Connect with us

News

ఏపీ మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 13 , VSB NEWS :

ఏపీ మంత్రి తానేటి వనిత లెటర్ హెడ్‌తో పాటు ఆమె సంతకం ఫోర్జరీ అయ్యింది. కడపకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఆమె లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాశాడు. రెడ్డప్పకు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు నకిలీ సిఫార్సు లేఖ ఇచ్చాడు. మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప దొరికిపోయాడు.  ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో మంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. దీనిపై హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తన లెట్ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపీ అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఐకమత్యమే బలమని చాటిన బలభద్రపురం…

Published

on

By

బిక్కవోలు , ఆగస్టు 11 , VSB NEWS :

బిక్కవోలు ఆగస్ట్ 10  బిక్కవోలు మండలం బలభద్రపురం లో రోజు రోజు కు కరోనా కేసులు పెరుగుతుండడం తో గ్రామస్తులు ఆందోళన కు గురవుతున్నారు.దీనికి కారణం అందరూ గుంపులు గుంపులు గా తిరగడం వల్ల కరోనా తొందరగా వ్యాప్తి చెందడం జరుగుతుందని,అలాగే పక్క గ్రామాల్లో చికెన్ మటన్ హోటల్స్ మూత పడడం వలన అందరూ బలభద్రపురం వచ్చి కొనుగోలు చెయ్యడం జరుగుతుంది.అలాగే వ్యాపార కూడలిలో గుంపులు గా చేరి ఉండటం వలన కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని  గ్రామ పెద్దలు గ్రామాన్ని రక్షించుకోవలనే ఉద్దేశ్యంతో 14 రోజులు లాక్ డౌన్ స్వచ్ఛందంగా పాటించాలని నిర్ణయం తీసుకోగా దానికి అందరూ మద్దతు ఇచ్చి స్వచ్చంద లాక్ డౌన్ పాటించడం తో గ్రామంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.బలభద్రపురం ఐక్యత చూసి పక్క గ్రామాలు నివ్వెర పోతున్నాయి.పార్టీలకు అతీతం గా జరుగుతున్న ఈ లాక్ డౌన్ లో గ్రామస్తులందరు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని రక్షించు కొంటామని చెప్పడం విశేషం.

Continue Reading

News

25 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

Published

on

25 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి

ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
కందుకూరు vsb న్యూస్. ఆగస్టు
కందుకూరు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో నియోజకవర్గానికి ఐదో విడత వచ్చిన 25 టన్నుల బ్లీచింగ్ పౌడర్ రెండు లోడ్లసున్నాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డిఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కష్టంతో బ్లీచింగ్ పౌడర్ సున్నాన్ని ఇచ్చామని అన్నారు అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు ప్రాంతాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని అన్నారు ఇదే సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ కందుకూరు క్వారం టైన్సక్రమంగా ఉన్నాయని శనివారం తాను స్వయంగా మాట్లాడానని పరిస్థితులు బాగానే ఉన్నాయని అన్నారు ఏరియా వైద్యశాలకు ఆక్సిజన్ ప్లాంట్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి రెండు సార్లు కరోనా గదిలో తను పని చేయలేననిచెప్పడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కందుకూరు ప్రాంతంలో కరోనా కట్టడికి నిరంతరం అధికారులు పోలీసులు ప్రజలు సహకరిస్తున్నారన కరోనా నుి కొంతకాలం లోనియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఎంపీడీవోలు విజయశేఖర్ రపిక్ అహ్మద్ రవికుమార్ మాలకొండయ్య వెంకటేశ్వర్లు వైసిపి నాయకులు చక్కా వెంకట కేశవ రావు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

News

వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి అనుభవం తో చెప్తున్నా

Published

on

*వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి అనుభవం తో చెప్తున్నా కందుకూరు పట్టణం ఎస్ఐ తిరుపతిరావు*
కందుకూరు vsb న్యూస్ ఆగస్టు
కరోనాతో షుమారు నెల రోజులు పోరాడి జయించి వచ్చి మళ్ళీ విధులు చేపట్టిన కందుకూరు పట్టణ ఎస్ఐ తిరుపతి రావు గారిని ఈ రోజు కందుకూరులో పారా పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న పారాలీగల్ వాలంటీర్లు మరియు జూనియర్ న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చముతో సత్కరించడం జరిగింది.తదనంతరం సింగరాయకొండ ,ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పి.పి.ఇ కిట్లు (Reusable kits ) మరియు పేస్ ప్రొటెక్షన్ మాస్క్ల్ పంపిణీ చేశారు.
ఎస్.ఐ.తిరుపతి రావు గారు మాట్లాడుతూ సుమారుగా కందుకూరు పట్టణం లో ఎనిమిది వందల కేసులు నమోదైనవని, కనుక తమకు తాముగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే తప్పితే బయటికి రాకూడదని తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దిశగా ఉన్న ఈ సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కనుక ప్రజలు లాక్డౌన్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు దుర్గా ప్రసాద్, రమేష్, షేక్ షల్మా, షేక్ హీనా మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending

www.vsbnews.in