Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(12-02-2020)

Published

on

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి యూఎస్కు చెందిన ‘లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్’ ఆసక్తి చూపుతోందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ‘లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఏరోస్పేస్, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. పుణె కేంద్రంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీ భారత్ ఫోర్జ్ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. మెరైన్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంప్రదింపులు జరిపింది. దొనకొండ కేంద్రంగా రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్లోని సీబీఐ న్యాయస్థానాల పరిధిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గతంలో విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చిన మూడో అదనపు ప్రత్యేక జడ్జి న్యాయస్థానం పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని సీబీఐ కేసులను విచారిస్తుంది. విశాఖపట్నంలోని ఒకటో అదనపు ప్రత్యేక జడ్జి న్యాయస్థానం, ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి న్యాయస్థానాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని సీబీఐ కేసులను విచారిస్తాయి.

దక్షిణ కోస్తాలో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడొచ్చని అంచనా వేశారు. ఈశాన్య/తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వివరించారు.

వ్యవసాయశాఖలోని భూసార పరిరక్షణ విభాగం అధికారుల పోస్టుల పేర్లు, హోదాలు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ అధికారి హోదాలో ఉంటే సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్, సహాయ సంచాలకులుగా ఉన్న వారిని డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉంటే కార్యనిర్వాహక ఇంజినీర్, జేడీఏ స్థాయిలో ఉంటే పర్యవేక్షక ఇంజినీర్గా పిలవాలని పేర్కొన్నారు.

ఈ ఏడాది నుంచి వ్యవసాయ డిప్లొమో కోర్సు చేసిన వారికి ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 17 లేదా 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 17న ప్రకటన ఇస్తే 20 నుంచి,.. 20న ప్రకటన ఇస్తే 26 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఈసెట్ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి కుటుంబ ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని సుమారు 1.40 కోట్ల కుటుంబాల ఆరోగ్య వివరాలను ఆశాలు, వార్డు ఎ.ఎన్.ఎం.లు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల్లో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బు, ఇతర అనారోగ్య వివరాలను ఎలా సేకరించాలన్న దానిపై ఎ.ఎన్.ఎం.లు, ఆశాలకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అన్ని రాష్ట్రాల్లోని కుటుంబ ఆరోగ్య వివరాలను సేకరించాలని ఆదేశించింది.

ప్రత్యేక డీఎస్సీ-2000, 2001లో శిక్షణ లేకుండా నియమితులైన ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసినట్లు ఉపాధ్యాయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు తెలిపారు. టీటీసీ శిక్షణ పూర్తయ్యే కాలం వరకు ఎస్టీ ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. ప్రభుత్వశాఖల ఉద్యోగుల తరహాలోనే రోజూ ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు వీరు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి.

రాష్ట్రంలోని 76 పట్టణాల్లో రూ.112.56 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతులిచ్చింది. వీటి నిర్వహణకు మరో రూ.97.25 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్)గా పట్టణ ప్రాంతాలను ప్రకటించాక 76 చోట్ల మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల ఏర్పాటు అవసరాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సంస్థ గుర్తించి, ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

కర్నూలు కోట్ల కూడలిలో ఈ నెల 12న నిర్వహించే బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పాల్గొంటారు. విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలను నిరసిస్తూ, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్తో ఆ రోజు ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటుచేశారని పార్టీ నాయకుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. పవన్ 13న కర్నూలు, ఎమ్మిగనూరుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సమస్యలను తెలుసుకుంటారు.

పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ‘అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు నన్ను 5 రోజులు గృహ నిర్బంధంలో ఉంచారు. అమరావతి కోసం జైలుకైనా వెళ్తాను. వెనక్కి తగ్గేది లేదు. త్వరలో నేనూ మీ దీక్షలో పాల్గొంటాను’ అని పేర్కొన్నారు అమరావతి పరిరక్షణ సమితి కో-కన్వీనర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనం కోసం కాకుండా సీఎం జగన్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు.

‘కర్నూలును రాజధానిగా కోరుకోవడం మా ప్రాంత హక్కు’ అని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని మాత్రమే కాదు.. మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. 2024 వరకు హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి నాయకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చి ఒక పరిపాలనా భవనం ఏర్పాటు చేశారన్నారు. బస్సుల్లోనే తిరుగుతూ నాలుగు నెలలు అప్పట్లో చంద్రబాబు పరిపాలన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పరిపాలన ఎలా చేస్తారని అడుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి పెట్టిన రోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర వారి అభిప్రాయాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

ఏపీలో భూముల క్రయ, విక్రయాల అనంతరం పేరు మార్పు కోసం ఇక తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఇందుకు వీలుకల్పించే ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త విధానంలో భూములు కొనుగోలు చేసిన వారు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు.

చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. మరో 42,638 వేల మందికి వైరస్‌ సోకింది. ఒక్క సోమవారం రోజే 108 మంది ప్రాణాలొదిలారు. మరో 2,478 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క హుబెయ్‌ ప్రావిన్సులోనే సోమవారం 103 మంది మృతిచెందారు. ఇక వైరస్ బారి నుంచి బయటపడి 3,996 మంది ఇళ్లకు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 56వ రోజు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఉదయం నుంచే మహిళలు సాయినామ స్మరణ, హనుమాన్‌ చాలీసా పఠనం చేపట్టారు. పలువురు యువకులు అమరావతికి మద్దతుగా 24గంటల దీక్షకు కూర్చున్నారు.

ఫిబ్రవరి-14న ప్రేమికులకే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో కాంగ్రెస్ తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పుడు మళ్లీ ఆప్ అధికారంలోకి రానుండటంతో ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లవర్స్ డే క్రేజీ.. కేజ్రీవాల్ కు వర్కౌట్ అవుతుందంటున్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌ సాయికృష్ణ ప్రతికా ప్రకటన ఇచ్చారు. తాను ఏ ప్రభుత్వ శాఖతో ఏ రకమైన వ్యాపారం చేయలేదన్నారు. తాను ఏ టెండర్‌లో పాల్గొనలేదన్నారు. తాను ఇప్పటి వరకు చేసింది ప్రైవేట్ సెక్టార్‌లోనే అని స్పష్టం చేశారు. తన తండ్రిని ఉపయోగించుకుని వ్యాపారం చెయ్యడం గానీ.. లాభం పొందడం గానీ చెయ్యలేదన్నారు. జరుగుతున్న విషప్రచారంపై సమాధానం చెప్పడానికి తన తండ్రికి పరిమితులున్నాయన్నారు. రాజకీయ విష ప్రచార బాధితుడినైనా తన పేరు బజారుకు లాగడం ఇకనైనా ఆపాలన్నారు. లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తానని చేతన్ సాయికృష్ణ అన్నారు.

రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. లేకపోతే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. పవన్ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడింది. న్యాయరాజధానిపై పవన్ వైఖరేంటో తెలపాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఖబడ్దార్ అని రాయలసీమ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.

సచివాలయం ఎదుట ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల బైఠాయింపు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం 13 జిల్లాల నుంచి విడివిడిగా సచివాలయానికి చేరుకుని ఒక్కసారిగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాన్ని ఊహించని పోలీసులు వెంటనే తేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

గూడులేని నిరుపేదలకు తమ వంతుగా ఏదైనా చేయాలని భావించారా దంపతులు. రూ.1.5 కోట్ల విలువైన తమ భూమిని ఇళ్ల స్థలాల కోసం దానంగా ఇచ్చారు. గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గూడవల్లికి చెందిన వ్యాపారవేత్త ముప్పవరపు రఘునాథ్, వైద్యురాలు రావిపాటి కరుణశ్రీ దంపతులు హైదరాబాద్లో స్థిరపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టికలను(ఎన్పీఆర్) నిరసిస్తూ సోమవారం చిత్తూరులో వేలాది మంది ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నేపథ్యంలో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకునేందుకు… బుధవారం విజయవాడలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు. విలీనంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికతో అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున, సిబ్బంది ప్రయోజనాల రక్షణపై చర్చిస్తామని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజాసంపదను కొల్లగొట్టి, కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందని, అందుకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ను రూపొందించిందని వామపక్షాలు విమర్శించాయి. సోమవారం హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు తదితర వామపక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ ఈ నెల 12 నుంచి 18 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, ఈనెల 16న సదస్సు నిర్వహించాలని తీర్మానించారు. సీఏఏ, ఎన్ఆర్సీల రద్దు డిమాండ్పై మార్చిలో లక్ష మందితో హైదరాబాద్లో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తక్షణమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్రానికి తెరాస ఎంపీ కేశవరావు సూచించారు. ఉద్యోగాల్లో పదోన్నతులకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోత్ ఓ ప్రకటన చేశారు. దీనిపై కేశవరావు స్పందిస్తూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పుతో దేశం మొత్తం షాక్కు గురైంది. తక్షణమే కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో సభకు వస్తే రాజ్యాంగ సవరణ చేద్దాం’’ అని కేశవరావు పేర్కొన్నారు.

