Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(13-02-2020)

Published

on

దేశ రాజధాని దిల్లీలో అధికారాన్ని దక్కించుకునేందుకు భాజపా సర్వశక్తులూ ఒడ్డింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు 70 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 6500 బహిరంగసభలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు విస్తృతంగా ప్రచారం చేశారు. వీరిద్దరూ కలిసి 68 బహిరంగసభల్లో పాల్గొన్నారు. 24 రోడ్షోలు నిర్వహించారు. జేపీ నడ్డా మొత్తం 70 నియోజకవర్గాల్లోనూ పర్యటించారు. అమిత్షా కూడా దాదాపు 60 నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ఈ ప్రచారానికి మరింత ఊపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ రెండు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. భాజపాకు చెందిన ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ (యూపీ), విజయ్రుపాణి(గుజరాత్), జైరామ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్) బీరెన్ సింగ్ (మణిపుర్), త్రివేంద్ర సింగ్రావత్ (ఉత్తరాఖండ్), శర్వానంద్ సోనోవాల్(అసోం), నీతీశ్కుమార్ (బిహార్)లు ప్రచారం చేశారు. వీరుగాక మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, శివరాజ్సింగ్ చౌహాన్లు కూడా అభ్యర్థుల విజయం కోసం శ్రమించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ 26, రాజ్నాథ్సింగ్ 12, నితిన్ గడ్కరీ 10 సభల్లోనూ పాల్గొన్నారు.

ఈ దఫా దిల్లీ శాసన సభ ఎన్నికల్లో 16 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరంతా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వారే కావడం విశేషం. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమిపాలైన ఆతిషీ, రాఘవ్ చద్దా, దిలీప్ పాండే కూడా వీరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ క్రికెటర్, భాజపా అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమిపాలైన ఆతిషీ ఈ దఫా కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి 11,393 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజీందర్ నగర్ స్థానం నుంచి చద్దా 20,058 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. 24వేల ఓట్ల మెజార్టీతో తిమార్పుర్ అసెంబ్లీ స్థానాన్ని పాండే దక్కించుకున్నారు.

ఏడు దశాబ్దాలుగా దేశంలో థర్డ్జెండర్కు రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చట్టసభల్లోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఈ అంశాన్ని ఎంపీ రేవంత్రెడ్డి లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆంగ్లో ఇండియన్ స్థానంలో థర్డ్ జెండర్కు నామినేటెడ్ పదవి కల్పించాలని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి డిమాండు చేశారు

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, ప్రజా చైతన్య సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని తెలంగాణ జనసమితి(తెజస) రాష్ట్రాధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన తెజస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బుతో ఓట్లను కొల్లగొట్టిందని, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని, పంటకు గిట్టుబాటు ధరలు అందజేయాలని వరంగల్, ఖమ్మం మార్కెట్ యార్డుల్లో ఆందోళనలు చేపట్టాలని తీర్మానించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో రుసుముల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కార్యవర్గం తీర్మానించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచాలనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, రిజర్వేషన్ల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేయడానికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని వీహెచ్ ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఎ.సంపత్కుమార్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు చెల్లుతుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్లో సంపత్కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాల ఛైర్మన్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బలహీన వర్గాలను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ తరఫున ఈ నెల 16న లేదా 17న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడతామని సంపత్కుమార్ తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగాల ప్రధాన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. ర్యాంకుల జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠ మార్కులు 210.66, 210.64గా నమోదయ్యాయి. కడప, అనంతపురం జిల్లాల్లో కనిష్ఠంగా 173.7, 187.31 మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి.

చీమకుర్తి మైనింగ్ క్లస్టర్లో అన్ని రకాల వాయు కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ బీఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. రెండో దశలో రాష్ట్రంలోని 22 మైనింగ్ క్లస్టర్లలోనూ ఇదే నమూనాను అమలు చేస్తామని చెప్పారు. విజయవాడలోని పీసీబీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కాలుష్య నియంత్రణపై చర్చా వేదిక జరిగింది.

