Connect with us

DEVOTIONAL

ఈ రోజు రాశిఫలం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం, ఫిబ్రవరి 13, VSB NEWS :
రాశిఫలం – 13/02/2020
తిథి:
బహుళ పంచమి రా.2.19, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
హస్త మ.2.37
వర్జ్యం:
రా.10.04నుండి 11.33 వరకు
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.48నుండి 03.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారంచేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగుతాయ. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయ. ఆరోగ్యంగూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

ఈ రోజు రాశిఫలం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

మేషరాశి : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం :  ఈ రోజు ఉద్యోగం విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథునం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం, అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం : ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు, ఛాతీ సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్‌ ట్రిక్‌ సంబంధ ఆరోగ్య సమస్య  బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడుతాయి.

సింహం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

తుల : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

మకరం :  ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్తిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం :  ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అనుకోని ఖర్చులు ఉంటాయి.

 

మీనం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి అనుకూల దినం కాదు.

 

Continue Reading

DEVOTIONAL

తిరుమల సమాచారం

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుమల , ఫిబ్రవరి 16 , VSB NEWS :

ఓం నమో వేంకటేశాయ!!

తిరుమల: 13C°-29C°

నిన్న 81,963 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,

వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 23 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.

ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,

నిన్న 37,450 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
: 2.52 కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

 

Continue Reading

DEVOTIONAL

నేటి పంచాంగం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

తేది : 16, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(ఈరోజు రాత్రి 8 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం :  విశాఖ
(ఈరోజు రాత్రి 10 4 గం॥ 12 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు పగలు  2 గం॥ 3 ని॥ నుంచి 3 గం॥ 35 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 31 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 1 గం॥ 03 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ ౩0 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ ౦౦ ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 17 ని॥ లకు

Continue Reading

Trending

www.vsbnews.in