Connect with us

Business

షాకింగ్ న్యూస్ మీ నెట్ వర్క్ ఐడియా- వోడాఫోనా?

Published

on

ఆంధ్రప్రదేశ్ , ఫిబ్రవరి 29, VSB NEWS

 

మీరు ఐడియా – వోడాఫోన్ నెట్ వర్క్ ఉపయోగిస్తున్నారా? లేదంటే.. మీ ఇంట్లో కానీ.. బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఈ నెట్ వర్క్ ఉపయోగించే వారికి దిమ్మ తిరిగిపోయే షాక్ సిద్ధమవుతుందా? అంటే అవునని చెప్పాలి. ఇప్పటికే ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంలో కిందా మీదా పడుతున్న ఈ టెలికం సంస్థ.. షాకింగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
తాజా ప్రతిపాదనతో తన నెట్ వర్క్ వినియోగించుకునే వినియోగదారుల వీపు వాచి పోయేలా టారిఫ్ ను సిద్ధం చేసిన వైనం బయట కు వచ్చింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న కాల్ ఛార్జీలతో పాటు.. డేటా చార్జీలకు కనీసం ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెంచాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.
ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలకు భిన్నంగా అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జీని నిమిషానికి ఆరు పైసలుగా నిర్ణయించింది. అదే సమయం లో ప్రస్తుతం ఒక బీజీ డేటాకు వసూలు చేస్తున్న రూ.4-5 బదులుగా ఒక జీబీకి రూ.35 మొత్తాన్ని వసూలు చేయాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాడు.. కనీస నెలసరి కనెక్షన్ ఛార్జీ రూ.50 ఉండాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది. తాను ప్రతిపాదించిన కొత్త టారిఫ్ లను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అయ్యేలా అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది.

ఈ దెబ్బతో ఈ నెట్ వర్క్ లో ఉన్న వినియోగదారులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారింది. మార్కెట్లో వినియోగదారుల వాటా తగ్గటం.. ఏజీఆర్ బకాయిల చెల్లింపు భారం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ధరల్ని పెంచాలన్న నిర్ణయం ఐడియా – వోడాఫోన్ ను ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published

on

, ఏప్రిల్ 03, VSB NEWS :

ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఐటీ షేర్లు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి 27,590కి పడిపోయింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 8,083కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (9.42%), ఐటీసీ (6.88%), ఓఎన్జీసీ (6.24%), టెక్ మహీంద్రా (1.85%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.81%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-9.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (-8.01%), టైటాన్ కంపెనీ (-7.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.92%).

Continue Reading

Business

ప్లాన్ వ్యాలిడిటీ పొడిగించిన…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి, ఏప్రిల్ 01, VSB NEWS :

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్స్ ను ఉపయోగించే తక్కువ ఆదాయపు వినియోగదారుల సౌలభ్యం నిమిత్తం వొడా ఫోన్ ఇండియా లిమిటెడ్ (వీఐఎల్) ఓ నిర్ణయం తీసుకుంది. వారు వినియోగించే ప్రీ పెయిడ్ ప్లాన్స్ పై వ్యాలిడిటీని వచ్చే నెల 17 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వ్యాలిడిటీని పొడిగించడమే కాకుండా, వీరి కోసం రూ.10 టాక్ టైమ్ ను ఉచితంగా అందిస్తున్నట్లు వీఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

వ్యాలిడిటీ పొడిగించడం ద్వారా ‘వొడా ఫోన్’, ‘ఐడియా’లకు చెందిన లక్షల మంది ఫీచర్ ఫోన్ యూజర్లు తమకు వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ ను నిరాంటంకంగా రిసీవ్ చేసుకోవచ్చని పేర్కొంది. తక్కువ ఆదాయపు యూజర్లు వినియోగిస్తున్న ఆయా ప్లాన్స్ వ్యాలిడిటీ ముగిసినా కూడా ఈ ఆఫర్ వరిస్తుందని చెప్పింది. దాదాపు 100 మిలియన్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులకు తాము తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, అర్హులైన యూజర్లందరికీ వారి వారి అకౌంట్లలోకి రూ.10 టాక్ టైమ్ సాధ్యమైనంత త్వరగా క్రెడిట్ అవుతుందని పేర్కొంది. వ్యాలిడిటీ గడువు ముగిసేలోగా తమ యూజర్లు తమ బంధువులకు, మిత్రులకు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు లేదా టెక్స్ట్ మెస్సేజెస్ పంపుకోవచ్చని పేర్కొంది.

Continue Reading

Business

జియోఫోన్ యూజర్లకు శుభవార్త…

Published

on

ఆంధ్రప్రదేశ్  , మార్చి 31, VSB NEWS :

జియోఫోన్ యూజర్లకు శుభవార్త… 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి

జియోఫోన్ ఉపయోగిస్తున్నవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా కరోనావైరస్ సంక్షోభం నెలకొనడంతో జియోఫోన్ యూజర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది రిలయెన్స్ జియో.

రిలయెన్స్ జియోఫోన్ యూజర్లకు శుభవార్త. రిలయెన్స్ జియో 10 రెట్ల లాభాలను ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం, జనమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటనున్న సంగతి తెలిసిందే. వారి కోసం రిలయెన్స్ జియో ప్రత్యేకమైన రీఛార్జ్ ఆఫర్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో భాగంగా జియోఫోన్ యూజర్లకు కూడా బెనిఫిట్స్ ప్రకటించింది. జియో ఫోన్ ఉన్నవారందరికీ 100 నిమిషాల కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లను కాంప్లిమెంటరీగా అందిస్తోంది. 2020 ఏప్రిల్ 17 వరకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంతేకాదు… జియో ఫోన్‌లో వేలిడిటీ పూర్తైన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయి.

ఇక జియో నెంబర్‌కు రీఛార్జ్ చేయడాన్ని కూడా మరింత సులభతరం చేసింది. చాలామంది తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్ చేస్తుంటారు. అయితే రీటైల్ స్టోర్లల్లో రీఛార్జులు చేసేవారు ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది జియో. యూపీఐ, ఏటీఎం, ఎస్ఎంఎస్‌ల ద్వారా రీఛార్జ్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఏఏ పద్ధతిలో ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

MyJio: మైజియో యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ పైన క్లిక్ చేసి, మొబైల్ నెంబర్, అమౌంట్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.

Jio Website: https://www.jio.com/ వెబ్‌సైట్‌లో క్విక్ పే పైన క్లిక్ చేసి రీఛార్జ్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.

Online: గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ ద్వారా రీఛార్జ్ చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా రీఛార్జ్ సులభమే.

Continue Reading

Trending

www.vsbnews.in