గురు రాఘవేంద్ర ప్రాజెక్టులోని తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ వ్యయం కింద 2019-20 సంవత్సరానికి రూ.27.06 కోట్లు మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. హైటెన్షన్ విద్యుత్తు ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

రాష్ట్రంలోని మైనర్ మినరల్స్ లీజుదారులు పర్మిట్లు పొందేందుకు చెల్లించే సుంకాన్ని (సీనరేజ్) పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 48 రకాల మైనర్ మినరల్స్ సీనరేజ్ పెంచారు. దీని ప్రకారం… బిల్డింగ్ స్టోన్ క్యూబిక్ మీటర్ రూ.90, తెల్ల సున్నపురాయి మెట్రిక్ టన్నుకు రూ.120, మార్బుల్ క్యూబిక్ మీటర్కు రూ.300, క్వార్ట్జ్, క్వార్ట్జైట్ మెట్రిక్ టన్నుకు రూ.90, రహదారి కంకర క్యూబిక్ మీటర్కు రూ.35, ఇసుక మెట్రిక్ టన్ను రూ.100కు సుంకాలు పెరిగాయి. ఇవన్నీ మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని గనులశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ్గోపాల్ పేర్కొన్నారు.

విశాఖలోని విలువైన కార్తీకవనం భూముల లీజు విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్తే బాగుంటుందని శాసన మండలి కమిటీ సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు, ఎస్.రామకృష్ణ సూచించారు. మంగళవారం కమిటీ సభ్యులు విశాఖ మహానగర అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) అధికారులతో సమావేశమయ్యారు. భూసమీకరణ గురించి మాట్లాడుతూ నిబంధనల్ని ఏవిధంగా పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సమీకరించడం ఎంతవరకు సమంజసమన్నారు.

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 13, 14వ తేదీల్లో సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు నిర్వహించనున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ సహస్ర బుద్దే, భారత విశ్వవిద్యాలయాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్, ఎన్బీఏ ఛైర్మన్ అగర్వాల్ తదితరులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 65 మంది ఉపకులపతులు హాజరు కానున్నారని ఉపకులపతి శ్రీనివాస్కుమార్ తెలిపారు.

కొత్త రాజధాని ప్రాంతంలో ప్రాచీన భాండాగారం(ఆర్కివ్స్) బలోపేతం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ రామకృష్ణ, ఆంధ్రా వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కేశవనారాయణ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ చరిత్ర విభాగం విశ్రాంత అధిపతి రామచంద్రారెడ్డి, సభ్య-కన్వీనర్గా రాజ్యాభిలేఖ సంచాలకులు రంగరాజ్ ఉన్నారు.

అనంతపురం జిల్లాలో పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు స్మారక జిల్లా పురావస్తు మ్యూజియం నిర్మాణానికి రూ.3.71కోట్లు విడుదల చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామక ప్రధాన పరీక్షలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 0866-2527820, 0866-2527821 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

రాష్ట్ర రాజధాని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలను చవిచూస్తుండడంతో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ పరాభవానికి దివంగత మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ చాకో ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.1998 నుంచి 2013 వరకు షీలా దీక్షింత్ ఢిల్లీ సీఎంగా కొనసాగారు. అయితే 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీ రంగప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ వైభవం తగ్గుతూ వచ్చింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ.. తాజా ఎన్నికల్లో కూడా ఖాతా తెరవలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాకో నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం ఆమాద్మీకి మళ్లిందని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలలో చైతన్యం కల్పించారలనే బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ చేసిన మోసాలకు ఏపీ ప్రజలు వారిని మూలనపడేశారన్నారు. ఎంతసేపు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని రాయసీమ, ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని మండిపడ్డారు.

దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, భాజపా మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని విమర్శించారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారని కన్నా వివరించారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌, పెట్రో ఛార్జీలు పెంచి… ప్రజల రక్తం పీల్చేలా వైకాపా పాలన కొనసాగుతోందని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 57వ రోజుకు చేరాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై రోజుకో రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా రాజధాని రైతులు, మహిళలు బుధవారం శిరిడీ బయల్దేరి వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 200 మంది ‘జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌.. అమరావతిని రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తూ శిరిడీ సాయి దర్శానికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మనసు మారాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

దేశ రాజధానిలో హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ముచ్చటగా మూడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఫిబ్రవరి 16(ఆదివారం)న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్‌ నేడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్తగా ఎన్నికైన ఆప్‌ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ నేడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీ.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి కోరనుంది. నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకారానికి ముందు కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్‌ కమిటీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించే అధికారం ..అధికారులతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘనతోపాటు రాజ్యాంగ వ్యతిరేక విధానాల కిందకు వస్తుందన్నారు. సభా వ్యవహారాలకు విరుద్ధంగా వెళ్లే అధికారం ఏ అధికారికీ లేదని యనమల అన్నారు. అలా వ్యవహరించే వారు సభ తీసుకునే నిర్ణయాలకు బాధ్యులేనని యనమల పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

ఈనెల 16వతేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ కాసేపట్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు…

రాజధాని గ్రామాల్లో ఆందోళనలు 57వ రోజుకు చేరుకున్నాయి. మందడం గ్రామం నుంచి 170 మంది రైతులు, మహిళలు షిర్డీ సాయినాధుని దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని మొక్కుకునేందుకు రైతులు, మహిళలు షిర్డీకి వెళ్లారు.

జాతీయ పౌర పట్టిక(ఎన్సార్సీ) వెబ్‌సైట్‌ నుంచి అసోం పౌరుల తుది జాబితాకు సంబంధించిన డేటా గల్లంతైంది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఐటీ సంస్థతో కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో డేటా గల్లంతైందని ఎన్నార్సీ అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సమావేశం ప్రారంభమైంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణ చేసే అంశంపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు పంచుతూ పట్టుబడితే వెంటనే అభ్యర్థి డిస్ క్వాలిఫై అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం కుదింపుపై కేబినెట్ లో చర్చించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా రాజీనామా చేశారు. 2015వ సంవత్సరంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9.7 శాతం ఓట్లు రాగా, ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం 4.27 శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు సుభాష్ చోప్రా చెప్పారు…

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడతూ.. ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఆ దుండగుడిని గుర్తించి పట్టుకోవాలి అని ఆయన అన్నారు. నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో చర్చనీయం అంశంగా మారింది..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ కార్యవర్గంలో మొత్తం 48 మందిని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నియమించినట్లు పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా టి.జ్యోత్స్న, మరో ఐదుగురిని ఉపాధ్యక్షులుగా, 11 మందిని కార్యదర్శులుగా, 15 మందిని ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా, 9 మందిని అధికార ప్రతినిధులుగా, ఏడుగురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో తమ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తున్నట్లు తేలిపోయిన వెంటనే ‘భాజపా గెలుపుతో పొంగిపోదు. ఓటమికి కుంగిపోదు’ అనే ప్రకటనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్షా ఫొటోతో కూడిన బ్యానర్ దిల్లీ భాజపా కార్యాలయం ఎదుట కట్టారు. అమిత్షా ఆధ్వర్యంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రచారం చేసిన భాజపాకు ఘోర ఓటమి తప్పలేదు. తమ పార్టీ గెలిచిన స్థానాలు రెండంకెలకు సైతం చేరని నేపథ్యంలో కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అరుదైన బ్యానర్ కట్టడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు భద్రతను తగ్గించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కిడారి శ్రవణ్కుమార్ల గన్మెన్లను పూర్తిగా తొలగించారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడుకి 2+2 భద్రత ఉండగా..దాన్ని 1+1కు కుదించారని పేర్కొన్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తూటా రక్షక కవచ వాహనాన్ని తొలగించగా..రంపపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి గన్మెన్ను తొలగించారని వివరించాయి. మరోవైపు భద్రతా సమీక్ష కమిటీ సూచనల మేరకు అంగరక్షకులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించకున్నా.. పై అధికారుల ఆదేశాలను అమలుచేస్తామని పేర్కొన్నారు. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి గతంలో 2+2 గన్మెన్ భద్రత ఉండేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1+1కు కుదించారు.

