Connect with us

Business

రూ.1కే 1 జీబీ డేటా..

Published

on

 

బెంగళూరు, జనవరి 28 , VSB NEWS :

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వైఫై డబ్బా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూపాయికే ఒక జీబీ డేటాను అందిం చనున్నట్లు ప్రకటించింది.

సోమవారం సంస్థ సీఈవో కంరం లక్ష్మణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

రూపాయికే ఒక జీబీ డేటాను ప్రయోగాత్మకంగా బెంగళూరులో అందజేయబోతున్నామని, ఇక్కడ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అందజేస్తామని చెప్పారు.

మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా ‘వైఫై డబ్బా’కు ఎవరైనా కనెక్ట్‌ కావచ్చని చెప్పారు.

టీ దుకాణాలు, వ్యాపార కూడళ్లలో లభించే ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవ లను పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Published

on

 

 

ఆంధ్రప్రదేశ్‌,   విశాఖపట్నం, మార్చి 21, VSB NEWS :

 

వివిధ మార్కెట్లలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,060, విజయవాడలో రూ.42,200, విశాఖపట్నంలో రూ.42,500, ప్రొద్దుటూరులో రూ.42,500, చెన్నైలో రూ.41,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,140, విజయవాడలో రూ.39,250, విశాఖపట్నంలో రూ.39,100, ప్రొద్దుటూరులో రూ.38,700, చెన్నైలో రూ.39,520గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,200, విజయవాడలో రూ.39,000, విశాఖపట్నంలో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.38,600, చెన్నైలో రూ.40,200 వద్ద ముగిసింది.

Continue Reading

Business

వినియోగదారులకు మరో షాక్

Published

on

 

న్యూఢిల్లీ:, మార్చి 07, VSB NEWS :

టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఉచిత వాయిస్ కాల్స్తో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. గతేడాది చివర్లో ఉచితాన్ని ఎత్తివేసి షాకిచ్చింది. ఇప్పుడు అంతకుమించిన షాకిచ్చేందుకు సిద్ధమైంది. వైర్లెస్ డేటా టారిఫ్లను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ. 15గా ఉన్న ఒక జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. మేరకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్కు లేఖ రాసింది. అయితే, వాయిస్ కాల్స్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న వాటినే యథావిధిగా కొనసాగించనున్నట్టు లేఖలో పేర్కొంది. ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్కు తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్లకు వర్తిస్తాయని పేర్కొంది.
టెలికం సేవల్లోని టారిఫ్ సమస్యలపై స్పందించాల్సిందిగా ట్రాయ్ కోరిన నేపథ్యంలో జియో కన్సల్టేషన్ పేపర్ను సమర్పించింది. భారతీయ వినియోగదారులు సాధారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు పొందాలనుకుంటారని, కాబట్టి పెరిగిన చార్జీలను రెండుమూడు విడతల్లో అమలు చేసే వెసులుబాటు కల్పించాలని ట్రాయ్ను కోరింది. ఒకసారి డేటా చార్జీలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని టారిఫ్లలోనూ, అన్ని సెగ్మెంట్లలోనూ అమలు చేస్తామని జియో తెలిపింది.
 

Continue Reading

Business

షాకింగ్ న్యూస్ మీ నెట్ వర్క్ ఐడియా- వోడాఫోనా?

Published

on

ఆంధ్రప్రదేశ్ , ఫిబ్రవరి 29, VSB NEWS

 

మీరు ఐడియా – వోడాఫోన్ నెట్ వర్క్ ఉపయోగిస్తున్నారా? లేదంటే.. మీ ఇంట్లో కానీ.. బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఈ నెట్ వర్క్ ఉపయోగించే వారికి దిమ్మ తిరిగిపోయే షాక్ సిద్ధమవుతుందా? అంటే అవునని చెప్పాలి. ఇప్పటికే ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంలో కిందా మీదా పడుతున్న ఈ టెలికం సంస్థ.. షాకింగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
తాజా ప్రతిపాదనతో తన నెట్ వర్క్ వినియోగించుకునే వినియోగదారుల వీపు వాచి పోయేలా టారిఫ్ ను సిద్ధం చేసిన వైనం బయట కు వచ్చింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న కాల్ ఛార్జీలతో పాటు.. డేటా చార్జీలకు కనీసం ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెంచాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.
ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలకు భిన్నంగా అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జీని నిమిషానికి ఆరు పైసలుగా నిర్ణయించింది. అదే సమయం లో ప్రస్తుతం ఒక బీజీ డేటాకు వసూలు చేస్తున్న రూ.4-5 బదులుగా ఒక జీబీకి రూ.35 మొత్తాన్ని వసూలు చేయాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాడు.. కనీస నెలసరి కనెక్షన్ ఛార్జీ రూ.50 ఉండాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది. తాను ప్రతిపాదించిన కొత్త టారిఫ్ లను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అయ్యేలా అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది.

ఈ దెబ్బతో ఈ నెట్ వర్క్ లో ఉన్న వినియోగదారులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారింది. మార్కెట్లో వినియోగదారుల వాటా తగ్గటం.. ఏజీఆర్ బకాయిల చెల్లింపు భారం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ధరల్ని పెంచాలన్న నిర్ణయం ఐడియా – వోడాఫోన్ ను ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి

 

Continue Reading

Trending

www.vsbnews.in