Connect with us

Hi, what are you looking for?

Politics

వైసీపీ వేధింపులకు మొన్నటి వరకు దళితులు.. ఇప్పుడు మైనారిటీలు వంతు

శ్రీకాకుళం జిల్లా ,ఆంధ్రప్రదేశ్ , నవంబర్ 10

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

సలాం కుటుంబాని అండగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆందోళనలు

వైసీపీ వేధింపులకు మొన్నటి వరకు దళితులు.. ఇప్పుడు మైనారిటీలు వంతు

నంద్యాలలోని సలాం కుటుంబాన్ని వైసీపీ నాయకులు ఏడాదిగా వేధించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వైసీపీ నాయకుల వేధింపుల కోసం మొన్నటిదాకా దళితులకు, ఇప్పుడు మైనారిటీలపై పడ్డారు.

సస్పెండ్ చేసినట్లు, కేసు పెట్టినట్లు సీఎం జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారు. బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టి, బెయిల్ వచ్చాక ప్రజా సంఘాల వ్యతిరేకత చూసి బెయిల్ రద్దుకు అప్పీల్ చేయడం జగన్నాటకమే అవుతుంది.

సలాం కుటుంబానికి అండగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాందోళనలకు పిలుపునిస్తున్నాం.

అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

గతంలో రెండుసార్లు సలాం ఆత్మహత్యా యత్నం చేశాడంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది.

రాష్ట్రంలో వేలమంది సలాంలు ఉన్నారు.

పోలీసు అధికారుల కాల్ లిస్ట్ బైటపెట్టాలి, వారిని సర్వీసు నుంచి తొలగించాలి.

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మృతులకు ఇచ్చిన పరిహారం నంద్యాల సామూహిక ఆత్మహత్య మృతుల కుటుంబానికి ఇవ్వాలి.

వైసిపి ప్రభుత్వం ఏడాదిన్నరగా ముస్లిం మైనారిటీలకు రూపాయి కూడా ఇవ్వలేదు.

మసీదు మరమ్మతులు, షాదీఖానాల నిర్మాణాల డబ్బులు అన్నీ ఆపేశారు.

రంజాన్ తోఫా, దుల్హన్ డబ్బులన్నీ ఆపేశారు.

వైసీపీ దమనకాండను ప్రతి నియోజకవర్గంలో గర్హించాలి.

సెల్ఫీ వీడియో లేకపోతే కుటుంబ కలహాలతో అబ్దుల్ సలాం కుటుంబం చనిపోయినట్లు వైసీపీ నాయకులు చిత్రీకరించేవారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఆపలేని డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలి.

ముస్లిం సమాజానికి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

ఈ సంఘటనకు కారకుడైన గోల్డ్ షాప్ యజమాని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

సీఐని సస్పెండ్ చేస్తే సాక్షిలో ముస్లింలు హర్షం వ్యక్తం చేసినట్లు రాస్తారా..?

సామూహిక ఆత్మహత్యకు కారకులైన అసలు నేరస్తులను శిక్షించకుండా ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తారా..?

రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన సత్తార్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదు.

వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

అబ్దుల్ సలాంను మతం పేరుతో దుర్భాషలాడటం, నమాజ్ కు వెళ్తే కాళ్లు విరగ్గొడతాం అనడం హేయం.

పల్నాడులో 100 ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు.

గుంటూరులో పునరావాస సంక్షేమ పథకాలను నిలిపేసి మైనారిటీలను వైసీపీ పచ్చి మోసం చేసింది.

దాడులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేస్తోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...

Devotional

ఏడవ అధ్యాయం ‘ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం...

Politics

– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....