Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(15-02-2020)

Published

on

పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు. ఇలా ఎంతకాలం ఆయన్ను మా నుంచి వేరు చేస్తారు. 2017లో పాటీదారులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం హార్దిక్‌ పటేల్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ప్రస్తావించకుండా హార్దిక్‌ను ప్రభుత్వం అడ్డుకుంటోంది’’ అని వీడియోలో ఆమె ఆరోపించారు.

తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు నిషేధం కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ సోకడంతో వేలాదిగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా మాంసం ఉత్పత్తుల అమ్మకాలపై మున్సిపల్ అధికారులు నిషేధం విధించారు. వైరస్ సోకిన కోళ్లను కాల్చి వేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు సూచించారు.

పాలుపోసేవాడితో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త..ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.భార్య తనని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాలు పోసే వ్యక్తితో ఆమె ప్రేమాయణం రోజు రోజుకీ కొనసాగిస్తోంది. తొలుత అతను నమ్మలేదు. చాలాసార్లు చూసిన తర్వతా అతనిలో అనుమానం మొదలైంది. ఆ అనుమానం అతనిలోని రాక్షసుడిని నిద్రలేపింది. దీంతో… భార్యతో చనువుగా ఉంటున్న ఆమె ప్రియుడిని అతి దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన నల్గొండ జిల్లా అనుముల లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల వ్యాపారం చేసే రేవంత్‌కుమార్‌ ప్రతి రోజు హజారిగూడెం వెళ్లేవాడు. అక్కడ పలు ఇళ్లల్లో పాలు పోసేవాడు. అయితే… రేవంత్ కుమార్.. పాలు పోయడానికి వచ్చి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జానపాటి హరికృష్ణ భావించాడు. ఈ విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.రేవంత్‌కుమార్‌ను చంపేందుకు మూడు సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ నెల ఐదో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు హరికృష్ణ, రాజేష్‌, మహేష్‌, రామాంజనేయులు కలిసి హజారిగూడెం స్టేజీ సమీపంలో చెట్ల పొదల్లో మాటు వేశారు. అదే సమయంలో పాల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రేవంత్‌కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేసి రాడ్లతో కొట్టి, కొడవళ్లతో ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో హరికృష్ణ సుపారీ ఇచ్చి మరీ హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేశామని అంగీకరించారు

పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ జవానును పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తిరుమల్ రెడ్డి తన వద్ద తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2002 నుంచి 2019 వరకు ఆర్మీలో పనిచేసి రిటైరైన బద్దం తిరుమల్ రెడ్డి డీబిబిఎల్ అనే లైసెన్స్డ్ వెపన్, 20 బుల్లెట్లను కలిగి వున్నాడు. 2019 డిసెంబర్ 31 రాత్రి శాయంపేట లో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఓపెన్ ఫైరింగ్ పాల్పడ్డాడు. గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను గ్రామస్తులు తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. తాజాగా ఈనెల 13న గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరగగా ఆ సమయంలో కూడా తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియోలు, పాత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసిపి హాబీబ్ ఖాన్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై ప్రేమ్ కుమార్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి నుంచి డీబీబీఎల్ వెపన్, 10 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వీరు గత కొంతకాలంగా ఒంగోలులోని రైలు పేటలో నివాసం ఉంటున్నారు. నిన్న ఒంగోలు నుంచి కారులో ఇదే కుటుంబానికి చెందిన ఆరుగురు చెన్నై వెళ్లారు. యశ్వంత్ తల్లితండ్రులను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించి తిరిగి బయల్దేరారు. శుక్రవారం ఉదయం తడ మండలం పన్నంగాడు వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి (37) అనుసెల్వీ (27) చిన్నారి రియాన్ (ఏడాది) అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. యశ్వంత్ (35) ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

