Connect with us

News

ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ కట్…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 17 , VSB NEWS :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏం చెప్పిందో… అదే చేసుకుంటూ పోతోంది. ఇంటింటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ఆయా జిల్లాల్లో నేతలు దీన్ని ప్రారంభించి… గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా… ప్రతీ ఇంటి తలుపు తట్టి రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే… ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వబోతోంది. అలాగే… రేషన్ సరుకులు కూడా. ఇలా ఇళ్లకే తెచ్చి కార్డులు ఇస్తుండటంతో… లబ్దిదారులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా లబ్దిదారుల ఇంటికి గ్రామ వాలంటీర్లు రాకపోతే…
ఆందోళన చెందకుండా మరో వారం ఆగడం మంచిదే. ఎందుకంటే ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్‌ సంతకం తప్పనిసరి చేశారు. అందుకే కాస్త ఆలస్యమవుతోంది. వారమైనా కార్డు తెచ్చి ఇవ్వకపోతే… అప్పుడు కాల్ చేసి… తమకు ఇంకా కొత్త రేషన్ కార్డు రాలేదని అడగవచ్చు. వెంటనే వాళ్లు అలర్టై… తెచ్చి ఇస్తారు.

కొత్తవి ఎందుకు?

: ఇది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగిందనీ, చాలా మంది అర్హులు కాని వాళ్లు తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్నారని ఇప్పటి ప్రభుత్వం తేల్చింది. అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇది ఓ పట్టాన తేలకపోవడంతో… ఇలా కాదని అనుకున్న ప్రభుత్వం తాజాగా కొత్తగా రేషన్ కార్డు లబ్దిదారుల్ని గుర్తించి, వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది. అందువల్ల లబ్దిదారులు కచ్చితంగా కొత్త రేషన్ కార్డుల్ని పొందాల్సిందే. అప్పుడు మాత్రమే వారికి నెలవారీ ఉచిత రేషన్ సరుకులు లభిస్తాయి. ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ కార్డులు లేకపోతే… ఇతర పథకాలు అందవేమో అన్న డౌట్ కొంత మందికి ఉంటుంది. ఆ భయం అక్కర్లేదు. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, జగనన్న దీవెన, అమ్మఒడి వంటి పథకాలకూ, రేషన్ కార్డుకూ సంబంధం లేదు. ఆ పథకాలకు ఉండే రూల్సే ఆ పథకాలకు వర్తిస్తాయి. అందువల్ల అర్హులకు అన్యాయం జరగదనీ, ఆవేదన చెందవద్దని ప్రభుత్వం మరీ మరీ చెబుతోంది.ఓవైపు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం… మరోవైపు పాత అక్రమ రేషన్ కార్డుల్ని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. అందువల్ల అనర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ చేసుకున్నా ప్రభుత్వం వారికి కొత్తవి ఇవ్వదు. ఎవరైనా నెలకు 300 యూనిట్లు కరెంటు వాడుతున్నట్లైతే… వారిని రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితా నుంచీ తొలగిస్తున్నారు.

కొత్త రేషన్ కార్డులు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫొటోలతోపాటు, ప్రభుత్వం చిహ్నంతో వైసీపీ గుర్తులు ముద్రించారు. ఈ రేషన్ కార్డులు విజయవాడలో ప్రింటింగ్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు కల్లా లబ్దిదారులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తారని తెలుస్తోంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

జిల్లాలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అనంతపురం , మార్చి 29, VSB NEWS :

– హిందూపురం జిజిహెచ్, బత్తలపల్లి ఆర్డిటిలలో శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు

– పేదవారికి, వలస కూలీలకు భోజన వసతి కల్పనకు స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు, దాఖలు ముందుకు రావాలి

– జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

:
కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లాలో మరో రెండు శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేదవారికి భోజన వసతి కల్పన పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ శాంపుల్ కలెక్షన్ కేంద్రం ఉండగా, హిందూపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో, బత్తలపల్లి ఆర్ డి టి ఆస్పత్రిలో ఒక్కొక్కటి చొప్పున రెండు కరోనా వైరస్ శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ శాంపిళ్లను సేకరించేందుకు ఏర్పాట్లు చేయగా, బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి లో శాంపుల్ కలెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

శాంపుల్ కలెక్షన్ల కేంద్రాల వల్ల కరోనా వైరస్ అనుమానిత లక్షణాలను త్వరితగతిన పరీక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఉచిత భోజన పంపిణీకి స్థలాలను గుర్తించాలి :

కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లాలోని పేదవారికి, వలస కూలీల కు భోజన వసతి కల్పించేందుకు పలు ప్రాంతాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రెండు రోజుల లోపల భోజన పంపిణీకి ఏర్పాట్లు చేసేలా అధికారులు సమన్వయంతో వివిధ ప్రాంతాలను గుర్తించాలన్నారు.

ఒక భోజన పంపిణీ కేంద్రం వద్ద ఒక సూపర్వైజర్ ను నియమించి ప్రతి ఒక్కరికి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి వాహనాల సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

నేడు కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు, దాతల తో సమావేశం :

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు, చారిటబుల్ ట్రస్ట్ లు, దాతల తో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేదవారికి, వలస కూలీల కు భోజన వసతి కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు, చారిటబుల్ ట్రస్ట్ లు, దాతలు మానవతా హృదయం తో ముందుకు రావాలని కోరారు.

కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ పరిస్థితులు నెలకొనడంతో పేదవారు భోజన వసతి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేదలు, వలస కూలీలు అందరిని ఆదుకునేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు రావాలన్నారు.

సోమవారం నిర్వహించిన సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ దాతృత్వాన్ని చాటుకుని, అత్యవసర సమయంలో పేదవారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జెసి ఢిల్లీ రావు, జెసి2 రామ్మూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డిఆర్ఓ గాయత్రి దేవి, డి ఎం హెచ్ ఓ అనిల్ కుమార్, ఆసుపత్రి సూపర్డెంట్ రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ఆర్ డి టి డైరెక్టర్ మాంచు ఫెర్రర్ పాల్గొన్నారు.

Continue Reading

News

తొలిరోజు రేషన్ అందచేత

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మార్చి 29, VSB NEWS :

– ఎపిలో పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ.
– రేషన్ కార్డులపై మూడు విడతలుగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశం.
– ఏప్రిల్ 15, 29వ తేదీల్లో కూడా ఉచిత పంపిణీ
– పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం.
– కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పన పంపిణీ.
– తొలిరోజు 20,30,342 మంది కార్డుదారులకు రేషన్ అందచేత.
– 26,220.098 మెట్రిక్ టన్నుల బియ్యం..
– 1712.506 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ.
– ఉదయం 6 నుంచి ప్రారంభమైన పంపిణీ.

