Connect with us

Business

ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన బీఎస్ఎన్ఎల్…

Published

on

న్యూఢిల్లీ , డిసెంబర్ 17 , VSB NEWS :

రూ.118, రూ.153, రూ.187, రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన బీఎస్ఎన్ఎల్

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పలు ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. రూ.118, రూ.153, రూ.187, రూ.399 ప్లాన్ల కాలపరిమితిని తగ్గించింది.

రూ.118 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటి వరకు ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు కాగా, ఇప్పుడు దీనిని 21 రోజులకు తగ్గించింది. ఈ ప్లాన్‌లో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 0.5జీబీ డేటా లభిస్తుంది. ఉచిత పీఆర్‌బీటీ, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

రూ.153 ప్రీపెయిడ్ ప్లాన్ ఇందులో 1.5జీబీ హైస్పీడ్ డేటా, పీఆర్‌బీటీ లభిస్తాయి. కాలపరిమితి 28 రోజుల నుంచి 21 రోజులకు తగ్గింది.

రూ.187 ప్లాన్ ఈ ప్లాన్ కాలపరిమితిని 28 రోజుల నుంచి 24 రోజులకు తగ్గింది. రోజుకు 250 నిమిషాల వరకు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు.

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్: మిగతా వాటితో పోలిస్తే ఈ ప్లాన్ కాలపరిమితి గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ కాలపరిమితి 80 రోజులు కాగా, ఇప్పుడు ఏకంగా 65 రోజులకు తగ్గించింది. అయితే, డేటాను 1జీబీ నుంచి 2జీబీకి పెంచింది. సవరించిన ప్లాన్లు అన్నీ కేరళ సర్కిల్ పరిధిలోని ఖాతాదారులకు వర్తిస్తాయి.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

శాంసంగ్‌  అతి తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి, జూలై 27 , VSB NEWS :

 

ప్రముఖ మొబైల్‌ దిగ్గజం  శాంసంగ్‌  అతి తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

గెలాక్సీ ఎం01  కోర్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది..

ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.

1 జీబీ ర్యామ్‌ /16 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో జూలై 29 నుంచి  శాంసంగ్‌, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండన్నాయి.

బ్లాక్, బ్లూ, రెడ్ మూడు రంగులలో ఇవి లభ్యం.

ధరలు

1. జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ 5499  రూపాయలు.
2. జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్‌  6499 రూపాయలు

గెలాక్సీ ఎం01కోర్ ఫీచర్లు

5.3అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్‌
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Continue Reading

Business

స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు..!

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 24 , VSB NEWS :

స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు!

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతూ వచ్చాయి.

దీంతో ఈరోజు కూడా దేశీ ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

హైదరాబాద్‌‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.79.85 వద్ద స్థిరంగా కొనసాగింది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.83.96 వద్ద స్థిరంగా ఉంది.

డీజిల్‌ ధర రూ.80.01 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.

పెట్రోల్ ధర స్థిరంగా రూ.83.43 వద్దనే ఉంది. డీజిల్ ధర రూ.79.73 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

డీజిల్ ధర రూ.81.64 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది.

పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.79.83 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పైకి కదిలాయి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.21 శాతం పెరుగుదలతో 43.42 డాలర్లకు చేరింది.

ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.32 శాతం పెరుగుదలతో 41.20 డాలర్లకు ఎగసింది.

Continue Reading

Business

వామ్మో…మళ్లీ పరుగులు పెట్టిన ధరలు..!

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 24 , VSB NEWS :

వామ్మో.. మళ్లీ పరుగులు పెట్టిన బంగారం ధర.. వెండి మెరుపులు!

బంగారం ధర భగభగమంటోంది. వెండి దూసుకెళ్తోంది.

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

దీంతో ఇప్పుడు గోల్డ్, వెండి కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరిగింది.

దీంతో ధర రూ.62,000కు ఎగసింది. వెండి సరఫరా తగ్గడం సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.17 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1886 డాలర్లకు తగ్గింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం తగ్గుదలతో 23.84 డాలర్లకు క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పైకి కదిలింది.

రూ.49,00కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది.

రూ.250 పెరుగుదలతో రూ.50,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరుగుదలతో. రూ.62,000కు చేరింది.

Continue Reading

Trending

www.vsbnews.in