దేశంలో అనిశ్చితి, భయం నెలకొన్నాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తూ ఆర్థిక రంగం దిగజారుతున్నా ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని అంటున్నారు. అది కాదు..ఆర్థిక వ్యవస్థను ఐసీయూ బయటే ఉంచారు. సమర్థత లేని వైద్యులు దానికి చికిత్స చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. సమర్థులైన వైద్యులు (రఘురాం రాజన్, అరవింద్ సుబ్రమణియన్, అరవింద్ పనగడియా, ఊర్జిత్ పటేల్ వంటి ఆర్థిక రంగ నిపుణులు) బయటకు వెళ్లిపోతున్నారు. మీ వైద్యులు ఎవరో చెప్పండి. ప్రభుత్వం ఇతర ప్రతిపక్షాల్లోని మంచి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేదు’’ అని వ్యాఖ్యానించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతుగా హైదరాబాద్లో భాజపా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాజపా ఈ నెల 11 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సదస్సులు నిర్వహించనుంది. ఈ ప్రచారం ముగింపు కార్యక్రమంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరు కావాలని అమిత్షాకు లేఖ రాశామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ను సభకు ఆహ్వానించాలని భాజపా నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ వచ్చే ఏడాది జరగబోయే శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. మరోవైపు త్వరలోనే 107 స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగనుండటంతో బడ్జెట్‌ను ప్రజాకర్షకంగా తీర్చిదిద్దారు. ఈ పదవీ కాలంలో ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టే తుది సంపూర్ణ బడ్జెట్ ఇదే కావడంతో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకోవడానికి కృషి చేశారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సోమవారం శాసన సభకు బడ్జెట్‌ను సమర్పించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన వర్గాలను తిరిగి టీఎంసీవైపు తిప్పుకునేందుకు ఈ బడ్జెట్‌లో ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన మతువా సామాజిక వర్గాన్ని తిరిగి టీఎంసీవైపు ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ర్‌గ్రామ్‌లో బిర్సా ముండా విశ్వవిద్యాలయం, ఎస్సీలు అధికంగా కల ప్రాంతంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఓబీసీల విద్యాభివృద్ధికి దోహదపడేందుకు మరొక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మమత బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఓ విశ్వవిద్యాలయానికి మన దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టబోతున్నారు. ఈ మూడు విశ్వవిద్యాలయాలను రాబోయే రెండేళ్ళలో ఏర్పాటు చేస్తారు. 60 ఏళ్ళ వయసు పైబడిన ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.1,000 పింఛను ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు.

సీఎం జగన్‌కు అవగాహన లేకే అమరావతి నిర్మాణంపై అవివేకంగా మాట్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. విజయవాడలోని కానూరులో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి ఆయన హాజరై నేతలనుద్దేశించి ప్రసంగించారు. అమరావతి పోరాటంలో మృతిచెందిన రైతులకు నేతలు సంతాపం తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకున్న పార్టీ ఎమ్మెల్సీలను ఈ సందర్భంగా చంద్రబాబు సన్మానించారు.

గాంధీ ఆస్పత్రి ఘటనపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు. వైద్యులను దుర్భాషలాడినందుకే డాక్టర్ వసంత్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. వసంత్ ఇష్టారీతిన బుతులు తిట్టినట్లు ఇతర వైద్యులు ఫిర్యాదు చేశారని, దాంతో వసంత్‌పై సూపరింటెండెంట్ చర్య తీసుకున్నారని చెప్పారు. కరోనాపై నోడల్ ఆఫీస్ తప్ప ఎవరూ మాట్లాడొద్దని డీఎంఈ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని వసంత్ తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని రమేష్ రెడ్డి ప్రశ్నించారు. డీఎంఈ కింద ప్రమోషన్లు ఇస్తామంటే అర్హత కలిగిన వారు లేరని వివరించారు. వసంత్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ తెలిపారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకోవడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ స్పందించారు. పై స్థాయిలో ఉన్న నేతలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంతటి దుస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. ‘‘మేము ఢిల్లీలో మళ్లీం ఓడాం. ఆత్మపరిశీలనకు సమయం చాలించి, నేరుగా చర్యలకై రంగంలోకి దిగాల్సిందే’’ అని స్పష్టం చేశారు. పై స్థాయిలో ఉన్న నేతల ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహం లోపించడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లడం, కార్యక్షేత్రంలోని కార్యకర్తలతో నేతలకు సత్సంబంధాలు లేకపోవడం… ఇవన్నీ పార్టీ ఘోర ఓటమికి కారణాలని ఆమె తేల్చారు. ఈ ఓటమికి నైతికంగా తానూ బాధ్యత వహిస్తానని షర్మిష్ఠ ప్రకటించారు.