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జరుగుతున్న లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ కార్డులపై ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల వల్ల పనులు లేక పేదలు పస్తులు వుండే పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పేదలకు బియ్యం, కందిపప్పు అందచేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కార్డులోని ప్రతి ఒక్క వ్యక్తికి అయిదు కిలోల చొప్పున, అలాగే ప్రతి కార్డుకు ఒక కిలో కందిపప్పును రేషన్ దుకాణాల్లో పంపిణీ చేశారు. మొత్తం మూడు విడతలుగా ఈ పంపిణీ కార్యక్రమం జరగాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తొలివిడత పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభించారు. రెండో విడత కింద ఏప్రిల్ 15వ తేదీన, మూడో విడత పంపిణీ ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభించనున్నారు. పేదల ఆకలి బాధలు లేకుండా మానవత్వంతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నెల రోజుల్లో రేషన్ కార్డులో పేరు వున్న ప్రతివ్యక్తికి మొత్తం 15 కేజీల బియ్యం ఉచితంగా అందనుంది. అలాగే ప్రతికార్డుకు మూడు కిలోల కందిపప్పును కూడా పంపిణీచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజున 20,30,342 కార్డులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. కార్డుదారులకు కేటాయించిన రేషన్ దుకాణాల్లో 17,12,506, పోర్టబిలిటీ ద్వారా 3,17,836 మంది కార్డుదారులు లబ్ధిపొందినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,620 రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 1,47,24,017 రేషన్ కార్డులు వున్నాయి. తొలిరోజున 26,220.098 మెట్రిక్ టన్నుల బియ్యం, 1712.506 మెట్రిక్ టన్నుల కందిపప్పును లబ్దిదారులకు అందచేశారు. రేషన్ కార్డు దారులు ఒకేసారి రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా రాకుండా ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ ను అందచేస్తామని, విడతల వారీగా దుకాణాల వద్దకు రావాలంటూ అధికారులు ముందుగానే ప్రచారం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా రేషన్ దుకాణం వద్దకు వచ్చే వారు కనీసం మీటరు దూరం పాటిస్తూ వరుసలో వేచివుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విఆర్వో, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ తో లబ్దిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అలాగే రేషన్ దుకాణాల వద్ద సబ్బు, శానిటైజర్ లను అందుబాటులో వుంచారు. కేంద్రప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఆహార భద్రతా పథకం కింద మాత్రమే కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకుని అందరు రేషన్ కార్డుదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం అదనంగా పడే భారాన్ని కూడా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.
——————————————————————————————————————-
జిల్లా చౌకదుకాణాలు మొత్తం కార్డులు నేరుగా తీసుకున్నవారు పోర్టబిలిటీ బియ్యం(MT) – కందిపప్పు(MT)
——————————————————————————————————————-
పశ్చిమగోదావరి 2,211 12,59,925 2,05,042 50,774 3082.216 205.042
చిత్తూరు 2,901 11,33,535 1,80,414 12,315 2970.682 180.414
నెల్లూరు 1,895 9,04,220 1,22,509 16,638 1891.235 122.509
తూర్పు గోదావరి 2,622 16,50,254 2,11,499 44,402 3132.283 211.499
కృష్ణా 2,330 12,92,937 1,60,942 44,306 2341.030 160.942
ప్రకాశం 2,151 9,91,822 1,17,112 19,476 1765.180 117.112
గుంటూరు 2,802 14,89,439 1,72,190 49,492 2486.782 172.190
వైఎస్ఆర్ కడప 1,737 8,02,039 86,282 13,809 1373.685 86.282
విజయనగరం 1,404 7,10,528 73,880 4,855 1174.240 73.880
విశాఖపట్నం 2,179 12,4,5266 1,25,942 33,330 1834.230 125.942
శ్రీకాకుళం 2,013 8,29,024 76,012 0 1215.360 76.012
కర్నూలు 2,363 11,91,344 1,09,787 20,174 1759.298 109.787
అనంతపురం 3,012 12,23,684 70,895 8,265 1193.877 70.895

Continue Reading

News

శిక్షణ కు హజరు కావాలి

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , చిత్తూరు , మార్చి 29, VSB NEWS :

చిత్తూరు జిల్లా కలెక్టర్
ప్రవేట్ ఆసుపత్రుల డాక్టర్లు ఈ నెల 30 న జరిగే శిక్షణకు తప్పనిసరి హాజరు కావాలి.

అన్ని ప్రవేట్ ఆసుపత్రులు, ప్రవేట్ హాస్టళ్లు, కళ్యాణమండపాలు , లాడ్జిలు క్వారెంటైన్ కు సహరించాలి.

