Connect with us

News

ఇక డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ…

Published

on

విజయవాడ , డిసెంబర్ 08 , VSB NEWS :

నాగేంద్రప్రసాద్, ఆర్‌ఎం, ఆర్టీసీ విజయవాడ రీజియన్
ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్‌ పార్సిళ్లకే డోర్‌ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిని వస్త్ర, కూరగాయల వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఏపీ సాక్స్‌), మెడ్‌ప్లస్, అపోలో (మందులు), బ్రిడ్జిస్టోన్‌ (టైర్లు) వంటి సంస్థలు సరుకులతో పాటు విద్యాశాఖ పుస్తకాల రవాణాకు కూడా ఆర్టీసీనే ఎంచుకున్నాయి.

ఈ పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు/సంస్థలకు పంపడానికి రీజియన్‌లో ప్రత్యేకంగా ఒక వ్యాను, రెండు ఆటోలను కేటాయించారు. సరుకు ఎక్కువగా వస్తే డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. వీటికి నగర పరిధిలో బట్వాడా చేయడానికి 50 కిలోల వరకు రూ.20, ఒక క్వింటాల్‌కు అయితే రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ బాగుండడంతో విజయవాడ, మచిలీ పట్నం, గుడివాడల్లో జూలై నుంచి కోరిన వారందరికీ డోర్‌ డెలివరీని అందుబాటులోకి తెచ్చారు. పార్సిల్‌ వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వినియోగదారుడికి ఫోన్‌లో తెలియజేస్తున్నారు.

వారు తమకు డోర్‌ డెలివరీ చేయమని కోరితే నిర్ణీత చార్జి వసూలు చేసి చేరవేస్తున్నారు. సేవలు బాగుండటం, ఇతర సంస్థలకంటే తక్కువ చార్జి, తక్కువ సమయంలోనే బట్వాడా చేస్తుండడం వంటి కారణాలతో ఆర్టీసీలో సరుకు రవాణాకు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు.కొత్తగా కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి : పార్సిల్‌ రంగంలో ఆశించిన ఫలితాలు వస్తుండడంతో ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ అధికారులు కొత్తగా కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇతర సంస్థల మాదిరిగానే కొరియర్‌ కవర్లను బుక్‌ చేస్తారు.

డోర్‌ డెలివరీ చేస్తారు. ఆర్టీసీ సరీ్వసులు పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల పల్లెలకు వెళ్తున్నందున కొరియర్‌ సర్వీసుకు కూడా ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవలు అందుబాటులో లేవు. గత ఏడాది పార్సిల్‌ రవాణా ద్వారా ఈ రీజియన్‌ రూ.12 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.15 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆధునిక పరిజ్ఞానంతో ముందుకు : సరుకు రవాణాలో ఆర్టీసీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల సత్వరమే సరుకును డెలివరీ చేయగలుగుతోంది. సమయం బాగా కలిసి వస్తోంది.

వివిధ చోట్ల నుంచి వచ్చిన పార్సిళ్లను రీజనల్‌ ఆఫీస్‌లోని పార్సిల్‌ విభాగానికి చేరుస్తారు. అక్కడ వాటికి నంబరు కేటాయించి నిర్దేశిత ర్యాకుల్లో ఉంచుతారు. వాటిని ఫొటోలు తీసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. వినియోగదారుడు తమ పార్సిల్‌ తీసుకెళ్లడానికి రాగానే స్కాన్‌ ద్వారా ఆ పార్సిల్‌ ఎక్కడుందో తెలిసిపోతుంది. దానిని కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందజేస్తున్నారు. సరుకు ట్రాకింగ్‌ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు బుక్‌ చేసిన సరుకు/పార్సిల్‌ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.

డోర్‌ డెలివరీకి ఆదరణ ఉంటుంది : ఆర్టీసీ పార్సిల్‌ సేవలు ఇప్పటికే వినియోగదారుల ఆదరణ పొందాయి. కోరుకున్న వారికి పార్సిళ్లను నిర్ణీత రుసుంకే డోర్‌ డెలివరీ చేస్తున్నాం. రీజియన్‌లో కొత్తగా కొరియర్‌ డోర్‌ డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు సైతం కొరియర్‌ వస్తువులు/కవర్లను డెలివరీ చేసేందుకు మాకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రజల ఆదరణ పొందుతుంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , మే 27 , VSB NEWS :

చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
స్ర్రోలింగ్ పాయింట్స్…

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు

కోడెల శివప్రసాద్, డాక్టర్ శివ ప్రసాద్, ఎంవీవీఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమ సహా పలువురి నేతలకు మహానాడు నివాళి

• కోడెల జీవితమంతా పేదలకు సాయం చేశారు
• వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

• డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నాం

• చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

Continue Reading

News

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కడపజిల్లా , మే 27 , VSB NEWS :

పెండ్లిమర్రి మండలం లో ఇసుకరీచ్ ల పై ఏఎస్పి చక్రవర్తి సమావేశం

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

దొంగబిల్లులు పై ఇసుక రవాణా చెసినా రీచ్ లకు అనుమతులున్న చోట నుండి తీసుకు వెళ్లాలని అక్రమాలు జరగకుండా వుండాలన్నారు..

అవసరమైతే రిచ్ ఓనర్లపైన, కాంట్రాక్టు ఉద్యోగులపై కుడా చర్యలుతిసుకుంటామని అవినితి జరగకుండా ఉండాలని చెప్పారు….

ఈ కార్యక్రమం లో డియస్పి సూర్యనారయణ సి ఐ వినయ్ కుమార్ అదికారులు పాల్గొన్నారు….

Continue Reading

News

కృష్ణా జిల్లా మంత్రులు పర్యటన

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కృష్ణా జిల్లా , మే 27 , VSB NEWS :

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని సమావేశం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కొత్తగా 16ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటుచేయాలని సంకల్పం…

మచిలీపట్నం R&B అతిధి గృహం లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సివిల్ సప్లై మంత్రి కొడాలి నానిలకు స్వాగతం పలికిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని…

ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..

మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు సంబందించిన స్థలం పరిశీలన…..

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం….

రాష్ట్రము లో ఇక పై ప్రజలకు అందుబాటులోకి రానున్న వైస్సార్ విలెజ్ క్లినిక్ లు..

రాష్ట్రము లో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన…

గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోలో తెస్తున్నాం..

ప్రతి రోగికి ప్రాధమిక వైద్యం అందాలని ప్రభుత్వం ఉద్దేశ్యం.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు ఉపయోగ పడతాయి….

రాష్ట్రము లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భోధన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా పేదలకు స్పెషలిటీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆశయం..

అన్ని భోధన హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తాము..

ప్రతి టీచింగ్ హాస్పిటల్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం…

జులై 8న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైస్సార్ చిరునవ్వు..కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం…

రాష్ట్రము లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా దంతవైద్యం అందిస్తాము…

Continue Reading

Trending

www.vsbnews.in