Connect with us

DEVOTIONAL

ఫిబ్రవరి 13న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Published

on

ఆంధ్రప్రదేశ్ , తిరుపతి , ఫిబ్రవరి 12 , VSB NEWS :

తిరుపతి, 2020 ఫిబ్రవరి 12

ఫిబ్రవరి 13న శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా  ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల‌యంలో చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు,  ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 13న అంకురార్ప‌ణ‌ :

ఫిబ్రవరి 13వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                          ఉదయం                              సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం)          ధ్వజారోహణం                         పెద్దశేష వాహనం

15-02-2020(శ‌నివారం)            చిన్నశేష వాహనం                     హంస వాహనం

16-02-2020(ఆదివారం)            సింహ వాహనం                   ముత్యపుపందిరి వాహనం

17-02-2020(సోమ‌వారం)         కల్పవృక్ష వాహనం                 సర్వభూపాల వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం)      పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం

19-02-2020(బుధ‌వారం)        హనుమంత వాహనం            స్వర్ణరథం, గజ వాహనం

20-02-2020(గురువారం)          సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం

21-02-2020(శుక్ర‌ వారం)         రథోత్సవం                             అశ్వవాహనం

22-02-2020(శ‌నివారం)            చక్రస్నానం                        ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

పంచాంగము

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , విజయవాడ , మార్చి 29, VSB NEWS :

పంచాంగము 29.03.2020

సంవత్సరం: శార్వరి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: వసంత

మాసం: చైత్ర

పక్షం: శుక్ల

తిథి: పంచమి రా.10:24 వరకు
తదుపరి షష్టి

వారం: ఆదివారం (భాను వాసరే)

నక్షత్రం: కృత్తిక ప.12:30 వరకు
తదుపరి రోహిణి

యోగం: ప్రీతి ప.03:25 వరకు
తదుపరి ఆయుష్మాన్

కరణం: బవ ఉ.09:36 వరకు
తదుపరి బాలువ రా.10:06
తదుపరి కౌలవ

వర్జ్యం: రా.తె. 05:25 – 07:07

దుర్ముహూర్తం: 04:50 – 05:39

రాహు కాలం: 04:56 – 06:28

గుళిక కాలం: 03:24 – 04:56

యమ గండం: 12:20 – 01:52

అభిజిత్ : 11:56 – 12:44

సూర్యోదయం: 06:12

సూర్యాస్తమయం: 06:28

వైదిక సూర్యోదయం: 06:16

వైదిక సూర్యాస్తమయం: 06:25

చంద్రోదయం: ఉ.09:23

చంద్రాస్తమయం: రా.10:36

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: వృషభం

దిశ శూల: పశ్చిమం

చంద్ర నివాసం: దక్షిణం

శ్రీ – లక్ష్మీ పంచమి

హయగ్రీవ – చంద్ర దమన పూజ

కూర్మకల్పాది

పృథ్వి – నాగ దమన పూజ

శాలిహోత్ర హయ పంచమి

నిషాదరాజ జయంతి

మత్స్య పంచమి

వాల్మీకిపుర పట్టాభిరామ ఉత్సవారంభం

విష్ణు డోలోత్సవం

Continue Reading

DEVOTIONAL

రాశిఫలం

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , విజయవాడ , మార్చి 29, VSB NEWS :

రాశిఫలం – 29/03/2020

మేషం

మేషం : దైవ, యోగా ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనుపరుస్తారు. అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది.

వృషభం

వృషభం : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానరాగలదు. కలుపుగోలుగా వ్యవహరిస్తూ పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకుంటాయి.

మిథునం

మిథునం : గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. శుభకార్యాలకు యత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు పనులు స్వయంగా చూసుకోవాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభ్యత్వాలు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించని ఖర్చులే ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఉద్యోగస్తులకు సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఉదయం, నేత్ర సంబంధ చికాకుల వల్ల ఆందోళన చెందుతారు. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారులపై దాడులు జరుగుతాయి.

సింహం

సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారాలకు లాభదాయకం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గ్రహించి మితంగా సంభాషించడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.

కన్య

కన్య : ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వాధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు ఎదుర్కొంటారు. భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

తుల

తుల : పెంపుడు జంతువుల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మీ సంతానం వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులు గురికాకండి. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు శుభకార్యాల్లో ఆదరణ, వాహన యోగం, వస్తు ధనలాభం వంటి శుభలితాలున్నాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహిచండి.

ధనస్సు

ధనస్సు : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యమైనా ఆశించిన ప్రయోజనాలుండవు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృత్తుల వారికి ఆదాయం కంటే శ్రమే అధికంగా ఉంటుంది.

మకరం

మకరం : ప్రైవేటు ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం.

