Connect with us

Politics

ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే…

Published

on

తిరుపతి , డిసెంబర్ 02 , VSB NEWS :

సీఎం జగన్‌ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

మతం మార్చుకున్న జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు.

మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. జగన్ క్రిస్టియన్ అయితే ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని దుయ్యబట్టారు. తాను ఓడిపోయాను కానీ పడిపోలేదని వ్యాఖ్యానించారు. వేల కోట్లు సంపాదించుకుని సిమెంట్ కంపెనీలు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. వైసీపీది రంగుల రాజ్యం అని విమర్శించారు. ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని ప్రభుత్వ తీరుపై పవన్ ఫైర్ అయ్యారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , మే 27 , VSB NEWS :

చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
స్ర్రోలింగ్ పాయింట్స్…

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు

కోడెల శివప్రసాద్, డాక్టర్ శివ ప్రసాద్, ఎంవీవీఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమ సహా పలువురి నేతలకు మహానాడు నివాళి

• కోడెల జీవితమంతా పేదలకు సాయం చేశారు
• వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

• డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నాం

• చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

Continue Reading

News

మీ పాలన.. మా ప్రశ్నలు…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మే 27 , VSB NEWS :

 

మాజీ మంత్రివర్యులు, దేవినేని ఉమామహేశ్వరరావు..

మీ పాలన.. మా ప్రశ్నలు…

 3 వేల కోట్ల ధరలస్థిరీకరణనిధి అన్నారు.

వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన పంటలు కొనేనాధుడు లేడు.

 రైతును దళారులకు అప్పజెప్పారు.

 ధాన్యం రైతుకు 1082 కోట్లు బకాయిలు చెల్లించాలి.

 రివర్స్ టెండరింగ్ పేరుతో అవినీతికి తెరలేపి సాగునీటి రంగాన్ని నిర్వీర్యంచేశారు, అవునా..? కాదా..? ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Continue Reading

News

డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, మే 27 , VSB NEWS :

 

సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లబిస్తుందని, ఇది తన నమ్మకం అని, అది ఎప్పటికప్పుడు బలపడుతోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ సోషలైజేషన్ కు వెళుతున్నామని, దానికి సాంకేతికతే కారణమని ఆయన అన్నారు.ఈసారి జరుగుతున్నది డిజిటల్ మహానాడు 2020 అని ఆయన పేర్కొన్నారు. ఏటా అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా నిర్వహించే మహానాడుకు ఈ సారి లాక్ డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయన్నారు. అయినా జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపిందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం తెలుగుదేశం మహానాడు-2020 అని ఆయన అన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు ,అంతా దీనిని డౌన్ లోడ్ చేసుకుని మహానాడులో పాల్గొనాలని ఆయన కోరారు.

Continue Reading

Trending

www.vsbnews.in