Connect with us

Entertainment

టీజర్‌ విడుదల వాయిదా…

Published

on

హైదరాబాద్ , డిసెంబర్ 08 , VSB NEWS:

లాంటి సంబంధం లేకున్నా సరే అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తారు. అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు ధియేటర్ ని అందంగా ముస్తాబు చేసి కళకళాడిస్తారు. సినిమా ధియేటర్ నుండి పోయే వరకు అన్ని దగ్గరుండి మరి చూసుకుంటారు.

ఇలాంటి అభిమానులు మెగా హీరోలకి చాలా మంది ఉన్నారు. అలాంటి అభిమానుల్లో నూర్‌ బాయ్‌ ఒకడు. అతి ముఖ్యమైన అభిమాన సంఘం నాయకుడు అయిన నూర్‌ బాయ్‌ కన్నుమూసాడు. దీనితో మెగా హీరోలు విషాదంలో మునిగిపోయారు..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర టీజర్‌ ను వాయిదా వేసింది. చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైనా గీతా ఆర్ట్స్‌.. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించింది. తమ కుటుంబసభ్యుడిగా భావించే అభిమాని మృతి చెందడడంతో టీజర్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ‘మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు.

నూర్‌ బాయ్‌ మా అందరికీ ఓ కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. ఇలాంటి ఉహించని పరిణామాల వల్ల సినిమాకు సంబంధించి విశేషాలను తెలియచేయడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం’ త్వరలోనే సినిమా టిజర్ ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది..

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

గడ్డి తింటావా’ పాట రిలీజ్ చేసిన వర్మ

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , జూలై 20 VSB NEWS :

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రం నుంచి ‘గడ్డి తింటావా’ అనే పాట రిలీజైంది. వర్మ ‘ ఆన్ లైన్ లో ఈ పాట విడుదల చేసిన అనంతరం సోషల్ మీడియాలో వెల్లడించారు. పక్కా సెటైరికల్ గా ఉన్న ఈ పాట బాణీ కంటే భావమే ప్రధానంగా సాగింది. కాగా, పవర్ స్టార్ చిత్రాన్ని జూలై 25న తన ‘ఆర్జీవీవరల్డ్ థియేటర్ డాట్ కామ్’ వెబ్ సైట్లో రిలీజ్ చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. వర్మ ఇప్పటికే ట్రైలర్ తో సహా సినిమాకు కూడా ఓటీటీ రేట్లు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Continue Reading

Entertainment

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!

Published

on

‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు!
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సరికొత్త రికార్డు సొంతం
చేసుకుంది.
నిన్న యూనిట్ సినిమా ఫస్ట్ లుక్
విడుదల చేయగా, #Radheshyam హాష్ ట్యాగ్ తో
డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
దీంతో తక్కువ సమయంలో సింగిల్ హాష్ ట్యాగ్ తో
3.8 మిలియన్లు.. 24 గంటల్లో 6.3 మిలియన్లకు
పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. సింగిల్
హాష్ ట్యాగ్ తో ఈ స్థాయిలో ట్వీట్లు రావడం ఇదే
తొలిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Continue Reading

Entertainment

నెక్ట్స్ మూవీ మహేశ్‌తోనే

Published

on

తెలంగాణ , ఏప్రిల్ 19, VSB NEWS :

 

రాజమౌళి దర్శకత్వంలో ఇంతవరకు మహేశ్ బాబు నటించలేదు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేశ్‌కు చాలా ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న ఎదురైంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో చేస్తానని మహేశ్ చెప్పారు. అయితే తాజాగా రాజమౌళి తన తదుపరి చిత్రం  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మహేశ్‌తోనా, ప్రభాస్‌తోనా అనే మాటలు వినబడుతున్నాయని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని టీవీ9 యాంకర్ దీప్తి, రాజమౌళిని ప్రశ్నించింది.

అది నిజమేనని..  ప్రొడ్యూసర్ దానయ్యగారితో ఆర్.ఆర్.ఆర్ అయిపోగానే.. నిర్మాత నారాయణ గారి నిర్మాణంలో మహేశ్ బాబుతో తన కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని రాజమౌళి స్పష్టంచేశారు. మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న కాంబినేషన్ ఇది. రాజమౌళి క్లారిటీతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రాంచరణ్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే

Continue Reading

Trending

www.vsbnews.in