Connect with us

Entertainment

ప్రోమో రిలీజ్​

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మార్చి 07, VSB NEWS :

 

ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి తొలి సాంగ్ ను విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు ‘మగువ మగువ’ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మగువ మగువ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ‘మగువ మగువ లోకానికి తెలుసు నీ విలువ.. మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా..’అంటూ కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

పోస్టర్ విడుదల

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మార్చి 29, VSB NEWS :

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడులైంది. రేపు నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. కాగా, నితిన్, కీర్తి సురేశ్ లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, కౌసల్య, గాయత్రి రఘురామ్, తదితరులు నటిస్తున్నారు. డీఓపీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Continue Reading

Entertainment

లోగో వచ్చేసింది.

Published

on

 

హైదరాబాద్‌ , మార్చి 25, VSB NEWS :
:

ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది…ఆకట్టుకుంటోన్న మోషన్‌ పోస్టర్‌

: సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ లోగో వచ్చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
మొదటిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Continue Reading

Entertainment

క్లాప్ కొట్టిన పవన్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  మార్చి 12, VSB NEWS :

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. నివేదా పెతురాజ్ ఇందులో హీరోయిన్. దేవ్ కట్టా దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Continue Reading

Trending

www.vsbnews.in