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, పన్నుల వసూళ్లతో పాటు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం తగ్గుతోందని చెప్పారు. బిల్లులపై కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది కానీ… రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రాలకు నిధులు తగ్గించి జమ్మూకశ్మీర్‌కి కేటాయించడం సరికాదన్నారు. జమ్మూకశ్మీర్‌కు గ్రాంట్‌ల రూపంలో నిధులు ఇవ్వాలని తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్‌ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరైంది కాదని కోదండరాం అన్నారు.

భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులను బీహెచ్ఈఎల్, ఇండియాబుల్ సంస్థల నుంచి మెగా కంపెనీకి అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. భద్రాద్రిలో 1040 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగిస్తే ఆ సంస్థ నుంచి ఇండియాబుల్కు ఇచ్చారన్నారు. ఇప్పుడు మెగా కంపెనీకి కట్టబెట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సోమవారం ఆయన కొడంగల్లోని నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2011లో అప్పగించిన భద్రాద్రి ప్రాజెక్టు పనులు 2016లోపు పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తవ్వలేదన్నారు. అలాగే 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టును రూ.30 వేల కోట్లకు బీహెచ్ఈఎల్ తీసుకొంటే, దానినీ మెగా కంపెనీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పారు.

చైనాని వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్‌ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్‌ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్‌ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్‌ నుంచి దుబాయ్‌కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఒకప్రక్కరెండు తెలుగురాష్ట్రాలలో అమ్మయిలు,మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే మరోపక్క ఏపిలో అమ్మవారి జాతర్లుమాత్రం యువతను రెచ్చగోట్టేవిధం మారాయి.తాజాగా పశ్చిమగోదావరాజిల్లా పోడూరుమండలం శ్రీమారేమ్మ,పోలేరమ్మ అమ్మవారి జాతరలో అర్థరాత్రివరకు అర్కేస్ట్రాల మాటున అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్లు హోరేత్తాయి. సుమారు 19స్టేజీలపై ప్రోగ్రాంలలో ఇలా అమ్మాయిల నృత్యాలు కోనసాగాయి ముక్కలేనిదే మందుదిగదు చుక్క,మగువలేనిదే జాతర జరగదు అన్న చంధాన మారింది అమ్మవారి జారతరలో అమ్మయిలడాన్స్ లతొ హొరేత్తిచడంపై పలువురు మండిపడుతీన్నారు.

పెక్షన్ లబ్దిదారుల విషయంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో టిడిపి ఎమ్మెల్యేలు నిరసన బాట పడుతున్నారు.తూర్పునియోజకవర్గ పరిదిలో తొలగించిన పెక్షన్లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పెక్షన్ లబ్దిదారులతో కలసి జీవిఎంసీ వద్ద ఆందోళప చేపట్టారు.అనంతరం వరకూ ర్యాలీగా తరలి వెళ్లిన నేతలు నేరుగా జీవిఎంసీ కమీషనర్ సృజన దృష్టికి పెక్షన్లు రాక వృద్దులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.వారి నుంచి వినతులను స్వీకరించిన కమీషనర్ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజవర్గంపరిధిలో 3 వేలకు పైగా పెక్షన్లను తొలగించారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అధికారులు స్పందించి తొలగించిన వాటిని పరిశీలించిన పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతి విషయంలో దాఖలైన కేసులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని నియమించింది. ఇందుకోసం ఆయనకు రూ.5కోట్లు ఫీజు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే, రాజధాని కేసుల కోసం ముకుల్‌ రోహత్గీకి రూ.5కోట్ల ఫీజు చెల్లించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రోహత్గీని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని శివాజీ అనే వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ముకుల్‌ రోహత్గీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను ప్రభుత్వం తొలగించింది.గతంలో గన్‌‌మెన్‌లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన జగన్ ప్రభుత్వం తాజాగా పూర్తి భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.జేసీకి భద్రత తొలగింపు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జేసీకి భద్రతను తొలగించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం లక్ష్యంగానే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జేసీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడంతో పాటు, జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూముల రద్దుతో పాటు ఇతర కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రధాన అనుచరులపైనా పోలీసులు కేసులు పెట్టడం, పీడీయాక్ట్‌లు పెట్టి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంపై జేసీ బ్రదర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని పలుమార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైహోమ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లోని కోకాపేటలో అతిపెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది. ఇందులో 5.82 ఎకరాల స్థలంలో 4 బ్లాకులుగా… ఒక్కో బ్లాకులో 32 అంతస్తులతో 660 అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. ఒక్కో అపార్ట్మెంట్ 1957 లేదా 2235 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కాంప్లెక్స్లోనే జిమ్, సూపర్ మార్కెట్, గెస్ట్ రూములు, క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నట్లు మైహోమ్ కన్స్ట్రక్షన్స్ వివరించింది.

హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ‘డియో’ 110 సీసీ స్కూటర్ను బీఎస్-6 ఇంజిన్తో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం దీనిని విపణిలోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. స్టాండర్డ్ ధర రూ.59,990 కాగా.. డీలక్స్ ధర రూ.63,340 (దిల్లీ, ఎక్స్షోరూం). ‘దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్కూటర్లలో డియో ఒకటి. ఎక్కువగా ఎగుమతి అయ్యే వాటిల్లోనూ ఇది ఉంది. ఇప్పుడు బీఎస్-6 ఇంజిన్, సరికొత్త సాంకేతికత, స్పోర్టీ డిజైన్తో కొత్త డియోని తీసుకొచ్చాం. ఇది కూడా యువతకు అమితంగా నచ్చుతుందని, వినూత్న అనుభూతిని పంచుతుందని అనుకుంటున్నామ’ని హెచ్ఎమ్ఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (విక్రయాలు, మార్కెటింగ్) యద్విందర్సింగ్ గులేరియా ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్కు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

భారతీయ క్యాబ్‌ సర్వీసుల కంపెనీ ఓలా లండన్‌లో తన సేవలను మొదలుపెట్టింది. సోమవారం నుంచి లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ 25వేల మంది డ్రైవర్లు ఓలా ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక వీరికి ఇప్పటికే హై లెవల్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చామని ఓలా కంపెనీ తెలిపింది. దీంతో ప్రయాణికులు సులభంగా ఓలా క్యాబ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. కాగా క్యాబ్‌ సేవల ప్రారంభం సందర్భంగా లండన్‌లోని కస్టమర్లు మొదటి వారం రోజుల పాటు 25 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల (దాదాపుగా రూ.2300) విలువైన వోచర్లను పొందవచ్చని ఓలా తెలిపింది. అలాగే మొదటి 6 వారాల పాటు తమ డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్‌ను తీసుకోబోమని ఓలా తెలిపింది. కాగా ఇప్పటికే యూకేలోని బర్మింగ్‌హామ్‌, లివర్‌పూర్‌, రీడింగ్‌ సిటీలలో ఓలా క్యాబ్‌ సేవలను గత 7 నెలల కాలంలో ప్రారంభించగా ఇప్పుడు ఆ జాబితాలోకి లండన్‌ వచ్చి చేరడం విశేషం.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కరోనా ప్రభావంతో వరుసగా రెండు రోజులు నష్టాలను చవిచూసిన మార్కెట్లు నేడు ఆ భయం నుంచి కాస్త తేరుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 236 పాయింట్లు లాభపడి.. 41,216 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 12,110 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.30 వద్ద కొనసాగుతోంది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా మరణాలు పెరుగుతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్‌ బ్యాంకు, నెస్ట్‌లే, భారత్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.

చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ 8ఎ డ్యుయల్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో.. 6.22 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌, డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌ స్లాట్స్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌, యూఎస్‌బీ టైప్‌ సి.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్‌ కేర్‌ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాంటి వారి మాటలు నమ్మవద్దని, వారికి వినియోగదారులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం ఇవ్వవద్దని స్విగ్గీ హెచ్చరించింది

