విజయనగరం జిల్లా ,ఆంధ్రప్రదేశ్ , నవంబర్ 10
మంత్రి బొత్స పాదయాత్రను విజయవంతం చెయ్యాలి చిన్న శ్రీను, ఎంపీ పెదబాబు, శ్రీకాంత్
వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చి చారిత్రాత్మకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టింది అని .
గరివిడి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన నాలుగు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్చార్జ్ చిన్న శ్రీను , విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్* , రాష్ట్ర బీసీ సంక్షేమ చైర్మన్ *మామిడి* శ్రీకాంత్ మాట్లాడారు. అంతటి ప్రాధాన్యత గల పాదయాత్ర గొప్పతనాన్ని మరోమారు చాటిచెప్పే రీతిలో ఈ నెల 15వ తేదీన రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు *బొత్స* *సత్యనారాయణ* గారు *గరివిడి వినాయక* *స్వామి కోవిల నుండి చీపురుపల్లి మూడు రోడ్ల* *జంక్షన్ వరకూ* పాదయాత్ర లో పాల్గొంటారు కావున నియోజకవర్గం అంతా పండుగలా వచ్చి పాదయాత్ర చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాఫెడ్ డైరెక్టర్ సూర్యనారాయణ రాజు మరియు నాలుగుమండలాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
.