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, రిజర్వేషన్ల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదని, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేయడానికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని వీహెచ్ ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ఆంగ్ల ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ‘ఇన్స్పైర్ మనాక్ 2019-20’ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ జరిపిన సమావేశంలో రైతుల ప్రస్తావనే రాలేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కనీసం ప్రస్తావించలేదని పేర్కొంటూ సీఎం వైఖరిపై రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. లేఖలో రైతుల ఆత్మహత్యలు, అన్నదాతల కష్టనష్టాలను ప్రస్తావించారు. దాదాపు 11 గంటలపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో 5 నిమిషాలైనా రైతుల గురించి చర్చించేందుకు సమయం దొరకలేదా అన్ని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై చర్చ జరిగితే రుణమాఫీ, రైతుబంధు మద్దతు ధర తదితర పథకాల అమలులో దొర్లుతున్న లోపాలు వెలుగులోకి వస్తాయనే సమీక్ష చేయలేదని రేవంత్‌ విమర్శించారు.

చట్ట సభల్లో రూపొందించిన శాసనాలనే అధికారులు ధిక్కరించే పరిస్థితి వైకాపా ప్రభుత్వంలోనే చూస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కియా పరిశ్రమ పరిశీలనకు అనంతపురం జిల్లాకు వచ్చిన రామకృష్ణ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీరును ఎండగట్టారు. వైకాపాకు చట్టసభల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానులపై అసెంబ్లీలో ఆమోదం చేయించారని మండిపడ్డారు. రాజ్యాంగంలో శాసనసభకు ఎలాంటి అధికారాలున్నాయో అవే శాసనమండలికి కూడా ఉన్నాయన్న విషయం వైకాపా ప్రభుత్వం గుర్తించడంలేదని ఆక్షేపించారు. కియా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం భూములిస్తే.. జగన్‌ ప్రభుత్వంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.

శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్‌ కమిటీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించే అధికారం ..అధికారులతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘనతోపాటు రాజ్యాంగ వ్యతిరేక విధానాల కిందకు వస్తుందన్నారు. సభా వ్యవహారాలకు విరుద్ధంగా వెళ్లే అధికారం ఏ అధికారికీ లేదని యనమల అన్నారు. అలా వ్యవహరించే వారు సభ తీసుకునే నిర్ణయాలకు బాధ్యులేనని యనమల పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నెల 16న కొలువుదీరనుంది. ఆప్‌ 62 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇందులో 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ తరపున 9 మంది మహిళలు పోటీ చేయగా 8 మంది గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఐదుగురికి, కాంగ్రెస్‌ పార్టీ 10 మంది మహిళలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆప్‌ తరపున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు.. అతిషి మర్లేనా(కల్కాజీ), ధనవతి చాందేలా(రాజౌరీ గార్డెన్‌), రాజ్‌కుమార్‌ ధిల్లాన్‌(హరినగర్‌), బండానా కుమారి(శాలీమర్‌బాగ్‌), ప్రీతి తోమర్‌(త్రినగర్‌ సిటీ), భావన గౌర్‌(పాలం), ప్రమీలా తోకస్‌(ఆర్కే పురం), రాఖీ బిర్లా(మంగోల్‌పూరి). కాగా సరితా సింగ్‌ అనే అభ్యర్థి రోహతస్‌ నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్‌ మహాజన్‌ గెలిచారు. ఆప్‌ తరపున గెలిచిన 8 మంది మహిళా ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతురాలు ధనవతి చాందేలా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 593 మంది పురుషులు, 79 మంది మహిళలు పోటీ పడ్డారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. నితిశ్‌ పోస్టర్లతో పాటుగా ఆర్జేడీ చీఫ్‌ లాల్‌ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా కూడా పోస్టర్లు దర్శనమిచ్చాయి. వీరిద్దరి పాలనలో రాష్ట్రం నాశనమైనట్టు అర్థానిచ్చే పోటోలను వేసి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.