భారతీయ బ్యాంకులకు తాను రుణపడిన మొత్తంలో 100 శాతం అసలును తిరిగి తీసుకోవాలని లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా మరోసారి కోరారు. తనను భారత్‌కు అప్పగించాలని ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాల్యా వేసిన పిటిషన్‌పై బ్రిటిష్‌ హైకోర్టులో మూడు రోజుల విచారణ గురువారం పూర్తయ్యింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన మాల్యా.. న్యాయస్థానం బయట మీడియాతో మాట్లాడారు. ‘నేను రుణపడిన మొత్తంలో 100శాతం అసలును తక్షణమే తీసుకోవాలని బ్యాంకులను చేతులు జోడించి కోరుతున్నా. నేను ఏ నేరం చేయలేదు. కానీ తీసుకున్న రుణాలు చెల్లించలేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నా ఆస్తులను అటాచ్‌ చేసింది. కానీ నేను చెబుతున్నది ఒక్కటే బ్యాంకులు.. దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి’ అని మాల్యా చెప్పుకొచ్చారు. సీబీఐ, ఈడీ అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయని ఆయన మరోసారి ఆరోపించారు. అయితే భారత్‌కు తిరిగెళ్లే యోచన ఉందా అని ప్రశ్నించగా.. ‘నా కుటుంబం ఎక్కడ ఉంటుందో.. నాకు ఎక్కడ ప్రయోజకరంగా ఉంటుందో అక్కడే ఉంటా’ అని మాల్యా సమాధానమిచ్చారు. మాల్యా కేసులో ఏడాదిపాటు విచారణ జరిపిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం.. అతడిని భారత్‌కు అప్పగించాలని 2018 డిసెంబరులో కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును మాల్యా బ్రిటిష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై గత మంగళవారం నుంచి వాదనలు విన్న న్యాయస్థానం.. త్వరలోనే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

తయారీ రంగంలో స్తబ్ధత, ఇతర కారణాలతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అనేక ప్రతిపాదనలు చేసింది. అయితే, అవసరమనుకుంటే బడ్జెట్‌ ప్రకటనలో లేని మరిన్ని చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, వెల్త్‌ అడ్వైజరీ, ట్యాక్స్‌ కన్సల్టెన్సీలకు చెందిన ప్రతినిధులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈక్విటీ, బాండ్‌, కరెన్సీ మార్కెట్లపై 2020-21 బడ్జెట్‌ ప్రభావం సానుకూలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవసరమైతే బడ్జెట్‌లో లేని కొత్త చర్యలు చేపడతామని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు రానున్న వేళ అందరి దృష్టి వాణిజ్య ఒప్పందంపైనే ఉంది. అయితే సరైన ప్రతిపాదన వస్తే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ట్రంప్‌ ఇప్పటికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్‌ కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు సమాచారం. కోడి మాంసం, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించడానికి సిద్ధమైనట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. పాలఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మనదేశంలో ప్రస్తుతం దిగుమతులపై పరిమితులు ఉన్నాయి. దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకుని దిగుమతులపై ఆంక్షలు విధించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్న తుక్కుపాలసీకి సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. మార్చిలో దీనికి కేబినెట్‌ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఆయన నేడు ఫెడరేషన్‌ ఆఫ్ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ 11వ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ మా స్క్రాపింగ్‌ పాలసీ రూపకల్పన తుదిదశకు చేరింది. మేము కేబినెట్‌ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చే నెల లేదా.. 15 రోజుల్లో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించవచ్చు’’ అని పేర్కొన్నారు.

బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్‌ డెడ్‌లైన్‌ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సర్కిల్‌, జోనళ్ల వారీగా టెలికాం శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రారంభించినట్టు పీటీఐ పేర్కొంది. టెలికం సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం అర్ధరాత్రి కల్లా బకాయిలన్నీ క్లియర్‌ చేయాలని యూపీ (పశ్చిమ) టెలికం సర్కిల్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

నిర్భయ హత్యాచారం కేసులో దోషి అయిన వినయ్‌శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంపై అతడు పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుపై ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరీఫ్‌ మండలి కార్యదర్శికి ఇటీవల దస్త్రాన్ని పంపగా.. అది నిబంధనలకు విరుద్ధమంటూ మండలి కార్యదర్శి దాన్ని తిప్పి పంపారు. మండలి ఛైర్మన్‌ మళ్లీ దాన్ని కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి కూడా ఆయన తిప్పి పంపారు.

బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్‌ డెడ్‌లైన్‌ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీనికోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని బొత్స ప్రశ్నించారు.

ఇంటి నిర్మాణ అనుమతులను సత్వరం ఇచ్చే లక్ష్యంతో ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీ పాస్‌ను అమలు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పౌరులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఐటీ దాడుల వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తేలుకుట్టిన దొంగల్లా తెదేపా నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.వేలకోట్లు దోచేశారని ఆరోపించారు.

ఏపీలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మంది అని తెలిపింది. పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని తెలిపింది. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,436, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 4,066 మంది ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో 494 హుండీలను భద్రపరిచారు. గత మూడు రోజులుగా హుండీలు తెరిచి కానుకల లెక్కింపు కొనసాగిస్తున్నారు. గురువారం నాటికి 129 హుండీల లెక్కింపు పూర్తి అయింది. గురువారానికి రూ.2,92,76,000 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆధునిక కాలంలో ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్నా ఇంకా కొందరు ఆచారాలు, మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. గుజరాత్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. భుజ్‌ ప్రాంతంలోని ఓ మహిళల కాలేజీలో రుతుస్రావాన్ని గుర్తించేందుకు 68 మంది విద్యార్థినులతో బలవంతంగా దుస్తులు విప్పించారు అక్కడి సిబ్బంది.

జమైకా చిరుతపులి, స్ప్రింటర్‌ ఉసెన్‌ బోల్ట్‌ గురించి తెలియని వారుండరు. కేవలం 9.58 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అయితే బోల్ట్‌ను మించిన వేగంతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో స్టార్‌ అయ్యాడు కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ఔరా అనిపించాడు. అది కూడా మామూలు నేలపై కాదండోయ్‌.. బురద పొలంలో ఓ చేత్తో ఎద్దులను పట్టుకుని మెరుపువేగంతో దూసుకెళ్లాడు.

టెలికాం సంస్థలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదంటూ కడిగి పారేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. సంస్థల నుంచి బకాయిలను రాబట్టడంలో విఫలైమన ప్రభుత్వంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీల కింద టెలికాం సంస్థలు ప్రభుత్వానికి రూ.92,000 కోట్లు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలికమ్యూనికేషన్స్‌ సహా మిగిలిన టెలికాం సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వేళ్లుమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీను అలియాస్‌ మంగళ శ్రీను అనే వ్యక్తి ఏడోతరగతి వరకు చదువుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా జేఆర్‌పురం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న పాత ఎస్‌.ఐ.అశోక్‌బాబుకు నెల రోజుల కిందట రాచపల్లి శ్రీను ఫోన్‌ చేసి తాను విశాఖపట్నం డీఐజీ మాట్లాడుతున్నాని నమ్మబలికాడు. మీరు వీఆర్‌లో ఉన్నారని తెలిసింది…మీ సమస్యను పరిష్కరిస్తానన్నాడు. ఇందుకు రూ.4 లక్షలు నాలుగు విడతులుగా ఇవ్వాలని సూచించాడు. పండ్లు అమ్ముకున్న వ్యక్తులకు చెందిన బ్యాంకు ఖాతాలు సేకరించి పోలీసు అధికారులకు ఇచ్చాడు. 2006 నుంచి బంగారు గొలుసుల చోరీల కేసుల్లో 18 ఎన్‌బీడబ్ల్యూ కేసులున్నాయి. కర్నాటక, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కేసులున్నాయి. 2016లో జైలు నుంచి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడుతున్నాడు. 2017లో బంగారు గొలుసు చోరీ చేస్తుండగా పట్టుబడి జైలుకెళ్లాడు.

అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్‌.. అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని.. ఆర్థిక అత్యయిక పరిస్థితి రాబోతోందని ఉమ చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. దేశంలోని 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85లక్షలు దొరికాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు జైలు భయం పట్టుకుందని లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఐటీ దాడులను తెదేపాకు ముడి పెట్టాలని తాపత్రయపడుతున్నారనీ.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ నిద్రమత్తులో తూలుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం సమీక్షలు కూడా నిర్వహించకుండా వ్యవస్థను గాలికొదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కొవిడ్‌-19 సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొవిడ్‌-19 నివారణకు భాజపా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి భాజపా కార్యాలయంలో లక్ష్మణ్ ప్రారంభించారు.

పుల్వామా దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మన భద్రతా బలగాలను రాహుల్‌ అవమానిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని దుయ్యబట్టింది. జవాన్ల త్యాగాలను స్మరించుకున్న రాహుల్‌.. ట్విటర్‌ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ ఆ దాడితో ఎవరు ప్రయోజనం పొందారు..? భద్రతా లోపాలకు బాధ్యులు ఎవరు?’ అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు’’ అని వీడియోలో కింజల్‌ ఆరోపించారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దీనివల్ల టెలికాం కంపెనీల నిరర్ధక ఆస్తులు పెరిగే సూచనలు ఉన్నాయన్న భయాలతో బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో సెన్సెక్స్‌ 202.05 పాయింట్లు నష్టపోయి 41,257.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 61.20 పాయింట్లు నష్టపోయి 12,113.50 వద్ద స్థిరపడింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండురోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు.

ఆటోమేషన్‌ వల్ల దేశంలో 9శాతం మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్ లిప్టన్‌ అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడం వల్ల వీరికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. గురువారం సి.డి.దేశ్‌ముఖ్‌ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశ ఆర్థిక వృద్ధి 6-7శాతం ఉండేదని తెలిపారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(19-03-2020)

Published

on

By

క‌రోనా కాటుకు గ్యాంబ్ల‌ర్లు కూడా బిక్కుబిక్కుమంటున్నారు.అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న కాసినోల‌ను మూసివేశారు. నెల రోజుల పాటు క్యాసినోల‌ను మూసివేయాల‌ని అమెరికా ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్ర‌తి రోజు వేలాది మంది జూద‌గాళ్లు లాస్ వెగాస్‌లో గ్యాంబ్లింగ్ ఆడేందుకు వ‌స్తుంటారు. అయితే క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. క్యాసినోలు, రెస్టారెంట్లు, ఇత‌ర బిజినెస్ కేంద్రాల‌ను మూసివేస్తున్న‌ట్లు నెవ‌డా రాష్ట్రం ప్ర‌క‌టించింది.తాజా ప్ర‌భుత్వ ఆదేశాల‌తో గ్యాంబ్లింగ్ రాజ‌ధానిగా పేరుగాంచిన లాస్ వెగాస్ వెల‌వెల‌బోయింది.సాధార‌ణంగా లాస్ వెగాస్‌లో 24 గంట‌లూ క్యాసినోలు తెరిచి ఉంటాయి.1963లో జాన్ ఎఫ్ కెన్న‌డీ అంత్య‌క్రియ‌లు రోజున మాత్ర‌మే క్యాసినోల‌ను మూసివేశారు.మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనా భ‌యంతో వాటిని లాక్‌డౌన్ చేశారు.

వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్‌ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.

టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీర్‌) ఛార్జీల చెల్లింపు విషయంలో ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కోర్టు మొట్టికాయలు వేసింది.‘‘అసలు ఎవరు సమీక్షించమన్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బకాయిలు వసూలు చేయడంలో ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఛార్జీల పునఃసమీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం బుధవారం ఈ అంశంపై విచారణ జరిపింది. ఒకవేళ పునఃసమీక్షని అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునఃసమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది.

అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-18) వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. చైనాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. తొలుత మార్చి 27 వరకే తమ రిటైల్‌ స్టోర్లను మూసివేయనున్నామని ప్రకటించిన ఆ సంస్థ.. తాము తిరిగి ప్రకటించేంత వరకూ స్టోర్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి దిగజారిపోయాయి. ఉదయం 11.46 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 789 పాయింట్లు నష్టపోయి.. 29,776 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 8,732 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వైరస్‌ ప్రభావంతో మదుపరులు భయాలకు లోనవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ పద్దులన్నీ సరిగ్గానే ఉన్నందున ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం లేదని యెస్‌ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టరుగా (ఎండీ) నియమితులైన ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. నిధుల లభ్యత విషయంలోనూ ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి బ్యాంకు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరుగుతాయని అన్నారు. యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా ప్రశాంత్‌ కుమార్‌ 26న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌, ఫెడ్‌రల్‌ బ్యాంక్‌ సీఎఫ్‌ఓ అశుతోష్‌ ఖజూరియాతో కలిసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మేం తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని ఏటీఎంల్లో డబ్బులు ఉన్నాయి. శాఖల్లోనూ నిధుల కొరత లేదు. మొత్తానికి యెస్‌ బ్యాంక్‌కు సంబంధించి ఎలాంటి నిధుల సమస్య లేద’ని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిధుల కోసం ఇతర బయటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మారటోరియం తొలగిపోయాక.. పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవల అనుభూతిని వినియోగదారులు పొందొచ్చని తెలిపారు. డిపాజిట్ల భద్రతపై డిపాజిటుదార్లు ఆందోళన చెందనక్కర్లేదని కూడా ఆయన భరోసా కల్పించారు. అయితే సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న అత్యధిక 5-6% వడ్డీని కొనసాగించడంపై ఆయన హామీ ఇవ్వలేనన్నారు. మారటోరియం ఆంక్షలు తొలగింపుతో బ్యాంకు శాఖలకు ఖాతాదారులు డిపాజిట్లను వెనక్కి తీసుకునే నిమిత్తం పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.

ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చివ వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఏవైనా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ప్రకటించింది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని తప్ప ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు కాదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరస్‌ బారిన పడకుండా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం జరిగిన ఘటనల్లో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ సమయంలో ముఖ్యంగా రిలయన్స్‌ దుకాణాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును సైతం వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో కరోనా విస్తరణ వల్లే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వైరస్‌ నియంత్రణపై వైకాపా ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.

మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందరికీ అందుబాటులోకి ఉండేందుకు, వాటి ధరలు, అమ్మకాలలో అక్రమాలను నివారించేందుకు ఈ వస్తువులను నిత్యావసరాలుగా ప్రకటించింది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్‌ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు కాపీ విడుదలైంది. తీర్పు కాపీలో విచారణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పేర్కొంది. స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో ఎక్కడచూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్‌తో ప్రజలు తమ దూర ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన వారిని కొన్నిరోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంత అప్రమత్తంగా ఉన్న సమయంలో ‘హోం క్వారంటైన్‌’ కావాల్సిన కొందరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేయడం కలకలంరేపింది. ఇది గమనించిన సిబ్బంది వారిని అక్కడే రైలు నుంచి దించేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. వైరస్‌ బాధితులకు చికిత్సలు చేసిన వైద్యులను సైతం కరోనా విడిచిపెట్టడం లేదు. వైరస్‌ బాధితులతో పాటు వైద్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అయినా, వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈమేరకు ఓ వైద్యుడి భార్య ఈ వైరస్‌ తమ జీవితాలను మార్చేసిన విధానాన్ని ట్విటర్లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్లు నెటిజన్లను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన రాచెల్‌ పాట్జెర్‌ భర్త ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆమె రెండు వారాల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను తన భర్త కనీసం తాకనైనా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్‌ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.

రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తన సారథ్యంలో 2008లోని ‘మంకీ గేట్‌’ వ్యవహారమే అత్యంత ఘోరమైందని ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. అది చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులు తన నియంత్రణలో లేకుండా పోయాయని వెల్లడించాడు. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌పై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు మూతపడగా తాజాగా ఐఐటీ బాంబేను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని, విద్యార్థులు కూడా రెండురోజుల్లో హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. క్యాంపస్‌లోకి ఏ ఒక్కరినీ అనుమతించబోమని, కొందరు విదేశీ విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

కాలేజీ యాజమాన్యాలు అండదండలతో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారనే కచ్చితమైన సమాచారంతో టోలిచౌకి లోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లో కలిసి దాడి చేసి ఎనిమిది మంది మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్క విద్యార్ధి వద్దనుండి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు డబ్బును ఒక్క పేపర్ కోసం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు, పరీక్ష రాసే సమయంలో అందరిలాగానే వారికి కూడా సమాధాన పత్రాన్ని ఇచ్చి ఎగ్జామ్ లో కూర్చో పెడుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లను కళాశాల ఉపాధ్యాయులతో రాయించిన పిమ్మట చివరికి విద్యార్థుల చేతికి అందిస్తున్నట్టు ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో గల రామానంద నగర్ దొంగతనం అధికారి రాజశేఖర్ ఇంట్లో గత రాత్రి దొంగలు పడ్డారు మూడున్నర తులాల బంగారం 62 తులాల వెండి ఆభరణాలతో పాటు 75 వేల రూపాయలు క్యాష్ అపహరణ ఇంటి యజమానులు ఊరికి వెళ్లడంతో ఉదయం వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్

లీగల్ అడ్వైజర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ కావలి మునిసిపల్ ఉద్యోగి విషయం కలకలం రేపింది. కావలి మున్సిపాల్టీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జంషేర్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది.

బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని సూరత్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానంలో వచ్చిన గణేశ్‌ వలోద్రా అనే వ్యక్తి బ్యాగును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న సూట్‌కేసు కవర్‌లో 500 గ్రాముల బంగారు రేకులు దాచినట్లు గుర్తించి..సీజ్‌ చేశారు.

రేవంత్ రెడ్డి కోసం భారీ సంఖ్యలో చర్లపల్లి చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలను చెల్లాచెదురు చేస్తున్న పోలీసులు. రేవంత్ రెడ్డిని జైలునుంచి ఎస్కార్టుగా ఆయన్ను ఇంటివద్ద దించే వ్యూహరచనలో పోలీసులు. రేవంత్ రెడ్డిని తరలించే రూటును గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.

Continue Reading

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(11-03-2020)

Published

on

By

వారణాసిలోని ప్రహ్లాదేశ్వర స్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేశారని.. ఇప్పుడు వాటిని తొలగించడానికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆ డబ్బు వైకాపా నేతలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా పాఠశాల వసతుల కల్పనపై సీఎం జగన్‌ ఎలా మాట్లాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువులపై సీఎం మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ జగన్‌కు వర్తించదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరు రకాల వస్తువులు విద్యాకానుకలో ఉండనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మూడు జతల యూనిఫామ్స్‌, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌లో ఉంచాలని సీఎం సూచించారు. విద్యార్థులకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. డిజిటల్‌ విద్యాబోధనకై ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం బలం, బలహీనతలు ఏంటో తనకు తెలుసని బీటెక్‌ రవి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌నేత జ్యోతిరాదిత్యసింధియా రాజీనామా చేసిన సంగతి విదితమే. త్వరలోనే ఆయన భాజపాలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సింధియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ద్వారా తన నానమ్మ కోరిక తీర్చాడని ఆయన మేనత్త వసుంధరరాజే అన్నారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ భాజపా నేత అయిన వసుంధర మాట్లాడుతూ కుటుంబమంతా కలిసిఉండాలని చనిపోయేముందు తన తల్లి విజయరాజేసింధియా కోరిందని ఆమె తెలిపారు.

ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ఈసీ పరిధిలోని అంశమని అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చీకటి పాలనలో అన్నీ నల్లచట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్థులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని యనమల దుయ్యబట్టారు.

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రాఘవా లారెన్స్‌ తమ్ముడు వినోద్‌ తనను వేధిస్తున్నాడని జూనియర్‌ ఆర్టిస్టు దివ్య ఫిర్యాదు చేశారు. వరంగల్‌కు చెందిన ఆమె రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. వినోద్ ప్రేమను తిరస్కరించడంతో తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తెలిపారు. లైంగికంగా వేధించడంతోపాటు వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారి ఆ దేశం వెలుపల అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే 100 దేశాలకు పైగా ఈ వైరస్‌ విస్తరించింది. ఇక ఇటలీ, ఇరాన్‌ దేశాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 54 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 291కు పెరిగింది. ఇరాన్‌ వ్యాప్తంగా 8వేలకు పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కరోనావైరస్‌ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ అస్తులకు 5.8 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్‌ మా వచ్చి చేరారు.

నేటితరం యువత తమ భావాలను ఎప్పటికప్పుడు సమాజంతో పంచుకోవాలనుకుంటోంది. ఇందుకు తమకు ఉన్న సులభమైన మార్గం సోషల్‌ మీడియా. చాలామంది సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో తన వినియోగదారుల కోసం వినూత్నమైన ఫీచర్లను ప్రవేశపెట్టే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే క్రాస్‌ పోస్టింగ్‌. అదేంటో చూసేయండి.

కరోనావైరస్‌ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ అస్తులకు 5.8 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్‌ మా వచ్చి చేరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గింది. అంతే కాకుండా చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఉత్పత్తి ధరల యుద్ధం దీనికి మరో కారణమైంది. దీంతో చమురు ధరలు 29 సంవత్సరాల కనిష్ఠానికి క్షీణించాయి. చమురు ధరల ప్రభావం అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌పై పడింది. ఈ భారతీయ దిగ్గజ సంస్థ షేర్ల విలువ సోమవారం 12 శాతం వరకూ పడిపోయాయి. అదే సమయంలో కరోనా ప్రభావం చైనా ఆధారిత సంస్థ అలీబాబాపై కూడా పడినప్పటికీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా వాణిజ్యం పుంజుకోవటంతో ఆ నష్టం భర్తీ అయింది. ఈ పరిణామాల అనంతరం ప్రస్తుతం జాక్‌ మా ఆస్తుల విలువ 44.5 బిలియన డాలర్లు కాగా.. ఇది ముకేశ్‌ కంటే 2.6 బిలియన్‌ డాలర్లు అధికం.

కార్పొరేట్‌ రుణాల బకాయిలు, అంతర్గత అవకతవకల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన యెస్‌బ్యాంక్‌లో సమూల మార్పులు తీసుకురావాలని అడ్మిన్‌స్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. దీనిలో భాగంగా కార్పొరేట్‌ రుణాలను విక్రయించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. బ్యాంక్‌ను కార్పొరేట్‌ రుణ వ్యాపారం నుంచి రిటైల్‌ లోన్‌ వ్యాపారం వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. ఆర్‌బీఐ హామీ ఇచ్చాక బ్యాంక్‌ ఏటీఎంల వద్ద క్యూ తగ్గిందన్నారు. బ్యాంక్‌పై ప్రజలకు నమ్మకం తగ్గలేదని ప్రశాంత్‌కుమార్‌ చెప్పారు. ఎస్‌బీఐ 49శాతం పెట్టుబడి పెట్టనుండటం బ్యాంక్‌పై తొలుత నమ్మకాన్ని పెంచిందన్నారు. దీంతోపాటు బ్యాంక్‌ రిసొల్యూషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండటం, దీనికి ఆర్‌బీఐ, ఎస్‌బీఐ మద్దతు ఉండటంతో ప్రజలు కొంత స్థిమితపడ్డారని వెల్లడించారు. వీటికి తోడు బ్యాంక్‌ మూలధన సేకరణ ప్రణాళికలు సిద్ధం కావడం ప్రజల్లో విశ్వాసం పెంచిందని వివరించారు. మార్చి14వ తేదీన బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. డిపాజిట్లను విత్‌డ్రాచేసుకొనే కస్టమర్ల అవసరాలు తీర్చడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.

