Connect with us

Movies

“సరిలేరు నీకెవ్వరు” సెకండ్‌ సాంగ్‌ విడుదల…

Published

on

అమరావతి , VSB NEWS :

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్నకలవో..సోల్‌ఫుల్‌ మెలోడీతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఆడియన్స్‌, ఫాన్స్‌ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్‌, సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది. ’సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో..విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీమెలోడీగా ఉంది. ఎమోషనల్‌గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా ఎస్టాబ్లిష్‌ చేస్తోంది.

ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్లో టీమ్ చేసే సందడి అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్‌తో సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు. ఎన్నో మెలోడీ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన మరో సూపర్‌ మెలోడీ సాంగ్‌ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ క్లాసీ సాంగ్‌ లిరిక్స్‌ అర్థవంతంగా ఉన్నాయి. ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ గానం ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది.

’సరిలేరు నీకెవ్వరు’ టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ’సూర్యుడివో చంద్రుడివో’ పాటతో ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్‌ ఫాన్స్‌కి ఫీస్ట్‌ గా సంక్రాంతి ఎంటర్టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజెషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Movies

‘ఒరేయ్ బుజ్జిగా’ ఫస్టులుక్…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 10 , VSB NEWS :

ఆకట్టుకుంటున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫస్టులుక్

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్ బుజ్జిగా’
కీలకమైన పాత్రలో వాణి విశ్వనాథ్
వేసవిలో ప్రేక్షకుల ముందుకు
రాజ్ తరుణ్ కథానాయకుడిగా దర్శకుడు కొండా విజయ్ కుమార్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను రూపొందిస్తున్నాడు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా మాళవిక నాయర్ .. మరో కథానాయికగా హెబ్బా పటేల్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రాజ్ తరుణ్ ను మాళవిక క్రికెట్ బ్యాట్ తో కొట్టబోతున్నట్టు .. కత్తితో దాడి చేస్తున్నట్టు సరదా సన్నివేశాలతో ఈ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ ను బట్టి, ఇది ఒక అల్లరి ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ నరేశ్ .. పోసాని కనిపించనున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న రాజ్ తరుణ్ కి, ఈ సినిమా అయినా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Continue Reading

Movies

పవన్ కల్యాణ్ సినిమాలో రేణూ దేశాయ్?

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , ఫిబ్రవరి 4 ,VSB NEWS :

 

పవన్ కల్యాణ్ సినిమాలో రేణూ దేశాయ్?

పింక్’ రీమేక్ స్టార్ట్ చేసిన పవన్

ఓ పిల్లాడి తండ్రి పాత్రలో రేణూ

గతంలో రెండు సినిమాల్లో నటించిన జంట

సుదీర్ఘ విరామం తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ చిత్రంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటించనున్నారట. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే, మెగా ఫ్యాన్స్ కు పండగే. గతంలో ‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారన్న సంగతి తెలిసిందే.

తాజాగా పింక్ రీమేక్ లో, ఓ కీలకమైన పాత్రను రేణూ పోషించనున్నారని సమాచారం. సినిమాలో ఓ పిల్లవాడి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్, రేణూను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ కలిసి ఓ సినిమాలో నటిస్తే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో సందేహం ఏముంది?

Continue Reading

Movies

జాను’ ప్రీ రిలీజ్ వేడుకకి వేదిక ఖరారు

Published

on

 

వైజాగ్, ఫిబ్రవరి 3, VSB NEWS :

తమిళ .. కన్నడ భాషల్లో ఆకట్టుకున్న కథ
‘జాను’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు
కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్
శర్వానంద్ .. సమంత జంటగా ‘జాను’ సినిమా రూపొందింది. తమిళంలో విజయాన్ని సాధించిన ’96’ సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమారే తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాడు. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది.

రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైజాగ్ – ఎ.యు. సిరిపురంలోని ‘సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్’ ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. అటు సమంత .. ఇటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో వున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తమిళ .. కన్నడ భాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Continue Reading

Trending

www.vsbnews.in