, VSB NEWS :

నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సమర్థవంతంగా లేవని టీడీపీ నేత నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ‘ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందొ అర్థం చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు.

‘వైకాపా నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రం. కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని పేర్కొన్నారు.

‘జగన్ గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైకాపా నాయకులు కొట్టేయ్యడం దారుణం’ అని విమర్శించారు.

Continue Reading

Politics

సీఎం పై తీవ్ర విమర్శలు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, ఏప్రిల్ 02, VSB NEWS :

సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని మీడియా సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని, రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏవిధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని, ‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు

Continue Reading

Trending

www.vsbnews.in