చిత్తూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ :
వీరజవాన్ సతీమణికి గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలి
రాష్ట్రంలో దళితులు, మైనారిటీలను అధికారంలోకి రావటం కోసమే ముఖ్యమంత్రి జగన్ వాడుకున్నారని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని గారు ఆరోపించారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకుని ముస్లింలను, దళితులను వేదింపులకు గురి చేస్తోందని విమర్శించారు. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన వీడియో తీయకుండా ఉంటే ఆ కేసు తారుమారు చేసి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి కేసు మూసి వేసియుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేదింపులకు ఓ కుటుంబం చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించటంతో ఆ పోలీసు అధికారులపై మొక్కుబడిగా చర్యలు తీసుకుని 24 గంటల్లో బెయిల్ వచ్చేలా ప్రభుత్వం వారికి సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు ఈ విషయాలను గుర్తు పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.
*వీర జవాను కుటుంబాన్ని ఆదుకోవాలి*
దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించి వీరజవాన్ సతీమణికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని పులివర్తి నాని గారు కోరారు.