82శాతం మంది మహిళలు వారి పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘గ్రో’ సర్వేలో వెల్లడయింది. ఈ సర్వేలో 26వేల మంది మహిళలు పాల్గొనగా 43శాతం మంది సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇక అత్యధికంగా.. 25శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 13శాతం, పెన్షన్‌ పథకాల్లో 9శాతం మంది మహిళలు పెట్టుబడులు పెట్టినట్టు ఈ సర్వేలో వెల్లడైంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం. లక్ష్మీ అనే వివాహిత హత్య. మృతదేహం ఎదుట దీపం, పసుపు కారం. కాలి వేళ్ళు కత్తిరింపు. ప్రతీకారమా. క్షుద్రతతంగమా?కొనసాగుతున్న దర్యాప్తు.

వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్ది పై బీరు బాటిళ్ళతో టీడీపీ కార్యకర్తల దాడిక్షతగాత్రుని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుకైనా వైద్యం కోసం గుంటూరు తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

పాల వ్యాన్‌ను లారీ ఢకొన్న ఘటన మంగళవారం ఉదయం పెదపాడు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పెదపాడు జాతీయ రహదారిపై, పాల వ్యాన్‌ను, లారీ ఢకొనడంతో, వ్యాన్‌ బోల్తాపడింది. పాల ప్యాకెట్ల సరుకంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. వ్యాన్‌లో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయమేమీ జరగలేదు.

ఇద్దరూ డాక్టర్లు.. ప్రేమ వివాహం చేసుకున్నారు! సొంత ఆస్పత్రి ఉంది!! వారి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా పదేళ్ల బాబు ఉన్నాడు. అన్నీ ఉన్నా.. అందరి జీవితాల్లో లాగే వారి జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోతే.. భార్య మీద కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు! తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకుని.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చుకుని ఉసురుతీసుకున్నాడు. హైదరాబాద్‌ కాప్రా పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన విషాదమిది. బలవన్మరణానికి పాల్పడిన ఆ వ్యక్తి.. దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య హాస్పటల్స్‌ ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌. సిద్దిపేటకు చెందిన డాక్టర్‌ రవీంద్రకుమార్‌ (42) ఆయన భార్య స్మిత(36)ది ప్రేమ పెళ్లి.

హనుమంతుని పేట రైల్వే గేట్ దగ్గర, మాస్టర్ సిద్ధార్థ స్కూల్ టాటా ఏసీ వ్యాన్ బోల్తా. 15మంది విద్యార్థులకు గాయాలు. 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఇద్దరు ఏసీ మెకానిక్‌లు ఘర్షణపడి గొడ్డలితో దాడి చేసుకున్న ఘటన మంగళవారం కాకినాడలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాల త్రిపుర సుందరి గుడి, ఘంటసాల విగ్రహం వద్ద ఇద్దరు ఏసీ మెకానిక్‌లు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి గొడ్డలితో అవతలి వ్యక్తిని నరకడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలోనే ఈ పరస్పర దాడులు చేసుకున్నట్లు సమాచారం. తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. 1,68,750 రూపాయలు విలువ చేసే గుట్కాస్ స్వాధీనం. ముగ్గురి అరెస్ట్, వాహనం స్వాధీనఒ.

Continue Reading

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(10-03-2020)

Published

on

By