Connect with us

Entertainment

ట్రైలర్ రిలీజ్

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మార్చి 07, VSB NEWS :

 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్… అరబిక్ కడలింతే సింహం’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘మరక్కార్… అరేబియా సముద్ర సింహం’ ట్రైలర్ ను చిరంజీవి, రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు తన సందేశాన్ని వెలువరించారు.

“నా ప్రియ మిత్రుడు మోహన్ లాల్, ప్రియదర్శన్ ల డ్రీమ్ ప్రాజెక్టు ‘మరక్కార్… అరేబియా సముద్ర సింహం’ ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ తిరు మరోసారి వెండితెరపై అద్భుత చిత్రకావ్యాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నా. చిత్రబృందం మొత్తానికి శుభమస్తు” అని పేర్కొన్నారు.

సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్ లో భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న ‘మరక్కార్…’ చిత్రంలో మోహన్ లాల్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రల్లో అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. అంతే కాదు, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో యశ్, తమిళంలో సూర్య రిలీజ్ చేశారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

పోస్టర్ విడుదల

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మార్చి 29, VSB NEWS :

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడులైంది. రేపు నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. కాగా, నితిన్, కీర్తి సురేశ్ లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, కౌసల్య, గాయత్రి రఘురామ్, తదితరులు నటిస్తున్నారు. డీఓపీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Continue Reading

Entertainment

లోగో వచ్చేసింది.

Published

on

 

హైదరాబాద్‌ , మార్చి 25, VSB NEWS :
:

ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది…ఆకట్టుకుంటోన్న మోషన్‌ పోస్టర్‌

: సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ లోగో వచ్చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.
మొదటిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Continue Reading

Entertainment

క్లాప్ కొట్టిన పవన్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  మార్చి 12, VSB NEWS :

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. నివేదా పెతురాజ్ ఇందులో హీరోయిన్. దేవ్ కట్టా దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Continue Reading

Trending

www.vsbnews.in