Connect with us

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(09-02-2020)

Published

on

బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్ని గురించి ఆమె ట్రేడర్లకు వివరించారు. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇందుకోసం ఫిర్యాదుల స్వీకరణకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు సైతం ఓ కాపీని పంపాలన్నారు. ఆర్థిక మూలాలు బాగున్నందునే విదేశీ మారక నిల్వలు అధిక స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

అసత్య ప్రచారాలతో వ్యాపార ప్రకటనలు చేసే వారిపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. చర్మ సౌందర్యం, లైంగిక సామర్థ్యం పెంపు, సంతానోత్పత్తి వంటి వాటి కోసం ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులను మభ్యపెట్టాలని చూసే వ్యాపార సంస్థలకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షలు వరకు జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పులు చేయనుంది. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్‌, మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటనల చట్టం 1954)కు ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. ఇందు కోసం ముసాయిదా చట్టంలో ఉన్న వ్యాధులు, రుగ్మతల జాబితాలో పలు మార్పులు చేసింది. దాని ప్రకారం 78 రకాల వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన ప్రకటనలపై కూడా నిషేధం విధించింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని ఆర్‌బీఐ నివేదిక ఒకటి చెబుతోంది. జనవరిలో ప్రస్తుత పరిస్థితుల సూచీ (సీఎస్‌ఐ) 83.7కి చేరిందని తెలిపింది. 2015 మార్చి తర్వాత ఈ సూచీ కనిష్ఠానికి చేరడం గమనార్హం. పరపతి విధాన సమీక్ష సందర్భంగా గురువారం ‘వినియోగదారుల విశ్వాస సూచీ’ని ఆర్‌బీఐ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరలు, సొంత ఆదాయం, ఖర్చు వంటి వాటిపై సుమారు 13 నగరాల్లో 5,389 గృహ వినియోగదారుల నుంచి ఆర్‌బీఐ అభిప్రాయాలు స్వీకరించింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ పర్రిశమలను కలవరపరుస్తోంది. ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఫార్మా పరిశ్రమ మరింత భయపడుతోంది. మందుల తయారీకి అవసరమైన పలు ముడి పదార్ధాలను ఇక్కడి ఫార్మా కంపెనీలు చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఇక్కడి ఫార్మా కంపెనీలు తుది వినియోగానికి అనువైన ట్యాబ్లెట్లు, కేప్సుల్స్‌గా తయారు చేస్తున్నాయి. దాదాపు దేశీయ అవసరాల్లో 60-80 శాతం వరకూ చైనా నుంచి వస్తున్నవే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా కంపెనీలు సుమారు రూ.17,000 కోట్ల విలువైన బల్క్‌, ఏపీఐ ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ఇక్కడి ఫార్మా కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగ్గట్లుగా ముడి ఔషధాలు రావటం లేదు.

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 3 చైనా బ్యాంకులకు 6 వారాల్లోగా 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) చెల్లించాల్సిందేనని బ్రిటన్‌కోర్టు తీర్పు ఇచ్చింది. రుణ ఒప్పందం కింద అనిల్‌ నుంచి 680 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4800 కోట్ల) రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన దావాను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంబానీ నికరవిలువ సున్నాగా మారిందన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనను కోర్టు అంగీకరించలేదు. ఆయన కుటుంబం కూడా ఆదుకునే పరిస్థితి లేదనడాన్ని న్యాయమూర్తి డేవిడ్‌ వాక్స్‌మన్‌ తిరస్కరించారు. ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని రిలయన్స్‌ గ్రూప్‌ తెలిపింది. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (ముంబయి శాఖ), చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలు అనిల్‌పై దావా వేశాయి. 2012 ఫిబ్రవరిలో తీసుకున్న 925 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6750 కోట్ల) రుణానికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తును పాటించలేదనే దానిపై ఈ దావా దాఖలైంది. అలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని అంబానీ ఖండించారు.