చిత్తూరు జిల్లాకు రాబోవు రోజుల్లో 5 వేల బెడ్లు అవసరమని ప్రాధమిక అంచనా

తిరుపతి, మార్చి 29: జిల్లాలోని అన్ని ప్రవేటు ఆసుపత్రుల డాక్టర్లు వారి సిబ్బంది కి సోమవారం స్థానిక స్విమ్స్ ఆసుపత్రి ఓపి మిద్దెపైన గల ఆడిటోరియంలో కోవిడ్ 19 శిక్షణకు తప్పనిసరి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త ఆదేశాలు జాreeచేశారు.

ఆదివారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రుల నిర్వహుకులు డాక్టర్లు, ఐ ఏం ఏ అధికారులతో యూనివర్సిటీ ల రిజిస్తార్లతో సమావేశమై ప్రభుత్వం ఆదేశాలను పాటించేవిధంగా ఏర్పాట్లుకు సిద్దంగా వుండాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు రోజులు కోవిడ్ -19 తీవ్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ , ప్రవేట్ ఆసుపత్రుల డాక్టర్లు సేవలందించే విధంగా సిద్దంగావుండాలని తెలిపారు ,

అన్ని ప్రవేట్ ఆసుపత్రులలో క్వారెంటైన్ ఏర్పాటుకు సిద్దంగా వుండి వైద్యసేవలు అంధించాలని తెలిపారు.

అందుకోసం సోమవారం కోవిడ్ -19 పై ఇచ్చే శిక్షణ కు హజరు కావాలని తెలిపారు.

ప్రస్తుతం తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆసుపత్రి ని రాష్ట్ర కోవిడ్ -19 ఆసుపత్రి గా ప్రకటించారని, అందులో 170 బెడ్లు వున్నాయని తెలిపారు.

ప్రవేటు ఆసుపత్రులలో వసతులు, వెంటిలేటర్ల వివరాలు అందించాలని, ప్రభుత్వం 6 నెలల పాటు క్వారెంటైన్ కు అందించిన ఆసుపత్రులలో ప్రవేట్ డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించనున్నదని తెలిపారు.

జిల్లాకు 5000 బెడ్ల అవసరమని ప్రాధమిక అంచనా అని అన్నారు.

తిరుపతి అర్బన్ , రూరల్ తహసిల్దారులు కళ్యాణ మండపాలు, హోటల్సు వివరాలు అక్కడ మనం కల్పించాల్సిన సౌకర్యాలు చూడాలని అన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ లు హాస్టళ్లు త్వరగా సిద్దంచేసి వుంచాలని సూచించారు.

డాక్టర్లు ఎక్కడ అయితే రోగి వచ్చి కొరితే మీ అనుభావం మేరకు లక్షణాలు అనుమానమ్మైతే దగ్గరలోని క్వారెంటైన్ తరలించి నిర్ధార తరువాత ఇంటికి పంపే విధంగా వుండాలని జిల్లాలో ప్రతి ఎం.బి.బి.ఎస్., రిటైర్, పిజిలు ఆఖరు సంవత్సరం వారు తప్పనిసారి ఈ సంక్లిష్ట సమయంలో సేవలంధించాలని సూచించారు.

ఈ సమావేశంలో జెసి 2 చంద్రమౌళి, ఆర్డీఓ కనకనరసా రెడ్డి, డిఎంహెచ్ ఓ పెంచలయ్య, డిప్యూటీ డిఎం హెచ్ ఓ అరుణ సులోచనా దేవి, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు మమత, శ్రీధర రెడ్డి , ఐ ఎం ఏ డాక్టర్లు కృష్ణ ప్రశాంతి, తిరుపతి రూరల్ తహశీల్దార్ కిరణ్ కుమార్, అర్బన్ వెంకట రమణ ప్రవేటు ఆసుపత్రుల నిర్వాహకులు డాక్టర్లు శ్రీహరి రెడ్డి, సుబ్రమణ్యం, డిబిఆర్ ఆసుపత్రి డాక్టర్లు , దాదాపు అన్ని ప్రవేట్ ఆసుపత్రులు సంబంధించిన డాక్టర్లు హాజరయ్యారు.

Continue Reading

Trending

www.vsbnews.in