చైనాలోని సగం ప్రావిన్స్ దేశాలు పరిశ్రమల మూతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా ప్రభావమున్న ప్రాంతాల నుంచి కార్మికులు వెనక్కి తిరిగి రాకుండా ఉండేందుకు కొత్త ఏడాది సెలవులను ఫిబ్రవరి 17 వరకు పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. చైనాలోని కొన్ని అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీలు వచ్చే రెండు వారాలకు కానీ తయారీని తిరిగి మొదలుపెట్టే యోచనలో లేవు. మరికొన్ని ఎప్పటి నుంచి తయారీ ప్రారంభించాలో ఇంకా తేల్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17 తేదీని కూడా పొడిగించకుండా ఉంటారన్న హామీ ఏమీ కనిపించడం లేదు. కంపెనీలు ఇలా మూతపడి ఉన్నంతకాలం అనిశ్చితి పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.575 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంత క్రితం ఆర్థిక సంత్సరం ఇదే సమయంలో బ్యాంకు రూ.153 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ‘సమీక్షా త్రైమాసికంలో ఎస్సార్ స్టీల్, రుచి సోయా, ప్రయాగ్రాజ్ పవర్ జనరేషన్ సంస్థల నుంచి రూ.2,000 కోట్ల రికవరీ రావడంతో లాభం బాగా పెరిగింద’ని బ్యాంకు ఎండీ, సీఈఓ రాజ్కిరణ్ రాయ్ వెల్లడించారు. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 15.66 శాతం నుంచి 14.86 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 8.27 శాతం నుంచి 6.99 శాతానికి పరిమితమయ్యాయి.

గ్రీస్లో విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సోమవారం ఇక్కడ వెల్లడించింది. గ్రీస్లోని క్రెటే ప్రాంతంలో నూతన హెరక్లియాన్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టును గ్రీస్ సంస్థ అయిన జీఈకే తెర్నాతో కలిసి జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని నిర్మించటంతో పాటు 35 ఏళ్ల పాటు నిర్వహణ హక్కులు కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎమ్ఈలు) ప్రయోజనం కల్గుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సిహెచ్.ఎస్.ఎస్.మల్లికార్జునరావు అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా చేరనున్న నిధులతో ఎంఎస్ఎమ్ఈలకు రుణ లభ్యత మెరుగువుతుందని అన్నారు.

జనవరిలోనూ దేశీయ ప్యాసింజర్ అమ్మకాలు 6.2 శాతం తగ్గాయని వాహన పరిశ్రమ సంఘం సియామ్ తెలిపింది. వృద్ధి రేటు నెమ్మదించడం, ధరల పెంపు ప్రభావంతో వాహనాల గిరాకీలో స్తబ్దత కొనసాగిందని సియామ్ ప్రెసిడెంటు రాజన్ వధేరా అన్నారు. బీఎస్-4 నుంచి బీఎస్-6 ఉద్గార నిబంధనలకు మారాల్సి ఉండటం, ముడి సరుకు వ్యయాలు పెరగడంతో కంపెనీలు వాహన ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే మౌలికం, గ్రామీణ ప్రాంతాలకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలు మున్ముందు గిరాకీ పుంజుకునేందుకు తోడ్పడుతాయని వధేరా చెప్పారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(16-02-2020)

Published

on

By

వైకాపా ..ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘నాకు పదవులు కాదు..నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధం. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా’’ అని అంజాద్‌ బాషా అన్నారు.

మెట్రో రైలు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రైలు వస్తే పాత నగర రూపురేఖలు మారిపోతాయి. పాత నగరానికి మెట్రో రాకుండా మజ్లిస్‌ పార్టీ అడ్డుకుంటోంది. మజ్లిస్‌ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిన వైకాపా రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ర్యాలీలు ఎలా చేస్తుందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ ప్రశ్నించారు. దీనికి వైకాపా నేతలు సమాధానం చెప్పాలన్నారు. వైకాపా నేతలు కేంద్రానికి చెప్పే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అంటున్నారనీ.. అదే నిజమైతే లిఖితపూర్వక ఆధారాలు చూపాలన్నారు.

దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌డేను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణతోపాటు నటి రష్మిక, క్యాన్సర్‌ను జయించిన పలువురు చిన్నారులు.. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 909 పీఏసీఎస్‌లు ఉండగా.. 157 ఏకగ్రీవమయ్యాయి.మిగతా సొసైటీలకు శనివారం పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం పోలింగ్‌ నమోదైంది. 6,248 వార్డుల్లో సభ్యులైన రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమవంతు సహకారం అందిస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీని చైనా ప్రశంసించింది. చైనాకు వైద్య సహాయం అందిస్తోన్న 33దేశాల జాబితాను తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఆ జాబితాలో భారత్‌ లేనప్పటికీ..ప్రధాని మోదీ చైనాకు సహకారం అందిస్తామని చేసిన ప్రకటనను అభినందించింది.

ఇక నుంచి పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం వాహన తయారీ సంస్థలను కోరింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-4 ఇంజిన్‌తో కూడిన వాహనాల విక్రయాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాహన తయారీదారులు తప్పకుండా బీఎస్‌-6 ప్రమాణాలతో వాహనాలను తయారు చేసి విపణిలోకి విడుదల చేయాల్సి ఉంటుంది.

ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ఏదైనా టెలికాం సంస్థ దివాళా తీసినట్టు దరఖాస్తు చేస్తే బ్యాంకులు ఆ మొత్తం విలువను చెల్లించాల్సి వస్తుందని భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ రజినీశ్‌ కుమార్‌ అన్నారు. రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలను చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. టెలికాం శాఖ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి తాము వేచిచూసే ధోరణి కనబరుస్తున్నామని ఆయన వెల్లడించారు.

డిసెంబరు త్రైమాసికంలో ఓఎన్‌జీసీ స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.4,152 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.8,263 కోట్లతో పోలిస్తే ఇది 49.8 శాతం తక్కువ. ముడి చమురు, సహజ వాయువు ధరలతో పాటు ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో లాభం క్షీణించిందని సంస్థ పేర్కొంది. ఆదాయం కూడా 14.4 శాతం క్షీణించి రూ.23,710 కోట్లకు పరిమితమైంది. ముడి చమురు ఉత్పత్తి 1 శాతం తగ్గి 4.82 మిలియన్‌ టన్నులు నమోదు కాగా, గ్యాస్‌ ఉత్పత్తి 8.4 శాతం తగ్గి, 5.875 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా నమోదైంది.

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి.

జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం. కారులో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు గన్ మెన్, డ్రైవర్ ఉన్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, డ్రైవర్ ,గన్ మెన్ విజయవాడలోనే ఎం జె. నాయుడు హాస్పిటల్ కి తరలింపు. ప్రధమ చికిత్స అనంతరం తన పర్యటన కు వెళ్లిపోయిన బ్రదర్ అనిల్ కుమార్.

హత్యా రాజకీయాలతో రికార్డుల్లో ఉన్న సూర్యాపేట గ్రామీణ మండలం యార్కారం గ్రామం మరోసారి పాత కక్షలతో భగ్గుమంది. గ్రామ మాజీ సర్పంచి, తెరాస నాయకుడు ఒంటెద్దు వెంకన్న అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. సహకార సంఘ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉన్న వెంకన్నను ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో వెంబడించారు. ప్రాణభయంతో ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్న వెంకన్నను తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వాహనంపై ప్రయాణిస్తూ అలసి నిద్రమత్తులోకి జారుకున్న వ్యక్తి రహదారిపై జారి పడి దుర్మరణం చెందిన వైనమిది. భీమడోలు ఎస్‌ఐ కె.శ్రీహరిరావు కథనం మేరకు వివరాలు… నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన మాచర్ల ఏసు ఒక బ్యాండు ట్రూపులో పనిచేస్తుంటారు. ఇటీవల వరసగా వివాహ శుభముహుర్తాలు ఉండటంతో వివిధ ప్రాంతాలకు బ్యాండు బృందంతో కలసి వెళ్తున్నారు. గురువారం రాత్రి వీరి బృందం ద్వారకా తిరుమలలో జరిగిన ఓ వివాహంలో బ్యాండు వాయించి, శుక్రవారం తెల్లవారుజామున మినీ వ్యానులో(ఐషర్‌) పైభాగంలో కూర్చుని పెదతాడేపల్లిలో జరిగే మరో వివాహ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పూళ్ల దాటిన తరువాత కోడూరుపాడు పరిధిలోకి వచ్చే పెట్రోలు బంకు సమీపంలో నిద్రమత్తులో ఉన్న ఏసు (32) వాహనం పై నుంచి జారి, రహదారిపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. బృందంలో మిగిలిన సభ్యులు ఈ ప్రమాదాన్ని గమనించకుండా తాడేపల్లిగూడెం వరకు వెళ్లిపోయారు. మృతుడి జేబులోని చరవాణి ద్వారా హైవే పెట్రోలింగు సిబ్బంది వారికి సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య మాచర్ల బాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన ఆ తండ్రికి పుత్రశోకమే మిగిలింది. బంగారు భవిష్యత్తు కోసం ఎంచుకున్న పాఠశాలలో మందలింపే ఆయన కుమారుడికి మరణశాసనం రాసింది. వైస్‌ ప్రిన్సిపల్‌, అకౌంటెంట్‌ బెదిరించడంతో భయపడి పాఠశాల భవనం పైనుంచి దూకిన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన వివరాలను ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావు ఎస్సార్‌నగర్‌లోని సాయిటవర్స్‌లో కాపలాదారుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు మహేశ్‌(14) బీకేగూడ సమీపంలోని జయప్రకాశ్‌నగర్‌ విశ్వభారతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29న మహేశ్‌ తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌తోపాటు అకౌంటెంట్‌ బెదిరించారు. మహేశ్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులను కొట్టిన వైస్‌ ప్రిన్సిపల్‌ ముగ్గురిని కార్యాలయం వద్ద నిల్చోబెట్టారు. టీసీ ఇచ్చిస్తానని హెచ్చరించారు. ఆ సమయంలో తనకు భోజనం తీసుకొచ్చే తండ్రికి విషయం తెలిసిపోతుందని భయపడ్డ మహేశ్‌.. పాఠశాల భవనంపైకి చేరుకొని మూడో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. జగన్‌ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు’’ అని పవన్‌ అన్నారు.