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మళ్లీ సామాన్యుడి (ఆమ్‌ ఆద్మీ) పార్టీయే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. దిల్లీలో మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌, భాజపా హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

ఒక్క అవకాశం ఇచ్చినందుకు జగన్‌ వల్ల రాష్ట్రానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, అనర్థాలు వచ్చిపడ్డాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 7 లక్షల పింఛన్లను ఎత్తివేశారని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున పింఛన్‌, రేషన్‌ కార్డులు ఎత్తేసి జగన్‌ సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. వనదేవతల వనప్రవేశం వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

మూసీ నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా సుధీర్ రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

థాయిలాండ్‌లో ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఖోరత్‌ ప్రాంతంలో తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారందరిపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

శ్రీలంకలో ఉన్న తమిళ మైనారిటీల పట్ల ఆ దేశ ప్రభుత్వం సమానత్వం, న్యాయం, గౌరవం చూపిస్తుందన్న విశ్వాసం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత పర్యటనకు విచ్చేసిన శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సతో మోదీ శనివారం సమావేశమయ్యారు. ‘భారత్‌, శ్రీలంక రెండూ కేవలం పక్క దేశాలే కాదు.. మంచి స్నేహితులు కూడా. శ్రీలంక అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉంది. మన ప్రాంతానికి ఉగ్రవాదం అతిపెద్ద సమస్య. మన రెండు దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలి’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

చట్టసభల్లో రాజకీయపార్టీల నాయకుల తీరుపై ఉపరాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. నిన్న పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటుగా ఉంటోందన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే గానీ శత్రువులు కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమ్‌ఇండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ ఆడనున్న విషయం తెలిసిందే. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన యువ భారత్‌.. ఆదివారం తుదిపోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌ను అందుకోనుంది. మరోవైపు సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల మధ్య నాలుగు రోజుల విశ్రాంతి దొరకడంతో ఆటగాళ్లను విహార యాత్రకు తీసుకెళ్లింది టీమ్‌ఇండియా యాజమాన్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

చైనా నుంచి వచ్చిన భారత్‌కు చేరుకున్న కేరళ విద్యార్థులను నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. వారిలో కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళకు చెందిన 15 మంది విద్యార్థులు హుబేయి ప్రావిన్స్‌లో చిక్కుకుపోయారు. వాళ్లందరూ శుక్రవారం రాత్రి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

కర్తార్‌పూర్‌ నడవాను పాస్‌పోర్టు లేని భారతీయులు సందర్శించుకునేందుకు వీలుగా ప్రతిపాదనను పాకిస్థాన్‌ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్‌ షా తెలిపారు. ‘ప్రస్తుతం కర్తార్‌పూర్‌ నడవాను సందర్శించాలంటే భారతీయులు తప్పనిసరిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఇక నుంచి పాస్‌పోర్టు లేకపోయినా కర్తార్‌పూర్‌ను సందర్శించేందుకు అనుమతించాలి’ అని ఇజాజ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

FAST NEWS

నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది:

Published

on

బాలీవుడ్ లో నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది: ఏఆర్ రెహమాన్

బాలీవుడ్ లో బంధుప్రీతిపై స్పందించిన రెహమాన్

సమయానికి ట్యూన్లు ఇవ్వడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి

దిల్ బేచారా దర్శకుడికి తనపై చాడీలు చెప్పారన్న రెహమాన్

భారతదేశ ఖ్యాతిని ఆస్కార్ యవనికపై రెపరెపలాడించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలను ఓ గ్యాండ్ అడ్డుకుంటోందని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ, సినిమాలు తనవరకు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.

సకాలంలో బాణీలు ఇవ్వడంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ ముఠానే కారణమని అన్నారు.

సుశాంత్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని, రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఆ చిత్ర దర్శకుడు ముఖేశ్ ఛాబ్రాకు పలువురు చెప్పారని, కానీ ఛాబ్రాకు 48 గంటల్లో 4 పాటలకు ట్యూన్లు ఇచ్చానని రెహమాన్ తెలిపారు.

తాను మంచి సినిమాలను ఎప్పుడూ వదులుకోవాలని భావించలేదని, మ్యూజిక్ లవర్స్ తననుంచి ఎంతో ఆశిస్తుంటే ఓ గ్యాంగ్ అందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Continue Reading

FAST NEWS

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి…

Published

on

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: బీజేపీకి ఉద్ధవ్ థాకరే సవాల్

మా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది

బీజేపీతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు

చైనా మనకు మిత్రదేశంగా మారొచ్చేమో

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, రాజస్థాన్‌లో కూల్చేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉద్ధవ్.. బీజేపీపై నిప్పులు చెరిగారు.

ఆ పార్టీతో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు.

తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు.

చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు.

ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు.

కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.

Continue Reading

FAST NEWS

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

Published

on

వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది: దేవినేని ఉమ…

కృష్ణా: వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడారు. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్‌ మరణానికి కారణమయ్యారు. నలంద కిషోర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in