Connect with us

Entertainment

‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ ను విడుదల చేసిన నాని

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మార్చి 07, VSB NEWS :

 

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ ను విడుదల చేసిన నాని
అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్‌ ఈ రోజు హీరో నాని చేతుల మీదుగా విడుదలైంది. ‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’ విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించిన ఈ సినిమా బృందం సరిగ్గా అదే సమయానికి విడుదల చేసింది.

ఈ సినిమా కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో వస్తోంది. ఈ సినిమాలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అంజలి డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘నేను చెబుతోంది అర్థమవుతుందా?’, ‘ఓ ఘోస్ట్ ఇదంతా చేస్తోందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నా సెన్సిబిలిటీస్‌ అంగీకరించలేదు’ అంటూ ఆమె ఓ డైలాగ్ చెప్పింది.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌కు మంచి టాక్‌ వచ్చింది. ట్రైలర్ ను కూడా అంచనాలకు తగ్గట్లుగానే కట్‌ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది. వచ్చేనెల 2న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆ సినిమా బృందం ప్రకటించింది

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

పోస్టర్ విడుదల

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మార్చి 29, VSB NEWS :

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడులైంది. రేపు నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. కాగా, నితిన్, కీర్తి సురేశ్ లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, కౌసల్య, గాయత్రి రఘురామ్, తదితరులు నటిస్తున్నారు. డీఓపీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Continue Reading

Entertainment

లోగో వచ్చేసింది.

Published

on

 

హైదరాబాద్‌ , మార్చి 25, VSB NEWS :
:

ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది…ఆకట్టుకుంటోన్న మోషన్‌ పోస్టర్‌

: సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ లోగో వచ్చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
మొదటిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Continue Reading

Entertainment

క్లాప్ కొట్టిన పవన్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  మార్చి 12, VSB NEWS :

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. నివేదా పెతురాజ్ ఇందులో హీరోయిన్. దేవ్ కట్టా దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Continue Reading

Trending

www.vsbnews.in