Connect with us

DEVOTIONAL

 టి టి డి లో ఎస్ టి సమస్యలు జీరో చేయడానికి చేస్తున్న 

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుపతి, , ఫిబ్రవరి 12 , VSB NEWS :

 

టి టి డి లో ఎస్ టి సమస్యలు జీరో చేయడానికి చేస్తున్న  కృషి అభినందనీయం

టి టి డి  ఎస్ టి ఉద్యోగ సంఘాలు  టి టి డి లో అమలు చేస్తున్న  గిరిజన సంక్షేమ పథకాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్  అమలు వారి సమస్యలు  జీరో స్థాయికి తీసుకు వస్తున్నారని   తెలపడం  టి టి డి  ని అభినందించక తప్పదని  ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎస్ టి  సంక్షేమ కమిటీ ఛైర్మన్   తెల్లం బాల రాజు అన్నారు.

చిత్తూరు జిల్లా లో కమిటీ ఏర్పడి మొదటి సారిగా  పర్యటిస్తున్న సందర్భంగా  3వ రోజు స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం లో  కమిటీ టి టి డి   ఇ ఓ , అడిషనల్ ఇ ఓ,   జె ఇ ఓ ఉన్నతాధికారులతో ఛైర్మన్ సమీక్షించారు

.  టి టి డి   ఇ ఓ అనిల్ కుమార్ సింఘాల్ , జె ఇ ఓ బసంత్ కుమార్   టి టి డి   రూపు దిద్దుకున్న విధానం తో పాటు  రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియామకాలలో  ప్రమోషన్లలో పాటిస్తున్న విధానం  పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా వివరించారు.

టి టి డి   ఉద్యోగ సంఘాలు, నాయకులు, ప్రసాద రావు, భాస్కర రావు, కమిటీ కి వివరిస్తూ టి టి డి   ఇ ఓ  గా అనిల్ కుమార్ సింఘాల్, యంత్రాంగం పూర్తి స్థాయిలో  ఎస్ టి లకు న్యాయం చేస్తున్నారని  ఎస్ టి ప్రమోషన్లు ఇచ్చి  కీలక పదవులు దేవాలయం లో , రిసెప్షన్లలో  నియామకం జరిపారని  ప్రతినెలా ప్రత్యేక సెల్ ఏర్పాటు తో  ఉద్యోగుల సమస్యలు  తన స్థాయిలో పరిష్కరించడం వల్ల  కమిటీకి సమస్యల పై  ఏ అర్జీలు ఇవ్వాలనే ఆలోచనలో పడుతున్నామని  అంతగా అదరిస్తున్నారని వివరించారు.

ఎస్ టి సంఘాల నాయకులు  అక్కులప్ప , శంకర్ నాయక్,  టీచింగ్ పోస్టులలో , షాపుల కేటాయింపు , ఎస్ వి బి సి  చానల్ లో అన్యాయం జరిగిందని  కొత్త నియమకాలు జరపడం లేదని ఆరోపించారు

.   టి టి డి   ఇ ఓ వివరిస్తూ  రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పని సరి పాటిస్తున్నామని ఖాళీ  గా వున్న బ్యాక్ లాగ్ పూర్తి చేయకుండా  ఇతర పోస్టుల నియామకం జరపమని కమిటీ కి హామీ ఇచ్చారు.

తిరుమలలో షాపుల కేటాయింపు  గత 30 సంవత్సరాల మునుపు  ఆలయం చుట్టూ వున్న మాడా వీధుల వారు  తన స్థలాలు ఇవ్వడం తో  వారి జీవనార్థం కోసం కేటాయింపు జరిగాయని వాటిలో అమలు సాధ్యం కాదని,  ఇప్పుడు నిర్మించిన వాటికి  అందరి సమక్షం లో  వేలం వేసి రిజర్వేషన్ కోసం కేటాయిస్తున్నామని వివరించారు.

ఎస్ వి బి సి చానల్ విషయం లో  కంపెనీ యాక్ట్ మేరకు  ఏర్పాటయ్యిందని  కంపెనీ యాక్ట్ లలో  ఆర్. ఓ. ఆర్ అమలు వుండదని  అయినా  టి టి డి నిధులు ఇస్తున్నందున పాటించక తప్పదని తెలిపామని , నిర్దేశిత ఉద్యోగుల సంఖ్య నిర్ధారణ లో  లేనందున ఎక్స్ పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న ఉద్యోగులను కూడా  అవసరమా లేదా అని పరిశీలన చేస్తున్నామని ప్రైవేట్ భక్తి చానల్ లో చాలా తక్కువ మంది ఉద్యోగులతో  నడుపుతున్నారని  నివేదిక వచ్చి న వెంటనే తప్పనిసరి అమలు చేస్తామని అన్నారు.