శాసనసభ జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. గెలుపు తమదేనని చివరి వరకు మేకపోతు గంభీర్యం ప్రదర్శించిన భాజపా గతంలో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికి భాజపా గతమతో ఆమడ దూరంలో నిలిచింది. ఇక ఎన్నికలకు ముందే కాడిపదేసిన కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఆపార్టీకి పోలిన ఓట్ల శాతం కూడా గణనీయంగా పడిపోయింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9.7 శాతం ఓట్లు పోలవగా ఈసారి అది 4.57శాతానికి దిగజారింది.

ప్రభుత్వం సమాజంలో ని పేదల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు జగన్ ప్రభుత్వం తీసుకుంటొంది. పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణ కు విప్లవాత్మకమైన నిర్ణయం. తీసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అభ్యర్థులపై మూడు సంవత్సరాల శిక్ష అదనంగా అనర్హత వేటు 13 ఎంపీటీసి 15 రోజుల్లో ఎన్నిక సర్పంచ్ 5 ఎంపిటిసి జెడ్పీటీసి 7 రోజులు ప్రచార సమయంపారిశుద్ధ్యం పచ్చదనం బాధ్యత సర్పంచ్ దే. సర్పంచ్ స్థానికంగా కాపురం వుండాలి. రోజు పంచాయితీ కార్యాలయం వెళ్లాలి. పంచాయితీ తీర్మానం అవసరం లేకుండా పంచాయితీ తీర్మానం అవసరం లేకుండా మౌఖిక ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికల నియమావళి మీరుతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై. ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కు ఆమోదం.

టైటన్ కంపెనీ మంగళవారం పూర్తిస్థాయి టచ్ స్మార్ట్వాచ్ను ‘టైటన్ కనెక్టెడ్ ఎక్స్’ పేరిట దేశీయ విపణిలోకి విడుదల చేసింది. 13 సదుపాయాలు కలిగిన ఈ స్మార్ట్వాచ్ ధర రూ.14,995 అని, టైటన్ విక్రయశాలల్లో మార్చి నుంచి అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 1.2 అంగుళాల రంగుల తాకేతెర, అనలాగ్ హ్యాండ్స్ కలిగిన ఈ వాచ్ ద్వారా వ్యాయామం-నిద్ర- హృదయస్పందనను పర్యవేక్షించుకోవచ్చని, ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు, కెమేరాను నియంత్రించేందుకు, వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చని టైటన్ సీఈఓ (వాచీలు, ఉపకరణాల వ్యాపారం) ఎస్.రవికాంత్ తెలిపారు.

ప్రేమికుల రోజు సందర్భంగా దేశీయ మార్గాల్లో ప్రయాణానికి ఈనెల 14 వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకుని రూ.999 నుంచి లభించే టికెట్ల విక్రయాలు ఈనెల 11 (మంగళవారం) ప్రారంభమైనట్లు తెలిపింది. మార్చి 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి ఈ టికెట్లు తమ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