కుంభం

కుంభం : ఎవరినీ అతిగా విస్వసించడం మంచిదికాదు. పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వైద్యులు ఆపరేషన్లును విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.

మీనం

మీనం : నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో సమస్యలెదుర్కొంటారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

 

Continue Reading

DEVOTIONAL

ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , తిరుమల , మార్చి 28, VSB NEWS :

తిరుమలలో ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుండి నిర్వ‌హించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శ‌నివారం మ‌హా పూర్ణాహుతిలో ఘ‌నంగా ముగిసింది.

ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆరాధ‌న చేసి హోమాలు, మంత్ర పూరిత‌మైన వాయువుల‌ను స‌మ‌స్త ప్ర‌పంచానికి సూర్య మండ‌లం ద్వారా అందించిన‌ట్లు తెలిపారు. మంత్ర ప‌ఠ‌నాన్ని శ్ర‌వ‌ణం చేసే అవ‌కాశాన్ని వేదంలో క‌లిగించిన‌ట్లు తెలిపారు. స‌మ‌స్త ప్ర‌పంచంలోని వ‌నాలు, ఔష‌దాలు, చెట్లు త‌దిత‌రాలు అంతా ధ‌న్వంత‌రి స్వ‌రూపాల‌న్నారు. క‌రోనా వంటి కంటికి క‌న‌ప‌డ‌ని విప‌త్తు ప్ర‌బ‌లిన‌ప్పుడు ఈ యాగం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉప‌స‌మ‌నం క‌లుగుతుంద‌న్నారు. ఇందులో ప్ర‌పంచంలోని  జీవ‌రాశుల‌ను కాపాడ‌టానికి 24 క‌ళ‌శాల‌లో 24 మంది దేవ‌త‌ల‌ను మంత్ర బంధ‌నంతో ఆవాహ‌నం చేసి జ‌ప హోమాలు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌లు ధ‌న్వంత‌రి మ‌హా మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల‌న స‌మ‌స్త వ్యాధులు న‌యం అవుతాయ‌న్నారు.
ఓం ధ‌న్వానంత‌రాయ విద్మ‌హే
సుధ‌హ‌స్తాయ ధీమ‌హి
త‌న్నో విష్ణుప్ర‌చోద‌యాత్ స్వాహా
ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ధ‌న్వ‌న్త‌ర‌యే
అమృత క‌ళ‌శ హ‌స్తాయ‌
స‌ర్వ భ‌య హ‌రాయ‌
త్రిలోక‌నాధాయ విష్ణ‌వే స్వాహా.

అనంత‌రం టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ సీతారామాచార్యులు మాట్లాడుతూ ధ‌న్వంత‌రి మ‌హాయాగంలో అత‌ల‌, విత‌ల‌, సుత‌ల‌, త‌లాత‌ల‌, ర‌సాత‌ల, మ‌హాత‌ల‌, పాతాల  వంటి  7 హోమ గుండాలలో హోమాలు నిర్వ‌హించ‌డం ద్వారా 14 లోకాలలోని దేవ‌త‌ల ఆశీస్సులు మాన‌వుల‌కు క‌ల‌గాల‌ని ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేసిన‌ట్లు తెలియ‌జేశారు. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించిన‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్ర‌ధాన కుంభ మంత్ర జలాన్ని ధ‌న్వంత‌రి స్వామివారికి అభిషేకం చేసిన త‌రువాత, ఆ తీర్థ జ‌లాన్నితిరుమ‌ల‌లోని జలాశయంలో కలుపుతామ‌న్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంద‌ని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి  శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి,  సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌,  ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి, రుత్వికులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉండాలి –  విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు

తిరుమ‌ల‌లో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హించిన ధన్వంతరి మహాయాగం వ‌ల‌న శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు  భారత ప్రధాన మంత్రి గౌ|| శ్రీ నరేంద్రమోడి, ఆంధ్ర‌, తెలంగాణ‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, గౌ|| శ్రీ కె.చంద్ర‌శేఖ‌ర్‌రావులు దేశ‌, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోర‌కు, స‌మాజం కొర‌కు ప్ర‌జ‌లు త‌మ త‌మ ఇళ్ల‌లో ఉండాల‌ని, బ‌య‌ట‌కు రాకుడ‌ద‌ని, జ‌న‌సందోహం ఉండ‌కూడ‌ద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో టిటిడి మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు  ప్ర‌ముఖ పండితుల‌తో తిరుమ‌ల‌లో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు ధన్వంతరి మహాయాగాన్ని ప్ర‌ముఖ నిష్ణాతులైన పండితుల‌తో టిటిడి అద్భుతంగా నిర్వ‌హించింద‌న్నారు. ఈ యాగం ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సుల‌తో  ప్ర‌పంచ మాన‌వాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ప్ర‌సాదించాల‌న్నారు.

Continue Reading

Trending

www.vsbnews.in