కొత్త నియామకాలపై  హై కోర్టు ఉత్తర్వులు స్థానికులకు 75 శాతంగా కేటాయించాలని  వుందని , ప్రభుత్వ పరిశీలన లో వుందని రాగానే ఆర్ ఓ ఆర్ మేరకు  ఖాళీగా వున్న శాశ్విత ఉద్యోగాల నియామకం  చేపడతామని వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎస్ టి  సంక్షేమ కమిటీ ఛైర్మన్   మాట్లాడుతూ  గిరిజన సంక్షేమం  కోసం  టి టి డి శ్రద్ధ తీసుకొని  ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి లైజన్ ఆఫీసర్ పార్వతి  ని నియమించి పరిష్కరించడం  అభినందనీయమని అన్నారు.

గిరిజన ప్రాంతాలలో  దేవాలయ నిర్మాణాలు , శ్రీనివాస కళ్యాణలు జరపడం , ఉచిత విగ్రహాలు పంపిణీ , గిరిజన కాలనీ లలో  నిర్మించిన దేవాలయాలకు  జరుజనులకే పూజారులుగా శిక్షణ నిచ్చి  నియమించడం సంతోషంగా వుందని సంఘాలు తెలిపిన మేరకు  ఎస్ టి ల సమస్యలు జీరో స్థాయికి తీసుకురావడం  అభినందనీయం  అన్నారు.

హథీరాం బావాజీ బంజారాలకు ప్రాధాన్యమివ్వాలని కోరారని పెండింగ్ లోవున్న వసతి భవనం మీ సహకారం తో పూర్తి చేయాలని టి టి డి కి తెలిపారు.

టీచింగ్ స్టాఫ్ లో వున్న  ఆర్ ఓ ఆర్  చిన్న తేడా ను కూడా పరిష్కరించాలన్నారు.

ఈ సమావేశం లో  కమిటీ సభ్యులు భాగ్యలక్షి, ధన లక్ష్మి,  వెంకట రావు, చట్టే ఫల్గుణ , శాసన సభ్యులు మాట్లాడుతూ  ఏజెన్సీ ప్రాంతాల వారికి  టి టి డి సహాయం అందించాలని కోరారు.

టి టి డి అడిషనల్ ఇ ఓ ధర్మ రెడ్డి, సి వి అండ్ ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి,  టి టి డి ఉన్నతాధికారులుగిరిజన సంఘాల నాయకులు ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, బంజారా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం కు ముందు  ఛైర్మన్, సభ్యులు గిరిజనుల నుండి, సంఘాల నుండి  వినతుల స్వీకరణ చేపట్టి  పరిశీలించి న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

ఈ రోజు రాశిఫలం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

మేషరాశి : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం :  ఈ రోజు ఉద్యోగం విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథునం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం, అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం : ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు, ఛాతీ సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్‌ ట్రిక్‌ సంబంధ ఆరోగ్య సమస్య  బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడుతాయి.

సింహం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

తుల : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

మకరం :  ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్తిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం :  ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అనుకోని ఖర్చులు ఉంటాయి.

 

మీనం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి అనుకూల దినం కాదు.

 

Continue Reading

DEVOTIONAL

తిరుమల సమాచారం

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుమల , ఫిబ్రవరి 16 , VSB NEWS :

ఓం నమో వేంకటేశాయ!!

తిరుమల: 13C°-29C°

నిన్న 81,963 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,

వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 23 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.

ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,

నిన్న 37,450 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు

• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
: 2.52 కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

 

Continue Reading

DEVOTIONAL

నేటి పంచాంగం…

Published

on

ఆంధ్రప్రదేశ్ , విజయనగరం , ఫిబ్రవరి 16 , VSB NEWS :

తేది : 16, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(ఈరోజు రాత్రి 8 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం :  విశాఖ
(ఈరోజు రాత్రి 10 4 గం॥ 12 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు పగలు  2 గం॥ 3 ని॥ నుంచి 3 గం॥ 35 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 31 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 1 గం॥ 03 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ ౩0 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ ౦౦ ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 17 ని॥ లకు

Continue Reading

Trending

www.vsbnews.in