ఇంజినీరింగ్ ఉత్పత్తులను అందించే పిట్టీ ఇంజినీరింగ్ డిసెంబరు త్రైమాసికంలో రూ.117.92 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.2018-19 ఇదే సమయంలో ఆదాయం రూ.165.42 కోట్లుగా ఉంది. నికర లాభం మాత్రం రూ.5.09 కోట్ల నుంచి రూ.4.06 కోట్లకు తగ్గింది. మొత్తం 9 నెలల కాలానికి రూ.412.12 కోట్ల ఆదాయం, రూ.15.56 కోట్ల నికర లాభాన్నీ గడించింది. ఔరంగాబాద్ ప్లాంటుకు రూ.129 కోట్లు, హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్న నాలుగో ప్లాంటుపై రూ.38 కోట్లు ఖర్చు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పెన్నార్ ఇండస్ట్రీస్ రూ.12.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఇదే సమయంలో ఆర్జించిన రూ.15.2 కోట్లతో పోలిస్తే ఇది 19.5శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.537.4 కోట్లు ఉండగా, గత ఏడాది ఇది రూ.567.6 కోట్లు ఉంది. మొత్తం తొమ్మిది నెలల లాభాన్ని చూస్తే 23.2 శాతం పెరిగి రూ.52.1 కోట్లకు చేరింది. 3డీ డిజిటల్ బిల్డింగ్ మోడళ్లను తయారు చేసే వన్వర్క్ బీఐఎం టెక్నాలజీస్ను స్వాధీనం చేసుకునేందుకు బోర్డు అంగీకరించింది

2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో సిండికేట్ బ్యాంక్ రాణించింది. మొండి బకాయిలు తగ్గడంతో రూ.434.82 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.107.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ స్పష్టమైన దిశలో ముందుకు వెళ్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టంచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే నాలుగు గ్రోత్ ఇంజిన్లను సజీవంగా ఉంచడంవల్ల అవి వృద్ధిరేటును వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశలో సాగుతున్నాయని పేర్కొన్నారు.

దిల్లీ చేరుకున్న సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుతో పాటు మండలి వ్యవహారాన్ని ప్రధానికి సీఎం వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేలా సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుల నినాదాలతో అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్‌కు చేరుకున్న పవన్, సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ముందుగా అనుకొన్న సమయం ప్రకారం ఈ మధ్యహ్నం 3 గంటలకే ప్రారంభం కావాల్సిన ర్యాలి 4:30pm కు మొదలు అయింది.

జ‌మ్మూక‌శ్మీర్‌లో విదేశీ ప్ర‌తినిధులు టూర్ చేస్తున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌కు విదేశీ బృందం రావ‌డం ఇది రెండ‌వ సారి. ఇవాళ సుమారు 25 మంది విదేశీ దౌత్య‌వేత్త‌లు క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. దాల్ స‌రస్సులో వారంతా విహ‌రించారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత‌.. జ‌మ్మూక‌శ్మీర్ స్తంభించిపోయింది. అయితే అక్క‌డ ఎటువంటి ఆంక్ష‌లు లేవ‌ని నిరూపించేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా విదేశీ దౌత్య‌వేత్త‌ల‌ను క‌శ్మీర్‌కు తీసుకువ‌స్తున్నారు.
ప‌ర్యాటకాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ ఈనెల 14వ తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఇవాళ స్పందించింది. రెండ్రోజుల గడువుతో హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు. విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఈనెల 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

తిరుపతిలో జిల్లా జడ్జికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జడ్జి ఆనంద్‌‌కు సంబంధించిన కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కారు స్టార్ట్ చేసిన వెంటనే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ జడ్జిని కిందకి దించేశాడు. జడ్జికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర బుధవారం ధర్నాకు దిగారు. మండలంలో పెన్షన్లు తొలగించిన బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, హిందుస్తాన్‌ యూనిలివర్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడుతుండగా..వొడాఫోన్‌, యస్‌బ్యాంక్‌, బీహెచ్‌ఈఎల్‌, అశోక్‌ లేలాండ్‌ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 381 పాయింట్ల లాభంతో 41,597 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 116 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,223 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ వెల్లడించారు.

