Connect with us

National

గ్రంధాలయాల ద్వారా జ్ఞాన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి..

Published

on

 

తమిళనాడు, ఫిబ్రవరి 13 VSB NEWS :

కోహోర్ట్ 3 ఇనాలి ఇండియా మరియు దక్షిణ ఆసియా అంతర్జాతీయ సమావేశం కన్వీనింగ్

తమిళనాడు రాష్ట్రం తిరుచిరపల్లి జిల్లా సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. M.S స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ మరియు బిల్ గెట్స్ వారి సహాకారంతో “స్మార్ట్ కలుపుకొని పరిజ్ఞానం మరియు స్థితిస్థాపక సంఘాలను నిర్మించడం” సుస్థిరమైన అభివృద్ధి ద్వారా గ్రామీణ గ్రంధాలయాలు అభివృద్ధి జరగాలని వాటిపై 6 రోజులు శిక్షణ కార్యక్రమం 7.2.2020 నుండి 12.2.2020 వరకు సదస్సుకు జరిగింది ఈ సదస్సులో బంగ్లాదేశ్, తమిళనాడు,శ్రీలంక‌, మియమ్మర్,మాల్దాదీవులు,రాజస్తాన్, పంజాబ్,నేపాల్, సింగపూర్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆశయ యూత్ అసోషియేషన్ అధ్యక్షులు రెడ్డి రమణ హాజరయ్యారు చీపురుపల్లి ప్రాతంలో గ్రామీణ గ్రంధాలయాలు నిర్వహిస్తు కమ్యూనిటీ అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతు విద్యార్థులకు పఠనంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు ఈ సదస్సుకు అవకాశం వచ్చింది అని అన్నారు.

తిరుచిరపల్లి జిల్లా గ్రంధాలయంలో అతి పెద్దది అందులో ప్రజలకు యువతకు పిల్లలకు వృద్ధులకు మహిళలకు అన్ని రంగాల వారికి గ్రంధాలయాంలో అనుకంణంగా అభివృద్ధి చేసారు, మండల లైబ్రరీ, తొట్టియం, తొరియం వంటి గ్రామంలో పర్యటించి వారు చేసిన గ్రంధాలయలు అభివృద్ధి చూపించారు..

అనంతరం. జిల్లా గ్రంధాలయా అధికారి A.P. శివకుమార్ వ్యూహాత్మక ప్రోగ్రామ్ లీడ్ ఇనేలి ఇండియా & సౌత్ ఆసియా ప్రియాంక మోహన్ ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ ప్రసంస ప్రతం అందజేశారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

National

టుడే న్యూస్ అప్డేట్స్

Published

on

ఆంధ్రప్రదేశ్  , ఫిబ్రవరి 16 , VSB NEWS :

టుడే న్యూస్ అప్డేట్స్

జాతీయం

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం..

ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌..

రాంలీలా మైదాన్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు..

నేడు వారణాసీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

నేడు అమిత్‌ షా నివాసానికి షహీన్‌ బాగ్‌ నిరసనకారుల ర్యాలీ..

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ అమిత్‌ షా నివాసానికి షహీన్‌ బాగ్‌ నిరసనకారుల ర్యాలీ..

తెలంగాణ

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్‌ భేటీ..

నేడు హైదరాబాద్‌ రానున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

కేంద్ర బడ్జెట్‌పై మీడియాతో  మాట్లాడనున్న నిర్మలా సీతారామన్‌..

సహకార ఎన్నికలకు పూర్తయిన పోలింగ్‌..

నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల నియామకం

 

Continue Reading

National

నిర్భయ కేసును విచారిస్తూ స్పృహ కోల్పోయిన సుప్రీంకోర్టు జడ్జి

Published

on

 

న్యూఢిల్లీ , ఫిబ్రవరి 15 VSB NEWS :

నిర్భయ కేసును విచారిస్తూ స్పృహ కోల్పోయిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి

ఈరోజు నిర్భయ కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును వెలువరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి ఆమె పడిపోయారు. దీంతో, కోర్టు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు. ఛాంబర్ లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనికి ముందే దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిన్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

Continue Reading

National

రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వైద్య బీమా

Published

on

 

న్యూఢిల్లీ , డిసెంబర్ 18 , VSB NEWS :

ఢిల్లీలో ఓట‌ర్లుగా ఉన్న లాయ‌ర్ల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ కానుక ఇచ్చింది.

న్యాయ‌వాదుల‌కు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వైద్య బీమా క‌ల్పించ‌నున్న‌ట్లు ఇవాళ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు.

లాయ‌ర్ల‌కు రూ. 10 ల‌క్ష‌ల జీవిత బీమా కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

కోర్టు ఆవ‌ర‌ణ‌ల్లో ఈ-లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

న్యాయ‌వాదుల డిమాండ్ల‌ను6 ప‌రిష్క‌రించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

వారి సంక్షేమం కోసం త‌మ ప్ర‌భుత్వం 50 కోట్లు కేటాయించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

అయితే ఆ నిధుల‌ను ఎలా వాడాల‌న్న దానిపై క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు.

క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను క్యాబినెట్ ఆమోదించిన‌ట్లు సీఎం చెప్పారు.

తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల గురించి ఆయ‌న స్పందించారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం ఉన్న‌వాళ్లే ఆ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు.

Continue Reading

Trending

www.vsbnews.in