Connect with us

CRIME

నిందితులు అరెస్ట్…

Published

on

విశాఖపట్నం , డిసెంబర్ 02 , VSB NEWS :

విశాఖలో నకిలీ కరెన్సీ మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను నగర పోలీసులు అరెస్టు చేశారు.

నిందితలను విశాఖ హెచ్‌బీ కాలనీకి చెందిన కేఎన్‌వీ సత్యనారాయణ, ఆర్‌.జయరాం, బి.పద్మారావుగా గుర్తించారు.

వారి నుంచి రూ.2,96,000 విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సయ్యద్‌ ముజిబుర్‌ రెహమాన్‌, విశాఖ జిల్లా చోడవరంకు చెందిన షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌లు నిందితులకు దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

1:3 నిష్పత్తిలో ఈ దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

సాంకేతిక నైపుణ్యంతో ఈ నకిలీ కరెన్సీని ముద్రించినట్లు భావిస్తున్నామని నగర సీపీ ఆర్‌.కె.మీనా తెలిపారు.

ఈ కరెన్సీని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకోసం ఎన్‌ఐఏ సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.

దీనికి సంబంధించి ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRIME

కన్న తండ్రినే కడతేర్చిన కొడుకు

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  విజయనగరం , మే 13 , VSB NEWS :

కన్న తండ్రినే కడతేర్చిన కొడుకు విజయనగరం జిల్లా పార్వతీపురం: కన్న తండ్రినే కడతేర్చిన దారుణ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంపట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పట్టణంలో గల 13 వార్డు ఇందిరా కాలనీలో నివాసముంటున్న రాయిపిల్లి యండియ్య(47) ను తన సొంత కొడుకే రాయితో బలంగా తలమీద కొట్టాడు.దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి రాయిపిల్లి యండియ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హంతకుడు రాయి పల్లి కళ్యాణ్ పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ దాశరధి తెలిపారు.

Continue Reading

CRIME

వాచ్ మెన్ పై దాడి….వాచ్ మెన్ మృతి..

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కృష్ణా జిల్లా , మే 5 , VSB NEWS :

అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న ఉద్యోగులను ఆడుకున్న వాచ్ మెన్ పై దాడి….వాచ్ మెన్ మృతి..

కూచిపూడి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా..

జిల్లాలోని మొవ్వ మండలం కూచిపూడిలో దారుణం చోటు చేసుకుంది..

కొందరు వైన్‌షాపు ఉద్యోగులు ప్రభుత్వ మద్యం షాపు నుంచి అక్రమంగా మద్యం తరలించేందుకు యత్నించారు.

కాగా ఈ అక్రమ మద్యం తరలింపును గమనించిన వాచ్‌మెన్ మద్దాల కోటేశ్వరరావు ఉద్యోగులను అడ్డుకున్నారు..

ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు… వాచ్‌మెన్‌పై దాడి చేసి మద్యాన్ని తీసుకెళ్లారు..

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అనీ వార్త..

విషయం తెలిసిన కోటేశ్వరరావు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు..

కోటేశ్వరరావు ను కొట్టి పురుగుల మందు తాగించి చంపారు అనీ కుటుంబ సభ్యుల వాదన..

కోటేశ్వరరావు గతంలో ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు..

దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు..

Continue Reading

CRIME

సారాయి కేసులో ఒక వ్యక్తి అరెస్ట్…

Published

on

By

కడియం :

వివిధ ప్రదేశాలలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కడియం సివిల్ పోలీస్ సీఐ శ్రీధర్ విలేకరులకు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మండలం లో దుల్ల నుంచి కడియం వైపు వెళ్లే రోడ్డు మార్గంలో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న సారాయి నీ జేగురుపాడు గ్రామంలో అంబేడ్కర్ కాలనీలో బుధవారం సాయత్రం సుమారు ఐదు గంటలకు కడియం పోలీస్ వారు ఆ గ్రామ వాలంటీర్స్ సిబ్బందితో దాడి చేసి దుల్ల గ్రామానికి సంబంధించిన రాజు అనే వ్యక్తిని  అదుపులోకి తీసుకుని అతని వద్ద 25 లీటర్ల సారని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనది అని తెలిపారు.

Continue Reading

Trending

www.vsbnews.in