Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(14-02-2020)

Published

on

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బకాయి వెంటనే చెల్లించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. రెహమాన్‌ చెల్లించాల్సిన పన్ను రూ.6.79కోట్లు, జరిమానా మరో రూ.6.79కోట్లతో సహా చెల్లించాల్సిందిగా జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి. రెహమాన్‌ తన ఆర్జనకు తగినట్టుగా పన్ను చెల్లించడం లేదని జీఎస్టీ కమిషనర్‌ (చెన్నై సౌత్‌) కేఎం రవిచంద్రన్‌ అన్నారు. ‘‘చలన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చటంతో పాటు దేశ విదేశాల్లో బహిరంగ ప్రదర్శనలతో, రాయల్టీల ద్వారా కూడా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయ మార్గాలన్నీ వస్తుసేవల పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, ఈ సంగీత దర్శకుడు వాటికి పన్ను చెల్లించలేదు’’ అని రవిచంద్రన్‌ వివరించారు. ‘రెహమాన్‌ తన ట్యూన్లకు యజమాని అనే మాట నిజమే కాకుంటే.. నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సంగీతానికి సంబంధించి అన్ని హక్కులు నిర్మాతలకే చెందుతాయి.. అందువల్ల అవి సేవాపన్ను పరిధిలోకి వెళ్లవు’ అని రెహమాన్‌ తరపు న్యాయవాది వివరించారు. కాగా, ఆదేశాల అమలును మార్చి నాలుగోతేదీ వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని రెహమాన్‌ మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

దేశీయంగా తయారీని పెంచడం, విదేశీ దిగుమతులను తగ్గించుకోవడంలో భాగంగా అవసరంలేని వస్తువుల జాబితాలో ఉన్న టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంబంధిత ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సంబంధిత దిగుమతిదారు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. 2018-19 మధ్య కాలంలో సుమారు ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన టీవీ ఉత్పత్తులు దేశంలోకి దిగుమతయ్యాయి. భారత్‌కు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.. వియత్నాం, మలేసియా, హాంకాంగ్‌, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, జర్మనీ దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగా తయారీని పెంచడంలో భాగంగా ఫర్నీచర్‌ దిగుమతులపైనా ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

కరోనా భయాలను అధిగమించి రెండు రోజుల పాటు లాభాల్లో పయనించిన మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఉదయం 9.55గంటల సమయంలో సెన్సెక్స్ 87 పాయింట్లు నష్టపోయి 41,478 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు దిగజారి 12,171 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.18 వద్ద కొనసాగుతోంది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేళ్ల గరిష్ఠానికి చేరడం, డిసెంబరు పారిశ్రామికోత్పత్తి వృద్ధి క్షీణించడం వంటి వార్తలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టైటాన్‌ కంపెనీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌ కంపెనీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

నాట్కో ఫార్మా అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.513 కోట్ల ఆదాయాన్ని, రూ.104.40 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2018-19 ఇదేకాలంలో ఆదాయం రూ.580 కోట్లు, నికరలాభం రూ.159.30 కోట్లు ఉన్నాయి. హెపటైటిస్‌-సీ ఔషధ విభాగానికి అనుగుణంగా లాభాలు తగ్గాయని కంపెనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.1,545 కోట్లు కాగా, లాభం రూ. 364.90కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌పై రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఈ నెలాఖర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా వెల్లండించింది. కానీ, ఆయన పర్యటనకు సంబంధించిన ప్రత్యేక తేదీలను మాత్రం ప్రస్తావించలేదు. ‘ఈ నెలాఖర్లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారత పర్యటనకు వస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులు, యువత, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు’ అని మైక్రోసాఫ్ట్‌ అధికారులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ఫిబ్రవరి 24-26 మధ్య తేదీల్లో రావచ్చని తెలుస్తోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నం, దిల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పే సమాఖ్య స్ఫూర్తితో దేశం నడిచే రోజు వస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన నిధులపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ‘యాక్షన్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని హితవు పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఉనికే లేదని.. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా పరాజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలపై తన అంచనా తప్పయిందన్నారు. గెలుపోటముల కోసం ఎన్నికల్లో తలపడలేదన్న ఆయన.. తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. దిల్లీ ఎన్నికల ఫలితాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ప్రజలు ఇచ్చిన తీర్పుకాదన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ నాయకులు కొందరు ‘గోలీమారో, ఇండో-పాక్‌ మ్యాచ్‌’ వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