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పిస్తామన్నారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. అనుమతి లేకుండా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు. ఈ మేరకు రూ.5వేలు జరిమానా కట్టాలంటూ శనివారం నోటీసులు జారీచేశారు. అధికారుల నోటీసులకు స్పందించిన మంత్రి తనకు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఎంపీ, భాజపా నేత టీజీ వెంకటేశ్‌ అన్నారు. భాజపా, వైకాపా కలయికను పైస్థాయిలో నిర్ణయిస్తారన్నారు. వైకాపా అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చాయి గనకే బొత్స అలా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో భాజపా వల్లే వైకాపాకు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.

దిల్లీ పర్యటనలో ఏం మాట్లాడారో కూడా చెప్పలేనిస్థితిలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ, అమిత్‌ షాతో ఏం మాట్లాడారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. దిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రంలో ఏముందో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మంత్రులతో ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్డీయేలో వైకాపా చేరే అంశంపై తమకెలాంటి సమాచారం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా, వైకాపాలకు సమదూరం పాటించాలనేదే తమ పార్టీ నిర్ణయమని స్పష్టంచేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే మోదీ, అమిత్‌ షాలతో జగన్‌ భేటీ అయి ఉంటారన్నారు. బొత్స ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదని చెప్పారు. ఈ అంశం గురించి గతంలో కూడా ఎప్పుడూ చర్చ జరిగిన సందర్భంలేదన్నారు.

గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంవ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. వసంత్‌ వైద్యుడిగా ఉండి ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. గాంధీలో పరిణామాలపై ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యమని పేర్కొన్నారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ ఏడేళ్లకే దూరమైతే ఆ తల్లి పడే కడుపుకోత వర్ణనాతీతం. అలాంటిది చనిపోయిన కూతుర్ని మళ్లీ కలుసుకునే అవకాశం వస్తే.. ఆ కన్నపేగు ఉప్పొంగిపోతుంది. ఆ అనుభూతినే ఓ తల్లికి అందించింది దక్షిణ కొరియాకు చెందిన టీవీ ఛానల్‌. మన జీవితంలో నుంచి శాశ్వతంగా దూరమైన వ్యక్తులను మళ్లీ కలుసుకునే అవకాశం నిజ జీవితంలో సాధ్యం కాకపోయినప్పటికీ వర్చువల్‌ రియాల్టీతో ఓ తల్లి తన చనిపోయిన కుమార్తెను కలిసేలా చేసింది ఆ టీవీ ఛానల్‌.

మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించలేదా..?అయితే 31 మార్చి 2020నుంచి ఇక మీ పాన్‌కార్డు పనిచేయనట్లే. ఎందుకంటే మార్చి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులను పని చేయనివిగా పరిగణిస్తామని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే దీని గడువును చాలా సార్లు పొడగించామని..ఈ మార్చి వరకు లింక్‌ చేయని కార్డులని పనిచేయనివిగా గుర్తిస్తామని పేర్కొంది.

రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కానీ, అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.

గతేడాది(2018-19) అత్యధిక పెట్టుబడులతో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఐదేళ్లలో దేశవ్యాప్త పెట్టుబడుల్లో ఏపీకి రూ.70వేల కోట్లు వచ్చాయని ట్విటర్‌ లో వెల్లడించారు. వైకాపా ప్రభుత్వంలో పీపీఏలు రద్దు చేసి, వాటాల కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు. డీలర్‌ షిప్‌ల కోసం వేధింపులు తట్టుకోలేక పెట్టుబడులు వెనక్కి పోవడం బాధాకరమన్నారు.

Continue Reading

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(15-02-2020)

Published

on

By