Connect with us

Politics

తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , ఫిబ్రవరి 12 , VSB NEWS :

 

తమిళనాడులో ఏపీ సీఎం జగన్‌ పోస్టర్లు.. హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ

ఆంధ్రాను కాపాడమని విజయ్‌కు జగన్‌, పీకే చెబుతున్నట్లు పోస్టర్లు

విజయ్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నట్లు వ్యాఖ్యలు

తమిళనాడుని విజయ్‌ కాపాడాలంటోన్న అభిమానులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. ‘రావాలి విజయ్..కావాలి విజయ్’ అనే నినాదంతో సినీ హీరో విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము ఏపీకి కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో  వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా వారికి మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయట తిప్పవద్దు

Published

on

తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా వారికి మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయట తిప్పవద్దు
ఎమ్మెల్యే—మహీధర్ రెడ్డి
కందుకూరు vsb న్యూస్ ఆగస్టు
కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో బ్లీచింగ్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులకు రెండుచేతులూ జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నా దయచేసి మీ పిల్లలకు మోటార్ సైకిళ్ళు ఇచ్చి బయటకు అనవసరంగా పంపకండి.లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించండని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి లాక్ డౌన్ కఠినంగా ఉంటుందని అనవసరమైన సాకులతో బయటకు రావద్దని,కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు.

Continue Reading

News

కరోనా ఖర్చులు పారదర్శకం గా ప్రజల ముందు పెట్టండి: దేవినేని

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 28 , VSB NEWS :

 

కరోనా ఖర్చులు పాదర్శకంగా ప్రజల ముందు పెట్టండి: దేవినేని

కరోనా కోసం నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘కేసులు 1,02,349, మరణాలు 1100కు చేరాయి.

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రంట్ లైన్ వారియర్స్ పిపిఈ కిట్లు లేక రైన్ కోట్లతో పనిచేస్తున్నారు.

జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు పెడుతున్న 500 కోట్లు, ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు ఎక్కడెక్కడ పెడుతున్నారో పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి? సీఎం జగన్‌ గారు’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Continue Reading

News

కరోనాను జగన్ లైట్ గా తీసుకుంటున్నారు

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  విశాఖ, జూలై 28 , VSB NEWS :

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు. కరోనా వైరస్ ను ముఖ్యమంత్రి జగన్ చాలా లైట్ గా తీసుకుంటున్నారని అన్నారు. కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో సదుపాయాలు వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సి ఉందని అన్నారు.

విశాఖలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని విష్ణు రాజు చెప్పారు. నగరం నిస్సహాయ స్థితికి చేరుకుందని అన్నారు. మరో నెల రోజుల్లో విశాఖలో కరోనా కేసులు 50 వేలకు చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయని చెప్పారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలంటే… కనీసం 10 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖలో అన్ని పార్టీల నేతలతో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కరోనా టెస్టుల రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉందని విష్ణు రాజు విమర్శించారు. 108కి ఫోన్ చేసినా అంబులెన్సులు వస్తాయనే నమ్మకం లేదని… అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కరోనా పేషెంట్ ను ఇంటికి పంపించే ముందు టెస్ట్ చేయడం లేదని ఆరోపించారు.

Continue Reading

Trending

www.vsbnews.in