Connect with us

Entertainment

ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , జనవరి 29 , VSB NEWS :

మరో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
ఇటీవలే యూనిట్ తో జాయిన్ అయిన అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్ కు స్వాగతం పలికిన ఎన్టీఆర్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఆర్ఆర్ఆర్ సెట్స్ పై అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అజయ్ దేవగణ్ కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్నారు. “మా ఆర్ఆర్ఆర్ లోకంలోకి అజయ్ దేవగణ్ సార్ కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోని ఫొటోలో ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

గడ్డి తింటావా’ పాట రిలీజ్ చేసిన వర్మ

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 20 VSB NEWS :

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రం నుంచి ‘గడ్డి తింటావా’ అనే పాట రిలీజైంది. వర్మ ‘ ఆన్ లైన్ లో ఈ పాట విడుదల చేసిన అనంతరం సోషల్ మీడియాలో వెల్లడించారు. పక్కా సెటైరికల్ గా ఉన్న ఈ పాట బాణీ కంటే భావమే ప్రధానంగా సాగింది. కాగా, పవర్ స్టార్ చిత్రాన్ని జూలై 25న తన ‘ఆర్జీవీవరల్డ్ థియేటర్ డాట్ కామ్’ వెబ్ సైట్లో రిలీజ్ చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. వర్మ ఇప్పటికే ట్రైలర్ తో సహా సినిమాకు కూడా ఓటీటీ రేట్లు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Continue Reading

Entertainment

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!

Published

on

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు సొంతం
చేసుకుంది.
నిన్న యూనిట్ సినిమా ఫస్ట్ లుక్
విడుదల చేయగా, #Radheshyam హాష్ ట్యాగ్ తో
డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
దీంతో తక్కువ సమయంలో సింగిల్ హాష్ ట్యాగ్ తో
3.8 మిలియన్లు.. 24 గంటల్లో 6.3 మిలియన్లకు
పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. సింగిల్
హాష్ ట్యాగ్ తో ఈ స్థాయిలో ట్వీట్లు రావడం ఇదే
తొలిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Continue Reading

Entertainment

నెక్ట్స్ మూవీ మహేశ్‌తోనే

Published

on

తెలంగాణ , ఏప్రిల్ 19, VSB NEWS :

 

రాజమౌళి దర్శకత్వంలో ఇంతవరకు మహేశ్ బాబు నటించలేదు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేశ్‌కు చాలా ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న ఎదురైంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో చేస్తానని మహేశ్ చెప్పారు. అయితే తాజాగా రాజమౌళి తన తదుపరి చిత్రం  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మహేశ్‌తోనా, ప్రభాస్‌తోనా అనే మాటలు వినబడుతున్నాయని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని టీవీ9 యాంకర్ దీప్తి, రాజమౌళిని ప్రశ్నించింది.

అది నిజమేనని..  ప్రొడ్యూసర్ దానయ్యగారితో ఆర్.ఆర్.ఆర్ అయిపోగానే.. నిర్మాత నారాయణ గారి నిర్మాణంలో మహేశ్ బాబుతో తన కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని రాజమౌళి స్పష్టంచేశారు. మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న కాంబినేషన్ ఇది. రాజమౌళి క్లారిటీతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రాంచరణ్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే

Continue Reading

Trending

www.vsbnews.in