వంట గ్యాస్ ధరను భారీగా పెంచిన నేపథ్యంలో భాజపాకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. యూపీఏ హయాం నాటి భాజపా నేతల ఫొటో షేర్‌ చేస్తూ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో వంట గ్యాస్‌ ధరను పెంచినప్పుడు భాజపా నేతలు స్మృతి ఇరానీ తదితరులు రోడ్లపైకి చేరి గ్యాస్‌ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్‌ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన ‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అని చిన్నారికి చెప్పింది.

బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌ గురువారం నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్‌ జావిద్‌ తన పదవికి రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. రిషి సునక్‌ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత సంతతికి చెందిన 39 ఏళ్ల రిషి సునక్‌.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు.

ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు కాసులు రాబట్టుకొనే లక్ష్యంతో వినూత్న పథకంతో ముందుకొచ్చింది యూపీలోని నోయిడా మెట్రో. బర్త్‌డే పార్టీ.. ప్రీ వెడ్డింగ్‌.. ఇలాంటి కార్యక్రమాలేవైనా మెట్రో రైలులోనే జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. గౌతమబుద్ధ నగర్‌ జిల్లాలోని జంట నగరాల మధ్య సేవలందిస్తున్న నోయిడా మెట్రో.. ఇప్పటికే స్టేషన్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు, ఫొటోగ్రఫీలను అనుమతిస్తోంది. తాజాగా మెట్రో రైళ్లలో పుట్టినరోజు వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకొనే వెసులుబాటును కూడా కల్పించనున్నట్లు పేర్కొంది.

భారత క్రికెట్లో అత్యుత్తమ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అని వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా అన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ డ్రస్సింగ్‌ రూమ్‌లో అతడి ప్రభ ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నాడు. ‘ది సూపర్‌ కింగ్స్‌ షో’ అనే కార్యక్రమంలో రైనా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి. సారథిగా ఎంఎస్‌ ధోనీ మూడు సార్లు ఆ ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సురేశ్‌రైనా ఒకప్పుడు పరుగులు వరద పారించిన సంగతి తెలిసిందే.

సామాన్యులను ఆర్థికంగా చిదిమేస్తున్న మట్కా, పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 8 పోలీసు సబ్‌ డివిజన్లలో ముమ్మరంగా దాడులు చేశారు. తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి, గుత్తి తదితర ముఖ్య పట్టణాల్లో నియంత్రణకు ప్రత్యేక నిఘా వేశారు. గత నెలలో మట్కా నిర్వాహకులపై 432 కేసులు, పేకాట ఆడుతున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు.

రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఏపీ మంత్రి తానేటి వనిత పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో అసైన్డ్‌ భూమి పొందటం కోసం తన లెటర్‌ ప్యాడ్‌పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి సిఫార్సు లేఖ వలే కలెక్టర్‌కు పంపినట్టు పేర్కొన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె కోరారు.

క‌ర్నాట‌క‌లో ఇవాళ బంద్ పాటిస్తున్నారు. స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్రానికి చెందిన అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక క‌న్న‌డీయుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని ప‌లు సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఆ కోటా ఉండాల‌ని క‌న్న‌డ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ బంద్ నేప‌థ్యంలో.. ఫరంగిపేట వ‌ద్ద ఓ బ‌స్సుపై రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సు ఆ దాడిలో ధ్వంస‌మైంది. క‌న్న‌డ ఐక్య కూట‌మి ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగుతున్న‌ది. బెంగుళూర్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బంద్ పాటిస్తున్నారు. ఓలా, ఊబ‌ర్ డ్రైవ‌ర్లు కూడా బంద్‌కు స‌హ‌క‌రిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో గత నాలుగైదు రోజుల నుంచి పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. గుడిపాల బంగారుపాలెం మండలంలోని పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. అలాగే గుడిపాల మండలం లోని పళ్లూరు, పానాటూరు, ముత్తువాళ్ళ ఊరు, పిళ్ళారి కుప్పం, బట్టువాళ్ళ గ్రామాల్లో ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అటు బంగారుపాలెం మండలంలోని కీరమంద, టేకుమంద గ్రామాల్లోని పంటపొలాలపైనా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.

