Connect with us

Entertainment

టీవీ వీక్షకులకు శుభవార్త

Published

on

 

హైదరాబాద్, మార్చి 07, VSB NEWS :

టీవీ వీక్షకులకు శుభవార్త. మార్చి 1 నుంచే ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం.. రూ.130 కే 200 ఉచిత ఛానళ్లు అందుబాటులో వచ్చాయి. రూ.160 కే అపరిమిత ఉచిత ఛానళ్లు వీక్షించవచ్చు. 26 డీడీ ఛానళ్లు వీటికి అదనం. వీక్షకులకు నచ్చిన ఛానల్‌ను అడిగి మరీ పెట్టించుకోవచ్చు, నచ్చిన ఛానళ్లను మాత్రమే చూడవచ్చు. ఈ నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు ఎంచుకున్న ఛానళ్లన్నింటినీ ఎంఎస్‌వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఇవ్వాల్సిందే. సవరించిన ధరలను డీపీవో వెబ్‌సైట్లో ఉంచాల్సిందే. వీక్షకులు అడిగిన ఛానళ్లను ఇవ్వకపోతే ట్రాయ్‌కు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు
 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!

Published

on

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు సొంతం
చేసుకుంది.
నిన్న యూనిట్ సినిమా ఫస్ట్ లుక్
విడుదల చేయగా, #Radheshyam హాష్ ట్యాగ్ తో
డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
దీంతో తక్కువ సమయంలో సింగిల్ హాష్ ట్యాగ్ తో
3.8 మిలియన్లు.. 24 గంటల్లో 6.3 మిలియన్లకు
పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. సింగిల్
హాష్ ట్యాగ్ తో ఈ స్థాయిలో ట్వీట్లు రావడం ఇదే
తొలిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Continue Reading

Entertainment

నెక్ట్స్ మూవీ మహేశ్‌తోనే

Published

on

తెలంగాణ , ఏప్రిల్ 19, VSB NEWS :

 

రాజమౌళి దర్శకత్వంలో ఇంతవరకు మహేశ్ బాబు నటించలేదు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేశ్‌కు చాలా ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న ఎదురైంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో చేస్తానని మహేశ్ చెప్పారు. అయితే తాజాగా రాజమౌళి తన తదుపరి చిత్రం  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మహేశ్‌తోనా, ప్రభాస్‌తోనా అనే మాటలు వినబడుతున్నాయని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని టీవీ9 యాంకర్ దీప్తి, రాజమౌళిని ప్రశ్నించింది.

అది నిజమేనని..  ప్రొడ్యూసర్ దానయ్యగారితో ఆర్.ఆర్.ఆర్ అయిపోగానే.. నిర్మాత నారాయణ గారి నిర్మాణంలో మహేశ్ బాబుతో తన కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని రాజమౌళి స్పష్టంచేశారు. మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న కాంబినేషన్ ఇది. రాజమౌళి క్లారిటీతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రాంచరణ్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే

Continue Reading

Entertainment

బన్నీ బర్త్ డే కి స్పెషల్ పిక్.

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 08, VSB NEWS :

మెగాస్టార్ చిరంజీవి బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తదైన శైలిలో చెప్పారు. ”డాన్స్ లో గ్రేస్ ఆ వయసు నుంచే ఉంది. బన్నీ లోని కసి, కృషి నాకు చాల ఇష్టం. హ్యాపీ బర్త్ డే బన్నీ, నువ్వు బాగుండాలబ్బా..” అని చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. బన్నీ పట్ల చిరంజీవికి ఉన్న ప్రేమ ఈ ట్వీట్ లో అర్థం అవుతుంది. ఇక ఆ ట్వీట్ లో చిరంజీవి చిన్నప్పుడు బన్నీ డాన్స్ చేస్తుంటే, చిరంజీవి ఎంకరేజ్ చేస్తున్న ఫోటో పంచుకున్నారు. ఆ ఫొటోలో బన్నీ, చిరు ఒకే రకమైన డిజైన్ ఉన్న షర్ట్స్ ధరించి ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక బన్నీ తన తదుపరి చిత్రం క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తుండగా, ఆ చిత్రానికి సంబందించిన కీలక అప్డేట్ నేడు వచ్చింది. బన్నీ తన 20వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేశారు. బన్నీ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ టైటిల్ భిన్నంగా పుష్ప అనే సాఫ్ట్ టైటిల్ ఈ మూవీ కోసం ఉపయోగించారు. బన్నీ లుక్ చాలా రఫ్ అండ్ ఇంటెన్స్ కలిగివుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

Continue Reading

Trending

www.vsbnews.in