Connect with us

Business

ఈజీ బై షోరూం ప్రారంభం…

Published

on

స్ధానిక పాత సోమాలమ్మ గుడివీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈజీబై షోరూంను ఆదివారం ప్రారంభించారు.

షోరూంను వైఎస్సార్ కాంగ్రెస్ సిటీ కోఆర్డినేటర్ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

సిటీ శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వివిధ విభాగాలను ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వి భాస్కరరామ్, వైసిపి రూరల్ కోఆర్డినేటర్ ఆకులవీర్రాజు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు, ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మినారాయణ జవ్వార్, ఈజీ బై సిఇఓ ఆనంద్ అయ్యర్, వైసిపి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ లు ప్రారంభించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర ప్రముఖులు బొమ్మన రాజ్ కుమార్, కొల్లేపల్లి శేషయ్య, చాంబర్ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, కోశాధికారి బలభద్ర వెంకట్రాజు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రౌతు సూర్యవరుణ్, మాటూరి సిద్ధార్ధ, నిమ్మలపూడి గోవింద్, రాయుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు‌.

లైఫ్ స్టయిల్ గ్రూప్ కు చెందిన ఈజీబై దేశవ్యాప్తంగా 89 షోరూంలు ఉండగా ఎపిలో ఇది 9వ షోరూం అని ఆనంద్ అయ్యర్ తెలిపారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో వస్త్ర శ్రేణి లభిస్తుందని తెలిపారు.

ఈజీ బై రాజమండ్రి ప్రాంచైజీ అధినేత బలభద్ర శ్రీనివాస్ అతిధులకు సాదరంగా స్వాగతం పలికారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

రూ.1కే 1 జీబీ డేటా..

Published

on

 

బెంగళూరు, జనవరి 28 , VSB NEWS :

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వైఫై డబ్బా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూపాయికే ఒక జీబీ డేటాను అందిం చనున్నట్లు ప్రకటించింది.

సోమవారం సంస్థ సీఈవో కంరం లక్ష్మణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

రూపాయికే ఒక జీబీ డేటాను ప్రయోగాత్మకంగా బెంగళూరులో అందజేయబోతున్నామని, ఇక్కడ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అందజేస్తామని చెప్పారు.

మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా ‘వైఫై డబ్బా’కు ఎవరైనా కనెక్ట్‌ కావచ్చని చెప్పారు.

టీ దుకాణాలు, వ్యాపార కూడళ్లలో లభించే ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవ లను పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు

 

Continue Reading

Business

ట్రయంఫ్ తో చేతులు కలిపిన బజాజ్

Published

on

 

ముంబై , జనవరి 24 , VSB NEWS

యువతను ఆకట్టుకునే బైక్ కోసం ట్రయంఫ్ తో చేతులు కలిపిన బజాజ్

200-800 సీసీ శ్రేణిలో బైకుల తయారీ
2022 నాటికి మార్కెట్లోకి బైకు
ట్రయంఫ్ బ్రాండ్ పైనే అమ్మకాలు
బ్రిటన్ కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహన తయారీదారు ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తో బజాజ్ ఆటో చేతులు కలిపింది. భారత్ లో మధ్య శ్రేణి బైక్ తయారీ కోసం కృషి చేయాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ నూతన తరం బైక్ ను మరో రెండేళ్లలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ప్రధానంగా 200-800 సీసీ బైకుల తయారీపై బజాజ్, ట్రయంఫ్ దృష్టి సారిస్తున్నాయి. యువత మెచ్చే అన్ని అంశాలు తాము రూపొందించబోయే బైకులో ఉంటాయని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ సీఈఓ నిక్ బ్లూర్ వెల్లడించారు. కాగా, రెండు సంస్థల భాగస్వామ్యంతో తయారయ్యే బైకులను ట్రయంఫ్ బ్రాండ్ పైనే విక్రయించనున్నారు. దేశీయంగా తయారయ్యే ఈ బైకులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు

Continue Reading

Business

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్…

Published

on

అమరావతి , VSB NEWS :

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్.. రూ.558 ప్లాన్‌లో భారీ కోత!

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు ఇది చేదువార్తే. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ కాలపరిమితిని భారీగా తగ్గించింది. ఏకంగా 26 రోజులు తగ్గించి భారీ షాక్ ఇచ్చింది. కాలపరిమితిని తగ్గించినా మిగతా ప్రయోజనాలను మాత్రం యథాతథంగా ఉంచింది. ఎయిర్‌టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఇప్పటి వరకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు 82 రోజుల కాలపరిమితితో లభించేవి. ఇప్పుడు మిగతా ప్రయోజనాలను అలాగే ఉంచి కాలపరిమితిని 82 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించింది. అంటే ఏకంగా 26 రోజులన్న మాట.

ఫొటోగ్రఫీ నుంచి మ్యూజిక్ వరకు ఏదైనా ఇష్టమైన కోర్సును ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. షా అకాడమీ ద్వారా నాలుగు వారాలపాటు ఈ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అలాగే, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. జీ5, హూక్, 370కిపైగా లైవ్ టీవీ చానళ్లు, 10 వేలకు పైగా సినిమాలు వీక్షించవచ్చు. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ప్యాక్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.

Continue Reading

Trending

www.vsbnews.in