Connect with us

Business

పెరగనున్న మొబైల్ కాల్ చార్జీలు…

Published

on

అమరావతి , డిసెంబర్ 02 , VSB NEWS :

డిసెంబర్ 3 నుంచి దేశంలోని అన్ని సర్కిళ్లలో ఛార్జీలను పెంచుతున్నట్లు ఐడియా వోడాఫోన్ ఎయిర్టెల్ ప్రకటించింది తమ నెట్ వర్క్ నుండి మరొక నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై నిమిషానికి ఆరు పైసలు చార్జ్ చేస్తా మని గతంలో ఉన్న ప్లాన్ లతో పోలిస్తే డిసెంబర్ 3న పెరిగే కొత్త ధరలు 42 శాతం అధికంగా ఉంటాయని తెలిపింది

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు

Published

on

ముంబై , మే 27 , VSB NEWS :

 

రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు దూసుకొస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(25) జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్ గా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనున్నారు. దీనికి సంబంధించి రిలయన్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారని బిజినెస్ సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి లాక్ డౌన్ ప్రకటించడానికి వారం రోజులముందే ఈ పరిణామం చోటు చేసుకుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

అనంత్ తోబుట్టువులు ఆకాశ్ అంబానీ, ఇషా ఇద్దరూ ఇప్పటికే వ్యాపార బాధ్యతల్లో చురుగ్గా ఉన్నారు. 2014లో జియో. రిటైల్ వ్యాపారాల బోర్డులలో ఇషా, ఆకాశ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో తన తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించే అనంత్ 18 నెలల్లో 108 కేజీలు బరువు తగ్గడం అప్పట్లో పెద్ద సంచలనం. కాగా ఐదు నెలల క్రితం తన తాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా అతి పిన్న వయస్కుడైన అనంత్ అంబానీ ముఖ్య ఉపన్యాసం (కీ నోట్ అడ్రస్) చేశారు. ఈ సందర్భంగా అనంత్ మాట్లాడుతూ రిలయన్స్ కుటుంబానికి సేవ చేయడమే తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యం అనీ, మార్పునకు భారతదేశం నాయకత్వం వహించాలి.. ఆ మార్పులో రిలయన్స్ ముందంజలో ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు “రిలయన్స్ మేరీ జాన్ హై” (రిలయన్స్ నా జీవితం) అని ప్రకటించడం గమనార్హం

Continue Reading

Business

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

Published

on

, మే 1 , VSB NEWS :

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కంటే తక్కువున్న వారికి కోతలు ఉండవని, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత విధించింది. కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని పూర్తిగా వదులుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది

Continue Reading

Business

అమెజాన్ కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు

Published

on

 

ముంబై , ఏప్రిల్ 29, VSB NEWS :

కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారతదేశంలో ‘అమెజాన్ పే లేటర్’ క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తోంది.

అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. డబ్బులు లేకపోయినా ‘అమెజాన్ పే లేటర్’ ద్వారా వస్తువులు కొని గడువు లోగా వడ్డీ లేకుండా చెల్లించొచ్చు. లేదా 12 నెలల వరకు ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డబ్బులు లేకపోయినా అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించొచ్చు. నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు.

అమెజాన్ పే లేటర్ సర్వీస్ కోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్.

మీరు కూడా అమెజాన్ పే లేటర్ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే అమెజాన్ ఇండియా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ పే లేటర్ సర్వీస్ కేవలం యాప్‌లోనే ఉంది. డెస్క్‌టాప్‌లో పనిచేయట్లేదు.

మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్, ఇతర వివరాలతో కేవైసీ పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అమెజాన్ పే లేటర్ సర్వీస్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.60,000 వరకు అప్పు ఇవ్వాలని నిర్ణయించింది అమెజాన్. ఈ లిమిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటుంది.

Continue Reading

Trending

www.vsbnews.in