Connect with us

Entertainment

సాంగ్  విడుద‌ల

Published

on

ఆంధ్రప్రదేశ్ , గుంటూరు, మార్చి 08, VSB NEWS :

 

సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి ఫలానా పాట మాత్రమే రాయగలరు అనడానకి ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన పాటల్లో మెలోడీలున్నాయి.. మాస్ మసాలాలున్నాయి.. భక్తిరస గేయాలున్నాయి.. భావోద్వేగత గీతాలున్నాయి. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో రాంజీ రాసిన ‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ’ అనే పాట ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. మళ్లీ అలాంటి గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాంజీ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి 8న) విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉమెన్స్ డే రోజు మహిళలకు అంకితం ఇవ్వడానికి ఇది కరెక్ట్ సాంగ్ అనిపిస్తుంది. రాంజీ సాహిత్యం అంత అద్భుతంగా ఉంది. మరి అలాంటి సాహిత్యాన్ని మీరూ పాడేయండి

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

పోస్టర్ విడుదల

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మార్చి 29, VSB NEWS :

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడులైంది. రేపు నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. కాగా, నితిన్, కీర్తి సురేశ్ లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, కౌసల్య, గాయత్రి రఘురామ్, తదితరులు నటిస్తున్నారు. డీఓపీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Continue Reading

Entertainment

లోగో వచ్చేసింది.

Published

on

 

హైదరాబాద్‌ , మార్చి 25, VSB NEWS :
:

ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది…ఆకట్టుకుంటోన్న మోషన్‌ పోస్టర్‌

: సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ లోగో వచ్చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
మొదటిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Continue Reading

Entertainment

క్లాప్ కొట్టిన పవన్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  మార్చి 12, VSB NEWS :

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. నివేదా పెతురాజ్ ఇందులో హీరోయిన్. దేవ్ కట్టా దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Continue Reading

Trending

www.vsbnews.in