‘టైటాన్ కనెక్టెడ్ ఎక్స్’ పేరుతో ఫుల్ టచ్ స్మార్ట్‌‌వాచ్‌‌ని లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌‌ కోసం రూపొందిన ఈ వాచ్‌‌లో 13 రకాల ఫీచర్లున్నాయి. హార్ట్ రేటు మానిటరింగ్, ఫైండ్ ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్, క్యాలెండర్ అలర్ట్స్, మ్యూజిక్, సెల్ఫీ ఫీచర్లను టైటాన్ ఆఫర్ చేస్తోంది. ఈ వాచ్ ధర రూ.14,995గా టైటాన్ పేర్కొంది.టైటాన్ కనెక్టెడ్ ఎక్స్ ప్రొడక్ట్‌‌ వచ్చే నెల నుంచి అన్ని లీడింగ్ టైటాన్‌‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సీఈవో (వాచెస్‌‌ అండ్‌‌ వేరబుల్స్‌‌) రవికాంత్ చెప్పారు.

సూచీలు లాభపడ్డాయి. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న భయాలతో రెండు రోజులుగా నష్టపోయిన సూచీలు మంగళవారం సానుకూలంగా ముగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాటు కొత్త కేసుల నమోదు కూడా తగ్గడంతో.. చైనాలో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడం మదుపర్లలో సెంటిమెంటును మెరుగుపరిచింది.

పాలసీదారుకు అపరిమిత మొత్తం ఆరోగ్యబీమా అందించే నూతన పాలసీ ‘హెల్త్ ఇన్ఫినిటీ’ని ఆవిష్కరించామని, పరిశ్రమలో ఇలాంటి పాలసీ ఇదే మొదటిది అని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఆసుపత్రిలో రోజుకు గది అద్దె ఆధారంగా ఈ పాలసీ పనిచేస్తుంది. రోజుకు రూ.3000-50,000 అద్దెను పరిగణనలోకి తీసుకుని, కవరేజీ లిమిట్ను పాలసీదారు ఎంచుకోవచ్చని తెలిపింది

FAST NEWS

నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది:

Published

on

బాలీవుడ్ లో నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది: ఏఆర్ రెహమాన్

బాలీవుడ్ లో బంధుప్రీతిపై స్పందించిన రెహమాన్

సమయానికి ట్యూన్లు ఇవ్వడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి

దిల్ బేచారా దర్శకుడికి తనపై చాడీలు చెప్పారన్న రెహమాన్

భారతదేశ ఖ్యాతిని ఆస్కార్ యవనికపై రెపరెపలాడించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలను ఓ గ్యాండ్ అడ్డుకుంటోందని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ, సినిమాలు తనవరకు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.

సకాలంలో బాణీలు ఇవ్వడంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ ముఠానే కారణమని అన్నారు.

సుశాంత్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని, రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఆ చిత్ర దర్శకుడు ముఖేశ్ ఛాబ్రాకు పలువురు చెప్పారని, కానీ ఛాబ్రాకు 48 గంటల్లో 4 పాటలకు ట్యూన్లు ఇచ్చానని రెహమాన్ తెలిపారు.

తాను మంచి సినిమాలను ఎప్పుడూ వదులుకోవాలని భావించలేదని, మ్యూజిక్ లవర్స్ తననుంచి ఎంతో ఆశిస్తుంటే ఓ గ్యాంగ్ అందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Continue Reading

FAST NEWS

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి…

Published

on

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: బీజేపీకి ఉద్ధవ్ థాకరే సవాల్

మా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది

బీజేపీతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు

చైనా మనకు మిత్రదేశంగా మారొచ్చేమో

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, రాజస్థాన్‌లో కూల్చేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉద్ధవ్.. బీజేపీపై నిప్పులు చెరిగారు.

ఆ పార్టీతో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు.

తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు.

చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు.

ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు.

కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.

Continue Reading

FAST NEWS

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

Published

on

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

కృష్ణా: వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడారు. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్‌ మరణానికి కారణమయ్యారు. నలంద కిషోర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in