ఓ కుక్క నిరంతరం మొరుగుతుందని.. దాని యజమానురాలిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మహిళ కుక్కను పెంచుకుంది. ఇతరులను చూస్తే ఆ శునకం నిరంతరం మొరుగుతూనే ఉంటుంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన పక్కింటివారు కుక్క యజమానురాలిని కొట్టారు. దాడి చేసిన కాసేపటికే ఆమెకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితురాలు చనిపోయిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ఉన్నతాధికారి తన భార్యపై దాడికి పాల్పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్‌డీఓపీ మునావర్‌ మాట్లాడుతూ..బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నరేంద్రసూర్యవంశీపై కిడ్నాప్‌, రేప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. గంధ్వాని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి నరేంద్ర సూర్యవంశీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో..అతని భార్య వద్దని వారించింది. దీంతో నరేంద్రసూర్యవంశీ అతని భార్యపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు కలగజేసుకుని ఆ మహిళను రక్షించారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వారం క్రితం లోకేష్ అనే యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు లక్షలు ఇవ్వాలంటూ లోకేష్ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. కాగా లోకేష్‌ను విశాఖ జిల్లా భీమిలికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అతడిని కొట్టారు. దీంతో లోకేష్‌కు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే అతడిని కిడ్నాపర్లు భీమవరంలో వదిలేశారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన లోకేష్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారమే కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈరోజు ఉదయం పాదాచారులు నడిచే వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వంతెన కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నవాబ్‌పేటలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇంటి ముందు ముగ్గులు వేసి, కోడిగుడ్లు పగులకొట్టారు. దీంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. క్షుద్ర పూజలు స్థానికులను సైతం కలవరానికి గురిచేశాయి.

FAST NEWS

నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది:

Published

on

బాలీవుడ్ లో నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది: ఏఆర్ రెహమాన్

బాలీవుడ్ లో బంధుప్రీతిపై స్పందించిన రెహమాన్

సమయానికి ట్యూన్లు ఇవ్వడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి

దిల్ బేచారా దర్శకుడికి తనపై చాడీలు చెప్పారన్న రెహమాన్

భారతదేశ ఖ్యాతిని ఆస్కార్ యవనికపై రెపరెపలాడించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలను ఓ గ్యాండ్ అడ్డుకుంటోందని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ, సినిమాలు తనవరకు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.

సకాలంలో బాణీలు ఇవ్వడంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ ముఠానే కారణమని అన్నారు.

సుశాంత్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని, రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఆ చిత్ర దర్శకుడు ముఖేశ్ ఛాబ్రాకు పలువురు చెప్పారని, కానీ ఛాబ్రాకు 48 గంటల్లో 4 పాటలకు ట్యూన్లు ఇచ్చానని రెహమాన్ తెలిపారు.

తాను మంచి సినిమాలను ఎప్పుడూ వదులుకోవాలని భావించలేదని, మ్యూజిక్ లవర్స్ తననుంచి ఎంతో ఆశిస్తుంటే ఓ గ్యాంగ్ అందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Continue Reading

FAST NEWS

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి…

Published

on

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: బీజేపీకి ఉద్ధవ్ థాకరే సవాల్

మా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది

బీజేపీతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు

చైనా మనకు మిత్రదేశంగా మారొచ్చేమో

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, రాజస్థాన్‌లో కూల్చేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉద్ధవ్.. బీజేపీపై నిప్పులు చెరిగారు.

ఆ పార్టీతో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు.

తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు.

చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు.

ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు.

కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.

Continue Reading

FAST NEWS

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

Published

on

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

కృష్ణా: వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడారు. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్‌ మరణానికి కారణమయ్యారు. నలంద కిషోర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in