Connect with us

Politics

కుట్రపూరితంగా వాయిదా వేశారు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మార్చి 19, VSB NEWS :

 

అంబటి రాంబాబు పాయింట్స్

కరోనా పేరుతో కుట్రపూరితంగా ఎన్నికలు వాయిదా వేశారు..

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై పిటిషన్ దాఖలు చేసింది…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి వ్యవహరించారనేది సుప్రీం కోర్ట్ తీర్పు ద్వారా స్పష్టమైంది..

ఎన్నికల వాయిదాలో రాజకీయ కోణం ఉందని న్యాయ మూర్తులు ప్రశ్నించారంటే వాస్తవం అర్ధమవుతుంది

ఎన్నికలు వాయిదా వేస్తూ కోడ్ ఎలా కొనసాగిస్తరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది..

ఎన్నికల కోడ్ ఎత్తివేయడం ద్వారా ఎన్నికల కమిషన్ తప్పు చేసిందనేది అర్ధమవుతుంది..

చారిత్మాక తీర్పు రావడంలో ప్రభుత్వం వివేశమైన కృషి చేసింది..

ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వంను సంప్రదించాలని ఆదేశించిందంటే ఎన్నికల సంఘం సిగ్గుపడాలి..

ఎన్నికల కమిషన్ ను వెనుకుండి అందించే వాళ్లకు కూడా ఈ తీర్పు ఒక హెచ్చరిక..

రాష్ట్రంలో మొదటి స్టేజ్ లో కరోనా ఉంది..

ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక ప్రజా ప్రతినిధులు కరోనా అడ్డుకునే ప్రక్రియ లో భాగస్వామ్యం అయ్యేవారు..

కేంద్రం ఎన్నికల కమిషన్ లో ముగ్గురు సభ్యలు ఉంటారు..

అలానే రాష్ట్రం ఎన్నికల కమిషన్ లో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తీసుకురావాలి..

ఎన్నికల కమిషనర్ పరువునష్టం దవా వేసుకుంటే వేసుకోవాలి..

మాకేమి భయం లేదు..మేముకుడా వేస్తాము..

మేము అన్న మాటలకు మేము ఇప్పటికి కట్టుబడి ఉన్నాము..

స్థానిక సంస్థలు ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారు..

23 అసెంబ్లీ సీట్లు వచ్చాయి కాబట్టి వాటికి ఎన్నికలు పెట్టమని అడుగుతారు..

చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నిఆయున కోరతారు..

చంద్రబాబు ఆడిగేవి అన్ని జరగవు, చట్టం ప్రకారం, నిబంధనలు ఎన్నికలు జరుగుతాయి.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబే ఉన్నారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

డాక్టర్ల మాస్కులే కొట్టేశారు …..

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి, ఏప్రిల్ 04 , VSB NEWS :

 
ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం’ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు

కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందదని నారా లోకేష్ పెదవి విరిచారు. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు” అంటూ మండిపడ్డారు.

Continue Reading

Politics

నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది:

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 03, VSB NEWS :

నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు సమర్థవంతంగా లేవని టీడీపీ నేత నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ‘ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందొ అర్థం చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు.

‘వైకాపా నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రం. కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని పేర్కొన్నారు.

‘జగన్ గారి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైకాపా నాయకులు కొట్టేయ్యడం దారుణం’ అని విమర్శించారు.

Continue Reading

Politics

సీఎం పై తీవ్ర విమర్శలు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, ఏప్రిల్ 02, VSB NEWS :

సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని మీడియా సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని, రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏవిధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని, ‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు

Continue Reading

Trending

www.vsbnews.in